ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అన్నారంటూ బీజేపీ ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images
ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధరి పిలిచారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది.
కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తోపాటు ఇతర బీజేపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసనకు దిగారు.
‘ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆమెను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంది. ఆమె గెలిచిన తరువాత కూడా అది ఆగలేదు’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


