మహారాష్ట్ర: ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. రాజస్థాన్: టైలర్ హత్య కేసును విచారించనున్న ఎన్‌ఐఏ

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

    ఫొటో సోర్స్, Facebook/AmitShah

    రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన టైలర్ హత్య కేసును విచారించాల్సిందిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

    ఇందులో విదేశీ సంస్థల కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా విచారించనున్నట్లు హోంశాఖ తెలిపింది.

    మహ్మద్ ప్రవక్త మీద బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉదయ్‌పుర్‌లోని కన్నయ్య లాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

    దీనికి ప్రతీకారంగా రియాజ్ అఖ్తర్, ఘోష్ మహ్మద్ అనే ఇద్దరు లాల్‌ను తల నరికి చంపేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. ఆంధ్రప్రదేశ్: రూ.68 లక్షల మద్యం ధ్వంసం

    మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్న రోడ్డు రోలర్

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా రేణిగుంటలో అక్రమంగా పట్టుబడిన మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు.

    సుమారు రూ.68 లక్షల విలువైన 32,341 సీసాలను ధ్వంసం చేసినట్లు తిరుపతి ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

    తమిళనాడు నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోకి మద్యం తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

  3. బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర: బలపరీక్షపై సాయంత్రం సుప్రీం కోర్టులో విచారణ

    మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష చేపట్టాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై శివసేన దాఖలు చేసిన పిటీషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

    ఈ రోజు సాయంత్ర 5 గంటలకు ఆ పిటీషన్ మీద కోర్టు విచారణ చేపట్టనుంది.

  4. అగ్నిపథ్: ‘బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర అడుగుతోంది’

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ

    ఫొటో సోర్స్, Facebook/Mamata Banerjee

    అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలోకి తీసుకునే అగ్నివీరులను బీజేపీ కార్యకర్తలుగా అభివర్ణించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

    ‘సైన్యంలో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు రాష్ట్ర ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం మాకు లేఖ రాసింది.

    బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్లు చెబుతున్నారు. కానీ మనం ఎందుకు ఇవ్వాలి? మన రాష్ట్ర యువతకే తొలి ప్రాధాన్యం ఇస్తాం.’ అని మమతా బెనర్జీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షపై సుప్రీం కోర్టుకు వెళ్తాం... శివసేన

    రేపు అసెంబ్లీని సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించాలన్న మహారాష్ట్ర గవర్నర్ ఆదేశాలపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.

    ‘ఇలా ఆదేశాలు ఇవ్వడం చట్టవ్యతిరేకం. 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల అన్హరత పిటీషన్ సుప్రీం కోర్టు విచారణలో ఉంది.’ అని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్రలో రేపు బలపరీక్ష

    మహారాష్ట్రలో రేపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్నారు.

    మహారాష్ట్ర విధాన సభ రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.

    శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేలతో ఆయన అస్సాంలో క్యాంప్ పెట్టారు.

    శివసేన తమదే అంటూ ఏక్‌నాథ్ శిందే చెబుతున్నారు.

  7. కొలంబియా జైలులో మంటలు... 51 మంది మృతి

    కొలంబియా జైలు వద్ద మృతుల బంధువులు

    ఫొటో సోర్స్, Reuters

    కొలంబియాలోని ఒక జైలులో చెలరేగిన మంటల వల్ల సుమారు 51 మంది చనిపోయారు.

    ‘మంగళవారం పొద్దున తులువాలోని జైలులో ఖైదీలు గొడవకు దిగారు. ఈ గొడవను ఆపేందుకు సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించారు.

    కానీ గార్డులను అడ్డుకునేందుకు పరుపులకు కొందరు ఖైదీలు నిప్పు పెట్టారు.’ అని కొలంబియా నేషనల్ ప్రిజన్ అథారిటీ అధికారులు తెలిపారు.

    ఈ ఘటనలో దాదాపు 30 మంది గాయపడ్డారు.

    ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ఎవరూ జైలు నుంచి తప్పించుకోలేదని అధికారులు వెల్లడించారు.

    కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాల్లో జైళ్లలో పరిమితికి మించి ఖైదీలను ఉంచుతున్నారు.

  8. అమెరికా: 50కి చేరిన కంటైనర్ మృతుల సంఖ్య

    మృత దేహాలతో దొరికిన కంటైనర్

    ఫొటో సోర్స్, Reuters

    అమెరికాలో కంటైనర్‌ ట్రక్కులో దొరికిన మృత దేహాల సంఖ్య 50కి పెరిగింది.

    చనిపోయిన వారంతా వలసదారులు. మెక్సికో, గ్వాటమెలా, హొండూరస్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.

    మెక్సికో సరిహద్దు నుంచి అక్రమంగా వీరిని కంటైనర్‌లో తరలించారు. కంటైనర్లోని ఏసీ పని చేయకపోవడం, తాగడానికి నీళ్లు లేక పోవడం వల్ల డీహైడ్రేషన్‌తో వారు చనిపోయినట్లుగా తెలుస్తోంది.

    అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఆంటోనియో పట్టణం శివార్లలో మంగళవారం ఒక కంటైనర్‌ను వదిలేసి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.

    కంటైనర్ ట్రక్కు నుంచి సాయం కోసం అరుపులు వినిపిస్తుండటంతో తలుపులు తెరచి చూడగా చాలా మంది చనిపోయి కనిపించారు.

    చనిపోయిన వారి మధ్యం 16 మంది సజీవంగా కనిపించారు. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

    మృత దేహాలతో దొరికిన కంటైనర్ వద్ద పోలీసులు
  9. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.