లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు కలుద్దాం.
అంతవరకు సెలవు.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానిక మరొక రెండేళ్లు పడుతుందని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు కలుద్దాం.
అంతవరకు సెలవు.
నీట్ పరీక్ష రాసే అమ్మాయిల చేత లోదుస్తులు విప్పించారనే ఆరోపణలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది.
త్వరలోనే ఈ కమిటీ కేరళలోని కొల్లాం వెళ్లనుంది.
కేరళలో అమ్మాయిల చేత లోదుస్తులు విప్పించారనే వార్తలు కేంద్ర విద్యాశాఖ దృష్టికి వచ్చాయి. అలాగే కేరళ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు కూడా ఈ విషయం మీద లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానిక మరొక రెండేళ్లు పడుతుందని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు.
‘పోలవరం 2022 ఏప్రిల్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. కుడి కాలువ పనులు 93శాతం, ఎడమ కాలువ పనులు 72శాతం పూర్తయ్యాయి.
అనుకున్న గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) ఒక కమిటీ వేసింది.
ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం, 2024 జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం.’ అని రాజ్యసభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి తెలిపారు.
నిధులను ఖర్చు చేసే సామర్థ్యం లేకపోవడం, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, తగిన విధంగా నిర్మాణం చేయకపోవడం, ప్లానింగ్, కోఆర్డినేషన్ లేకపోవడం, కరోనా సంక్షోభం వంటి కారణాల వల్ల సకాలంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని మంత్రి వివరించారు.

ఫొటో సోర్స్, AJAY AGGARWAL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను తదుపరి విచారణ వరకు అరెస్టు సహా మరేవిధమైన చర్యలు చేపట్టవద్దని సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆమె పై వివిధ రాష్ట్రాలలో 9 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఈ కేసులన్నింటినీ ఒకేచోటకు చేర్చి విచారణ జరపాలని, దిల్లీలో నమోదైన ఎఫ్ఐఆర్‌తో వీటిని అనుసంధానించాలని నూపుర్ శర్మ కోర్టును కోరారు.
తన ప్రాణాలకు ప్రమాదముందని ఆమె తన పిటిషన్ లో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్ పై ఆగస్టు 10న విచారణ జరపాలని నిర్ణయించిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పటి వరకు నూపుర్ శర్మపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిని డంపర్‌తో తొక్కి చంపించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
మీడియా కథనాల ప్రకారం...
‘మేవాత్ జిల్లాలోని తావడు డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్, నుహ్‌లోని అక్రమ మైనింగ్ కేసును విచారించడానికి వెళ్లారు.
ఇద్దరు పోలీసులతో ఆయన మంగళవారం 11.50 ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఒక డంపర్‌ను ఆపారు.
పేపర్లు అడగ్గా డ్రైవర్ వేగం పెంచి డంపర్‌ను పోలీసుల కారు మీదకు ఎక్కించాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్, గన్‌మెన్ తప్పించుకోగా డీఎస్పీ సురేంద్ర మాత్రం చనిపోయారు.’
1994లో అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా చేరిన సురేంద్ర ఆ తరువాత డీఎస్పీ స్థాయికి ఎదిగారు. మరొక నాలుగు నెలల్లో ఆయన రిటైర్ కానున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి మార్గరెట్ అల్వా మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ తదితర ప్రతిపక్ష నేతల సమక్షంలో ఆమె నామినేషన్ సమర్పించారు.
రాజస్థాన్ మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి అయిన మార్గరెట్ అల్వాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నిలపాలని 17 ప్రతిపక్ష పార్టీలు ఆదివారం నాడు నిర్ణయించాయి.
నామినేషన్ దాఖలు చేయటానికి మంగళవారమే తుది గడువు.
ఆగస్టు 6వ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ అభ్యర్థి, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధాన్కర్‌తో మార్గరెట్ అల్వా తలపడుతున్నారు.
