శ్రీలంక: ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు

కొలంబోలోని ప్రధాని నివాసం ముందు కొన్ని గంటలుగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తన పదవికి రాజీనామా చేసేందుకు విక్రమసింఘే అంగీకరించిన కొంతసేపటికే ఈ ఘటన జరిగింది.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    శ్రీలంకలో తాజా పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఈ లింకును క్లిక్ చేయండి.

  2. బ్రేకింగ్ న్యూస్, శ్రీలంక: ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు

    ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు
    ఫొటో క్యాప్షన్, ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిప్పు

    శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.

    కొలంబోలోని ప్రధాని నివాసం ముందు కొన్ని గంటలుగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.

    ‘‘ప్రధాని రణిల్ విక్రమ సింఘే వ్యక్తిగత నివాసంలోకి చొరబడిన నిరసనకారులు నిప్పంటించారు’’ అని ఆయన కార్యాలయ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    తన పదవికి రాజీనామా చేసేందుకు విక్రమసింఘే అంగీకరించిన కొంతసేపటికే ఈ ఘటన జరిగింది. పదవికి రాజీనామా చేస్తానని రణిల్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  3. ఆంగ్లేయులను 26 నిమిషాల్లోనే ఓడించిన అమెరికా ‘హైదర్ అలీ’ ఎవరు?

  4. శ్రీలంక: అధ్యక్ష భవనాన్ని నిరసనకారులు ఎలా ముట్టడించారో చూడండి...

    అధ్యక్ష భవనం

    ఫొటో సోర్స్, epa

    కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని వేలాదిమంది ప్రజలు ముట్టడిస్తున్నట్లు తెలిపే వీడియోను శ్రీలంక వార్తా సంస్థ న్యూస్ వైర్ విడుదల చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఆ వీడియోలో వేలాదిమంది నిరసనకారులు, అధ్యక్ష భవనంలోకి వెళ్లడాన్ని చూడొచ్చు.

    శ్రీలంకలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతకు నిరసనగా శనివారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

    ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కొలంబోకు చేరుకొని అధ్యక్ష నివాసం వద్ద గుమిగూడారు.

    గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, ఆందోళనకారులు భారీగా తరలిరావడంతో అధికారులు వారిని ఆపలేకపోయారు.

    సోషల్ మీడియాలో కనిపిస్తోన్న వీడియో ఫుటేజీల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంలో తిరుగుతూ, విలాసవంతమైన గదుల్లో విశ్రాంతి తీసుకుంటూ, స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్‌ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా

  6. వైఎస్సాఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్

    ప్లీనరీ, జగన్

    ఫొటో సోర్స్, YSRCP/ FACEBOOK

    వైఎస్సాఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

    అనంతంర వైఎస్ జగన్ ప్లీనరీ ముగింపు ప్రసంగం చేశారు. విజయవాడ- గుంటూరు మధ్య మహా సముద్రం కనిపిస్తోందని, ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా ఉందని ఆయన అభివర్ణించారు.

    ‘’13 ఏళ్లుగా నాపై ఇదే ప్రేమ, అభిమానం, నమ్మకం చూపిస్తున్నారు. వర్షం పడుతున్న ఎవరూ చెదరలేదు. ఇది ఆత్మీయుల సునామీ. మహా సైన్యానికి ప్రేమతో సెల్యూట్ చేస్తున్నా. కార్యకర్తల కష్టం వల్లనే మన ప్రభుత్వం ఏర్పడింది. నన్ను టార్గెట్ చేసిన పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్, టీడీపీలు కలిసి నాపై అక్రమ కేసులు పెట్టాయి. ఓదార్పు యాత్ర చేయొద్దని వ్యతిరేకించాయి. ఆనాడు లొంగిపోయి ఉంటే ఈరోజు జగన్ మీ ముందు ఉండేవాడు కాదు. దేవుడు స్క్రిప్టు మరోలా రాశాడు. ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమై నేడు 150 మందికి చేరాం. ఒక్క ఎంపీ నుంచి 22మందికి చేరాం. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. జగన్ కనపడకుండా పోవాలని కుట్రలు చేశారు’’ అని అన్నారు.

    ప్లీనరీ

    ఫొటో సోర్స్, yspcp/face book

    టీడీపీని పెత్తందార్ల పార్టీ అని పిలిచారు. ‘వెన్నుపోటు’ అనేది చంద్రబాబు పార్టీ సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. ఆయన ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వమే కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా మార్చిందని గుర్తు చేశారు.

    ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యను అందించడమే మా లక్ష్యం. అందుకే బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం. కానీ, చంద్రబాబు దాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా 19వేల కోట్లు చెల్లించాం. నాడు- నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ధర్మం వైపు మనం ఉన్నాం, అధర్మం వైపు వాళ్ళు ఉన్నారు. మూడేళ్లలో మేనిఫెస్టోలో పేర్కొన్న 95 శాతం హామీలు నెరవేర్చాం. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నాం. జగన్ చెప్పేది నిజమని నమ్మితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయండి’’ అంటూ ఆయన ప్రసంగించారు.

  7. అమర్‌నాథ్ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్: ‘నేను, నా కుటుంబం సేఫ్.. కళ్లముందే టెంట్లు అన్నీ కొట్టుకుపోయాయి’

  8. గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం, ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేత

    ధవళేశ్వరం బ్యారేజ్

    గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఈ సీజన్‌లో తొలిసారిగా వరద ప్రవాహం కనిపిస్తోంది. మహారాష్ట్ర సహా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

    ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ వద్ద స్పిల్ వే నుంచి 48 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 175 క్రస్ట్ గేట్లని ఎత్తి మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు.

    శనివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇప్పటికే పోలవరం వద్దబ్యాక్ వాటర్ కారణంగా నిర్వాసిత గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పోలవరం, దేవిపట్నం మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా దిగువన కోనసీమ లంకల్లో వరద నీరు ప్రవేశిస్తోంది. ప్రవాహం మరింత పెరిగితే లంక వాసులకి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.

  9. Investment: మ్యూచువల్ ఫండ్స్ వాడుకుని ఇల్లు కొనుక్కోవచ్చా?

  10. క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్‌నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా

  11. అమర్‌నాథ్: జమ్మూ-కశ్మీర్ అధికారులకు కాల్ చేయాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు

    జమ్మూ-కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహలో క్లౌడ్ బరస్ట్ అయిన ఘటన నేపథ్యంలో, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవీ..

    NDRF: 011-23438252, 011-23438253

    కశ్మీర్ డివిజనల్ హెల్ప్‌లైన్: 0194-2496240

    ష్రైన్ బోర్డ్ హెల్ప్‌లైన్: 0194-2313149

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. ఆంధ్రప్రదేశ్: అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం జగన్

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

    కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు.

    ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, సీఎంఓ అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌశిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై హిమాంశు కౌశిక్‌ అక్కడి అధికారులను సంప్రదిస్తారు.

  13. బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన రిషి సునక్

  14. అమర్‌నాథ్ వరదలు: పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటివరకు 16 మంది మృతి, సుమారు 40 మంది గల్లంతు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అమర్‌నాథ్ గుహ సమీపంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారని, సుమారు 40 మంది గల్లంతయ్యారని ఏఎన్‌‌ఐ తెలిపింది.

    కొండచరియలు విరిగిపడిన ఘటనలు లేవని, వర్షం పడుతూనే ఉందిగానీ, సహాయక చర్యలకు ఆటంకం లేదని ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వల్ తెలిపినట్టు ఏఎన్ఐ వెల్లడించింది.

    నాలుగు NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, భారత ఆర్మీ, SDRF, CRPF, ఇతర బృందాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని డీజీ తెలిపారు.

  15. అమెరికా: అబార్షన్ హక్కులను పునరుద్ధరించే ఆదేశంపై సంతకం చేసిన బైడెన్

    బైడెన్

    ఫొటో సోర్స్, twitter/President Biden

    అబార్షన్ హక్కులను పునరుద్ధరించడానికి ఫెడరల్ చట్టం జారీ చేయడమే "వేగవంతమైన మార్గం"గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఆ మేరకు శుక్రవారం అబార్షన్ హక్కులను రక్షించే ఉత్తర్వుపై సంతకం చేశారు.

    "రో vs వేడ్ చట్టాన్ని రద్దు చేయాలనే సుప్రీంకోర్టు తీర్పు తరువాత, మహిళల అబార్షన్ హక్కులను రక్షించేందుకు ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశాను. తీర్పు తరువాత నేను ప్రకటించిన చర్యలను ఇది అధికారికం చేస్తుంది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం మరి కొన్ని చర్యలు చేపట్టేందుకు అవకాశం ఇస్తుంది" అంటూ బైడెన్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మహిళలకు అబార్షన్ హక్కును రద్దు చేస్తూ ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును "పచ్చి రాజకీయ అధికారపు చర్య"గా బైడెన్ పేర్కొన్నారు.

    కోర్టు తీర్పు తరువాత, ఈ అంశంలో బలమైన చర్య తీసుకోవాలని బైడెన్‌పై ఒత్తిడి వచ్చింది.

