రాజస్థాన్: టైలర్ హత్య కేసును విచారించనున్న ఎన్‌ఐఏ
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన టైలర్ హత్య కేసును విచారించాల్సిందిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఇందులో విదేశీ సంస్థల కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా విచారించనున్నట్లు హోంశాఖ తెలిపింది.
మహ్మద్ ప్రవక్త మీద బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉదయ్‌పుర్‌లోని కన్నయ్య లాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
దీనికి ప్రతీకారంగా రియాజ్ అఖ్తర్, ఘోష్ మహ్మద్ అనే ఇద్దరు లాల్‌ను తల నరికి చంపేశారు.