ఏ రాష్ట్రానికి ఎంత అప్పు? ఏపీ, తెలంగాణ అప్పులు ఎంతెంత?
2022 మార్చి చివరి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం తమిళనాడుకు అత్యధికంగా రూ. 6,59,868.9 కోట్ల అప్పు ఉండగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులతో ఆ తరువాత రెండు స్థానాలలో ఉన్నాయి.
లైవ్ కవరేజీ
శారద మియాపురం
భారత్‌లో కొత్తగా 16,866 కరోనా కేసులు
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 16,866
కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా కేసులతో క్రియాశీల కేసుల సంఖ్య
1,50,877కు చేరగా, రోజువారీ పాజిటివిటీ రేటు 7.03గా ఉంది.
కరోనాతో ఆదివారం 41 మంది మృతి చెందగా,
18,148 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ద్రౌపది ముర్ము: నేడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం
ఫొటో సోర్స్, Getty Images
భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము
సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా
ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఆమె దేశానికి 15వ రాష్ట్రపతి కానున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం,
పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో ఉదయం 10:15 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం
జరగనుంది.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ,
ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీని తర్వాత దేశాన్ని ఉద్దేశించి ద్రౌపది ముర్ము
ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమం తర్వాత ఆమె రాష్ట్రపతి
భవన్‌కు బయల్దేరతారు. అక్కడ త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ
వందనం సమర్పిస్తారు. తర్వాత పదవి నుంచి నిష్క్రమించనున్న రామ్‌నాథ్ కోవింద్‌ను సత్కరిస్తారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రామ్‌నాథ్
కోవింద్‌తో పాటు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని
నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మంత్రి మండలి సభ్యులు, గవర్నర్లు,
ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, పార్లమెంట్ సభ్యులు, మిలిటరీ అధికారులు
పాల్గొంటారు.
ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము,
ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో గెలిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల
వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్లను ఎప్పటికప్పుడు
తెలుసుకోవడం కోసం ఈ పేజీని ఫాలో అవండి.