జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న అభిజిత్ దీప్కే

ఫొటో సోర్స్, x/CockroachisBack
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో వేల మంది పాల్గొన్నట్లు కాక్రోచ్ ఈజ్ బ్యాక్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
వేదిక వద్దకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేరుకొని నిరసనల్లో పాల్గొన్నారు. వేదికపై నుంచి నినాదాలు చేశారు.
అక్కడ గుమిగూడిన నిరసనకారులంతా ‘ధర్మేంద్ర ప్రదాన్ గద్దె చోడ్’ అంటూ నినాదాలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీజేపీ మద్దతుదారుల నిరసనలు
అయితే, కాక్రోచ్ పార్టీ నిరసనలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ పరిసరాల్లోని బారికేడ్ల బయట బీజేపీ మద్దతుదారులు నిరసనలు మొదలుపెట్టినట్లు, వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించినట్లు బీబీసీ ప్రతినిధి పవన్‌కాంత్ తెలిపారు.
సీఆర్‌పీఎస్ పోలీసులు బీబీసీకి వెల్లడించిన వివరాల ప్రకారం, జంతర్ మంతర్‌లో మొత్తం 700 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని మోహరించారు.




