భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ కోసం లండన్‌లో ఉంది.
"శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకినట్లు తేలింది. రోహిత్ ప్రస్తుతం హోటల్‌లో ఐసొలేషన్‌లో ఉన్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది" అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.
జూలై 1 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గత ఏడాది ప్రారంభమైన టెస్టు సిరీస్‌లో భాగం.
గత సంవత్సరం, భారత జట్టు అయిదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లింది. నాలుగు మ్యాచ్‌ల తరువాత భారత ఆటగాళ్లలో కొంతమందికి కరోనా సోకినట్లు తెలియడంతో అయిదవ టెస్టు వాయిదాపడింది.
అయిదవ టెస్టు ఇప్పుడు జరగనుంది. ఈ సీరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.