జగదీప్ ధాన్కర్ సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర బీజేపీ ముఖ్యనేతల సమక్షంలో నామినేషన్ సమర్పించారు.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10వ తేదీతో ముగుస్తుంది.

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, Getty Images
ఒకవైపు డాలరుతో మారకంలో భారత రూపాయి విలువ చరిత్రలో కనిష్ట స్థాయి రూ. 80కి పతనమైతే.. మరోవైపు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు సైతం 15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గత వారంలో 8.062 కోట్ల డాలర్లు తగ్గిపోయి 580.252 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
ఇందుకు ప్రధాన కారణం.. విదేశీ కరెన్సీ ఆస్తి (ఫారిన్ కరెన్సీ అసెట్ – ఎఫ్‌సీఏ) పడిపోవటం అని ఆర్‌బీఐ చెప్తోంది. జూలై 8వ తేదీ నాటికి ఎఫ్‌సీఏ 518.089 కోట్ల డాలర్లకు తగ్గింది. పౌండ్, యూరో, యెన్ వంటి కరెన్సీల విలువల్లో మార్పులు ఎఫ్‌సీఏ మీద ప్రభావం చూపుతాయి.
అలాగే.. భారతదేశపు బంగారు నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి. గత వారం 1.236 కోట్ల డాలర్లు తగ్గి 39.186 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ చరిత్రలో అత్యంత వేడి రోజుగా మంగళవారం రికార్డులకెక్కనుంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 సెంటీగ్రేడ్లుగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
బ్రిటన్‌లో 2019లో 38.7 సెంటీగ్రేడ్లుగా నమోదైన ఉష్ణోగ్రతే ఇప్పటివరకూ దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత. అయితే సోమవారం ఉష్ణోగ్రతలు దానికి దగ్గరగా వచ్చాయి. సఫ్లాక్‌లో 38.1 సెంటీగ్రేడ్ల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు వేల్స్‌లో 37.1 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో చరిత్రలో అత్యధిక వేడి రోజు నమోదైంది.
ఇంగ్లండ్‌లో చాలా ప్రాంతాల్లో విపరీతమైన వేడి ఉంటుందని.. వాతావరణ కార్యాలయం రెడ్ వార్నింగ్ జారీ చేసింది. లండన్ నుంచి మొదలుకుని మాంచెస్టర్, యార్క్ వరకూ.. రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఈ ప్రాంతంలో ప్రాణాలకు ముప్పు కలిగించేంత వేడి నెలకొంటుందని హెచ్చరించింది.
వేడి నుంచి తప్పించుకోవటానికి నదులు, సరస్సుల్లో దిగిన వారిలో కనీసం నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది.
మంగళవారం నాడు ప్రయాణాలు చేయవద్దని నెట్‌వర్క్ రైలు హెచ్చిరక జారీ చేసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికలో ‘రెడ్ జోన్’ ప్రాంతంలో రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది.


ఫొటో సోర్స్, FACEBOOK/BHASKER KOORAPATI
భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఉన్న విప్లవ కవి వరవరరావుకు మధ్యంతర బెయిల్‌ను ఆగస్టు 10వ తేదీ వరకూ పొడిగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రస్తుతం 82 ఏళ్ల వయసున్న వరవరరావు ఆరోగ్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిలు మంజూరు చేయాలని చేసుకున్న దరఖాస్తును విచారిస్తున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
‘‘ఈ దరఖాస్తుపై తదుపరి విచారణ జరిగే వరకూ నేటి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి’’ అని ధర్మాసనం పేర్కొంది. ఆగస్టు 10వ తేదీని తదుపరి విచారణ చేపడతామని చెప్పింది.