    అయితే, బైడెన్ ఆదేశాలు పరిమిత ప్రభావాన్ని చూపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. అబార్షన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఎత్తివేయవచ్చు కానీ, అబార్షన్ హక్కులను పూర్తిగా పునరుద్ధరించలేవని భావిస్తున్నారు.

  16. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ఫోన్‌ కాల్‌తో చైనా ఎందుకు కలవరపడుతోంది?

  17. Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?

    షింజో అబే

    ఫొటో సోర్స్, REUTERS

    ఫొటో క్యాప్షన్, షింజో అబే

    జపాన్‌లో సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రధాన మంత్రిగా షింజో అబేకు మంచి పేరుంది. విదేశాంగ విధానంపైనా ఆయన తనదైన ముద్రవేశారు. ఆర్థిక వ్యూహాల్లోనూ ఆయనకు మంచి నైపుణ్యముంది. ఆయన వ్యూహాలను ‘‘అబెనామిక్స్’’గా పిలుస్తుంటారు.

    67ఏళ్ల అబేను ‘‘కనర్జేటివ్ నేషనలిస్టు’’గా రాజకీయ విశ్లేషకులు చెబుతారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్‌డీపీ)కి రెండుసార్లు ఆయన విజయం తెచ్చిపెట్టారు.

    2006లో ప్రధాన మంత్రిగా మొదటిసారి బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏడాదికే ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అప్పట్లో దీనిచుట్టూ వివాదం కూడా రాజుకుంది.

  18. అమర్‌నాథ్: క్లౌడ్ బరస్ట్ కారణంగా కనీసం 14 మంది మృతి

    అమర్‌నాథ్

    ఫొటో సోర్స్, ANI

    అమర్‌నాథ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు ముంచెత్తుతోంది.

    శుక్రవారం సాయంత్రం అమర్‌నాథ్ గుహ సమీపంలో మేఘాల విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) కారణంగా కనీసం 14 మంది మరణించినట్టు సమాచారం.

    ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ పాదయాత్రపై తాత్కాలిక నిషేధం విధించారు.

    సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనలో గాయపడ్డవారి సంఖ్య, గల్లంతయిన వారి సంఖ్య స్పష్టంగా చెప్పడం కష్టమని ఆర్మీ కంట్రోల్ రూం చెబుతోంది.

    అయితే, 30-40 మంది గల్లంతయ్యారని, వారి కోసం వెతుకున్నారని ఇంతకు ముందు అధికారులు తెలిపారు.

    NDRF, SDRF సహా రెస్క్యూ సంస్థలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    గుహ వద్ద వానల్లో చిక్కుకున్నవారిని పంజ్‌తర్ణికి తరలించినట్టు ఆల్ ఇండియా రేడియో వెల్లడించిది.

    ఆ మేరకు ట్వీట్ చేస్తూ, "శనివారం తెల్లవారుజామున 3.38 గంటల వరకు తరలింపు ప్రక్రియ కొనసాగిందని, ట్రాక్‌పై ప్రయణికులు ఎవరూ మిగల్లేదని, ఇప్పటి వరకు 15 వేల మందిని సురక్షితంగా తరలించినట్టు" తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    అమర్‌నాథ్ గుహ వద్ద క్లౌడ్ బరస్ట్ కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులకు సహాయం అందజేస్తామని తెలిపారు.

    రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

  19. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్న ఈలాన్ మస్క్

    ఈలాన్ మస్క్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఈలాన్ మస్క్

    ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించారు. ఒప్పందంలో పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని మస్క్ ఆరోపించారు.

    ఫేక్ అకౌంట్లు, స్పామ్‌ల గురించి సరైన సమాచారం ఇవ్వని కారణంగానే 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మస్క్ ప్రకటించారు.

    అపర కుబేరుడు ఈలాన్ మస్క్‌కు, ట్విట్టర్‌కు మధ్య దీర్ఘ కాలంగా కొనసాగుతున్న కథలో ఇది తాజా మలుపు.

    ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు 44 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు మస్క్.

    అయితే, కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్విట్టర్ తెలిపింది.

    "ఈలాన్ మస్క్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అంగీకరించిన ధర వద్ద, నిబంధనలతో అమలుచేసేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉంది" అని ఆ సంస్థ చైర్మన్ బ్రెట్ టేలర్ తెలిపారు.

    ఈ అంశంలో చట్టపరంగా ముందుకు సాగుతామని అన్నారు.

  20. ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం

    జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు తెలుగు రాష్ట్రాల న్యూస్ అప్‌డేట్స్ కోసం ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.