భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం

లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఇంకా ఎవరైనా అక్కడ ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా ఎస్పీ కోరారు. సురక్షిత ప్రాంతాల ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు కావొద్దని సూచించారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. దేశాధ్యక్షుడి రాజీనామాతో శ్రీలంకలో సంబరాలు

    శ్రీలంక

    ఫొటో సోర్స్, REUTERS

    శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష ఎట్టకేలకు అధికారికంగా రాజీనామా చేశారు. శ్రీలంకలో నిరసనలు పతాక స్థాయికి చేరుకోవడంతో రాజపక్ష దేశం విడిచి సింగపూర్‌కు పారిపోయారు.

    పదవి నుంచి వైదొలిగిన వెంటనే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించడంతో రాజపక్ష ముందే దేశం విడిచి పారిపోయరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    రాజపక్ష రాజీనామా లేఖను అందుకున్నట్లు శ్రీలంక స్పీకర్ ధృవీకరించారు. దీంతో, అధ్యక్షుడు అధికారికంగా రాజీనామా చేసినట్టు లెక్క.

    దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యవహరిస్తారని స్పీకర్ మహింద యాపా అభయవర్ధన వెల్లడించారు. తదుపరి చర్యలు ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరుగుతాయని స్పీకర్ తెలిపారు.

    రేపు జూలై 16న అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడాలని నిరసనకారులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు, ఎంపీలందరూ పార్లమెంట్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    రాజపక్ష రాజీనామాతో శ్రీలంక రాజధాని కొలొంబోలో సంబరాలు చోటుచేసుకున్నాయి. ఈ వార్త విన్న వెంటనే నిరసనకారులు డాన్సులు చేస్తూ వేడుక చేసుకున్నారు.

    "పట్టరానంత ఆనందంగా ఉంది. అంతకన్నా ఎక్కువ ఉపశమనంగా ఉంది. ఇక మేమంతా వెనక్కు వెళ్లి మా పనులు చేసుకోవచ్చు. ఇప్పటికే మేం చాలా అలిసిపోయాం. ఈ క్షణాన్ని మేం విజయంగా భావిస్తున్నాం" అని విరాగ పెరేరా బీబీసీతో అన్నారు.

    శ్రీలంక

    ఫొటో సోర్స్, Getty Images

    రాజపక్ష ముందుగా మంగళవారం రాత్రి మాల్దీవ్స్‌కు పారిపోయి, అక్కడి నుంచి గురువారం ఉదయం సింగపూర్ చేరుకున్నారు. ఆయన భార్య, ఇద్దరు బాడీగార్డులు కూడా ఆయన వెంట ఉన్నారని రిపోర్టులు వచ్చాయి.

    రాజపక్ష తమ దేశంలో ఆశ్రయం కోరలేదని, ఆశ్రయం పొందలేదని సింగపూర్ విదేశాంగ శాఖ పేర్కొంది.

    "సింగపూర్ సాధారణంగా ఆశ్రయం కోసం అభ్యర్థనలను స్వీకరించదు" అని పేర్కొంది.

  2. బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.

    ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.