వరవరరావుకు ఇంతకుముందు బాంబే హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక మెడికల్ బెయిలు నేటితో (మంగళవారంతో) ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తన బెయిల్‌ను పొడిగించాల్సిందిగా వరవరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆయన బెయిలును ఆగస్టు 10వ తేదీ వరకూ కొనసాగిస్తూ జస్టిస్ ఉమేష్ లలిత్ సారథ్యంలో, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ఫొటో సోర్స్, AFP/GETTYIMAGES
బాలీవుడ్ వెటరన్ సింగ్ భూపిందర్ సింగ్ సోమవారం సాయంత్రం కన్నుమూశారు.
గత 10 రోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న 82 ఏళ్ల భూపిందర్ సింగ్ సోమవారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని ఆయన భార్య మిథాలీ సింగ్ చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమృత్‌సర్‌లో జన్మించిన భూపిందర్ సింగ్, దిల్లీలోని వెస్ట్ పటేల్ నగర్‌లో పెరిగారు.
తొలుత దిల్లీలోని ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లో పనిచేశారు. ఆ తర్వాత సినిమా ‘హకీకత్’ సినిమాలోని ‘హోకే మజ్బూర్ ముజే’ పాటతో సినీ సంగీతంలో ప్రవేశించారు.
‘నామ్ గమ్ జాయేగా’, ‘కరోగే యాద్ తో హర్ బాత్ యాద్ ఆయేగీ’, ‘దిల్ డుండ్తా హై’ వంటి మంచి పాటలు ఎన్నో పాడారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

భద్రాచలం దగ్గర గోదావరి మళ్లీ తగ్గడం ప్రారంభం అయింది. ఆదివారం మధ్యాహ్నం వరకూ గోదావరి వరద వేగంగా తగ్గింది. అయితే పై నుంచి వచ్చే వాగుల ప్రవాహం పెరగడంతో ఆదివారం సాయంత్రం నుంచి గోదావరి వరద పెరిగింది. దాదాపు సోమవారం సాయంత్రం వరకు నీరు నిలకడగా ఉంది. వరద ప్రవాహం పెద్దగా తగ్గలేదు.
మళ్లీ సోమవారం రాత్రి నుంచి వరద తగ్గి దిగువకు ప్రవహించడం మొదలైంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి మట్టం 54.60 అడుగులుగా ఉంది.
మరోవైపు మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో వరద తగ్గింది.
అయితే, పోలవరం ముంపు మండలాల్లో మాత్రం వరద ఉధృతి అలాగే కొనసాగుతోంది. కూనవరం, వర రామచంద్రపురం, చింతూరు మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాల్లో నీరు ఇంకా అలాగే ఉంది. ఆయా గ్రామాల వారు పునరావాస కేంద్రాల్లోనూ, దగ్గరలోని కొండల దగ్గర ఎత్తైన ప్రదేశాల్లోనూ నివాసం ఉంటున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ముందంజలో ఉన్నారు.
కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు సోమవారం జరిగిన మూడో రౌండ్ ఓటింగ్‌లో రిషి సునక్ అగ్రస్థానంలో నిలిచారు.
తక్కువ ఓట్లు పోలైన ఎంపీ టామ్ టుగెండ్‌హమ్ ఈ రేసు నుంచి తప్పుకున్నారు. రిషి సునక్ తర్వాత వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డెంట్ రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ మూడో స్థానంలో ఉండగా, కేమీ బడెనోచ్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.
జూలై 14న జరిగిన ఓటింగ్‌లో కూడా ఈ నలుగురే తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. అప్పుడు రుషి సునక్ 101 ఓట్లతో అందరి కంటే ముందంజలో ఉండగా, మూడో రౌండ్‌లో ఆయనకు 115 ఓట్లు పోలయ్యాయి.
మంగళవారం ఈ నలుగురు అభ్యర్థులకు మరోసారి ఓటింగ్ జరగనుంది. చివరగా ఇద్దరు అభ్యర్థులు మిగిలేంత వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంటుంది. జూలై 21 వరకు ఈ ప్రక్రియ సాగే అవకాశం ఉంది.
చివరకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు, పోస్టల్ ఓటు ద్వారా పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు. కొత్త ప్రధానిని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు.