అమెరికా: కంటైనర్ ట్రక్కులోని మృత దేహాలు వలసదారులేవేనా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని కంటైనర్‌లో దొరికిన మృత దేహాలు సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన వలసదారులవని భావిస్తున్నారు.
ఏసీ పని చేయని, మంచి నీళ్లు కూడా లేని ట్రక్కులో వారిని తరలించారు. తీవ్రంగా ఉన్న ఎండలతో డీహైడ్రేషన్‌కు లోనై వారు చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
ఎంతో మంది చనిపోతున్నా సిండికేట్ ముఠాలు అక్రమంగా వలసదారులను తరలించడాన్ని ఆపడం లేదని స్థానికులు అంటున్నారు.
2017లోనూ 10 మంది వలసదారులు ఇలాగే ట్రక్కులో మరణించి కనిపించారు.
వలసదారులతో అమెరికాలోకి అక్రమంగా వచ్చే పెద్దపెద్ద కంటైనర్ ట్రక్కులు పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటూ ఉంటాయి.

