ఏక్‌నాథ్ శిందేను తమ నాయకుడిగా ఎన్నుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు

37 మంది శివసేన ఎమ్మెల్యేలు, 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ శిందే వెంట ఉన్నట్లు ఆయన కార్యాలయం నుంచి జాబితా విడుదల చేశారు.

లైవ్ కవరేజీ

  1. అమెజాన్: ‘చనిపోయిన తరువాత కూడా ఇంట్లో వాళ్లతో మాట్లాడొచ్చు’

    అమెజాన్ అలెక్సా

    ఫొటో సోర్స్, Amazon.in

    చనిపోయిన తరువాత కూడా వ్యక్తుల గొంతును అనుకరించి మాట్లాడేలా అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను అమెజాన్ ట్రైన్ చేస్తున్నట్లు టెక్ క్రంచ్ అనే వెబ్‌సైట్ తెలిపింది.

    అంటే చనిపోయిన వారి గొంతుతో కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంది అలెక్సా.

    ఒక నిమిషం పాటు అలెక్సాతో మాట్లాడినా లేక ఆడియో విన్నా అది మన గొంతును అనుకరిస్తుందని లాస్‌వెగాస్‌లో జరిగిన మార్స్ కాన్ఫరెన్స్‌లో అమెజాన్ తెలిపింది.

  2. మీ ముఖం మీదే సెక్స్ చేసే ఈ సూక్ష్మజీవుల గురించి మీకు తెలుసా

  3. అశ్వగంధకు డిమాండ్ పెరుగుతోందా?

    భారతీయ ఆయుర్వేదంలో సుమారు 4 నుంచి 5 వేల ఏళ్ల క్రితమే అశ్వగంధ ప్రస్తావన ఉందని చెబుతారు.

    భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రచురించిన ఓ అడ్వైజరీ ప్రకారం ఆయుర్వేద, సిద్ధ, యునానీ వైద్య విధానాల్లో ఈ మొక్క వేరును పురాతన కాలం నుంచి విస్తృతంగా వినియోగిస్తున్నారు.

    ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అశ్వగంధ వినియోగం పెరుగుతూ వస్తోందనే విషయం పరిశోధనల్లో తేలింది.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  4. బైకులు కాలిపోవడంపై ఓలా ఎలక్ట్రిక్ నోటీసులు

    ఓలా ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్

    ఫొటో సోర్స్, Facebook/Ola Electric

    ఇటీవల విద్యుత్ బైకులు కాలిపోవడం లేదా పేలిపోవడం మీద ఓలా ఎలక్ట్రిక్‌కు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) నోటీసులు జారీ చేసిందని సీఎన్‌బీసీ-టీవీ18 రిపోర్ట్ చేసింది.

    15 రోజులలోపు వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులో సీసీపీఏ ఆదేశించింది. ఇ-స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న నేపథ్యంలో ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్‌లకు కూడా గత నెలలో సీసీపీఏ నోటీసులు జారీ చేసింది.

    వాహనాలకు నిప్పు అంటుకుంటున్న నేపథ్యంలో 1,441 ఇ-స్కూటర్లను ఏప్రిల్‌లో ఓలా వెనక్కి పిలిపించింది.

  5. 91 ఏళ్ల వయసులో రూపర్ట్ మర్డొక్ విడాకులు

    భార్య జెర్రీ హాల్‌తో రూపర్ట్ మర్డొక్
    ఫొటో క్యాప్షన్, భార్య జెర్రీ హాల్‌తో రూపర్ట్ మర్డొక్

    మీడియా టైకూన్ రూపర్ట్ మర్డొక్ 91 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంటున్నారు. 65 ఏళ్ల జెర్రీ హాల్‌తో తన వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లు అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది.

    వ్యాపారవేత్త అయిన రూపర్ట్ మర్డొక్, హాలీవుడ్ నటి జెర్రీ హాల్‌ను 2016లో పెళ్లి చేసుకున్నారు.

    రూపర్ట్ మర్డొక్‌ నాలుగోసారి విడాకులు తీసుకుంటున్నారు. తొలుత 1956లో ఆస్ట్రేలియా ఫ్లైట్ అటెండెంట్ పాట్రిసియా బుకర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 1967లో ఆమెకు విడాకులు ఇచ్చి స్కాటిష్ సంతతి జర్నలిస్ట్ అనా మాన్‌ను వివాహం చేసుకున్నారు.

    1999లో ఆమెకు విడాకులు ఇచ్చి చైనా సంతతి వ్యాపారవేత్త వెండీ డెంగ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మర్డొక్‌కు జెర్రీ హాల్‌తో పెళ్లి అయింది.

  6. శివసేన రెబల్ క్యాంప్‌కు మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు

    మహారాష్ట్రలో మరొక ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ శిందే క్యాంపులో చేరినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    గత రాత్రి నలుగురు ఎమ్మెల్యేలు గువహాటి వెళ్లారు. దీంతో గత 24 గంటల్లో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ శిందే క్యాంపుకు చేరారు.

    ఎమ్మెల్యేలు కోరితే ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

    ఇప్పటికే ఆయన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. మొదలైన ఆత్మకూరు పోలింగ్... 26న ఫలితాలు, శంకర్ వడిశెట్టి

    ఆత్మకూరులో మొదలైన పోలింగ్

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నేడు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

    మొత్తం 2,13,338 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 131 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తంచి, వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతోంది.

    1,409 మంది ఎన్నికల సిబ్బంది, 1,100 మంది పోలీసులు విధి నిర్వహణలో ఉన్నారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

    ఆత్మకూరు అసెంబ్లీకి 2019 సాధారణ ఎన్నికల్లో గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

    వైసీపీ, బీజేపీతో పాటుగా మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

    ఆత్మకూరు పోలింగ్ ఏర్పాట్లు

    ఫొటో సోర్స్, UGC

  8. ‘ఏక్‌నాథ్ శిందేనే శివసేన శాసన సభాపక్ష నేతగా ఉంటారు’... గవర్నర్‌కు తీర్మానం పంపిన రెబల్ ఎమ్మెల్యేలు

    శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే

    ఫొటో సోర్స్, Facebook/Eknath Shinde

    రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే, శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా కొనసాగుతారంటూ ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్‌కు తీర్మానం పంపారు.

    మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు ఆ తీర్మానం మీద సంతకం చేశారు.

    2019లో ఏకగ్రీవంగా ఏక్‌నాథ్ శిందేను శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా ఎన్నుకున్నామని, ఇప్పుడు అదే హోదాలో ఆయన కొనసాగుతారని ఆ తీర్మానం చెబుతోంది.

    భరత్ గోగవాలేను పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.

    ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఆయన్ని శాసనసభా పక్షనేత పదవి నుంచి శివసేన తొలగించింది.

    కానీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మాత్రం ఏక్‌నాథ్ శిందేనే ఆ పదవిలో కొనసాగుతారని చెబుతున్నారు.

  9. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.