భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన
కొందరు నాయకులకు ఫోన్ చేసిన తర్వాతే తన మొబైల్‌కు వచ్చే కాల్స్ అన్నీ డైవర్ట్
అవుతున్నాయని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా అన్నారు.
ఈ మేరకు ఆమె బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లను
పేర్కొంటూ ట్వీట్ చేశారు.
‘‘ఈరోజు బీజేపీకి చెందిన కొందరు
మిత్రులతో మాట్లాడిన తర్వాత నా ఫోన్ కాల్స్ అన్ని డైవర్ట్ అవుతున్నాయి. నేను ఇతరులకు
ఫోన్ చేయలేకపోతున్నా. నాకు వచ్చే కాల్స్‌కు సమాధానం ఇవ్వలేకపోతున్నా. ఇక ఈరోజుకి
బీజేపీ, టీఎంసీ, బీజేడీకి చెందిన ఏ ఎంపీకి కూడా ఫోన్ చేయనని హామీ ఇస్తున్నా’’ అంటూ
ఆమె ట్వీట్‌లో రాశారు.
ఈ ట్వీట్‌తో పాటు ఎంటీఎన్‌ఎల్ తనకు పంపించిన నోటీసును కూడా జత చేశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అల్వా చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ పాలిత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బైమ్మైతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆమె చెప్పారు.