మహారాష్ట్ర సంక్షోభం: ముఖ్యమంత్రి నివాసం నుంచి కుటుంబంతో సహా బయటకు వెళ్లిపోయిన ఉద్ధవ్ ఠాక్రే

‘‘వారికి నామీద ఏవైనా వ్యతిరేకత ఉన్నట్లయితే ఇదంతా సూరత్ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్లు నా దగ్గరకు వచ్చి నా ముందే ఇది చెప్పి ఉండొచ్చు’’ అని ఠాక్రే వ్యాఖ్యానించారు.

లైవ్ కవరేజీ

  1. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు: ఫస్ట్ ఇయర్ 54% ఉత్తీర్ణత

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఎగ్జామ్స్‌ -2022 ఫ‌లితాలు వచ్చాయి. విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విడుద‌ల‌ చేశారు.

    తొలి ఏడాది విద్యార్థుల్లో 2,41,591 (54శాతం)మంది పాస్‌ కాగా రెండో ఏడాది విద్యార్థుల్లో 2,58,449 (61శాతం) మంది పాస్ అయ్యారు.

    ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది.

    ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగాచివరి స్థానంలో కడప జిల్లా నిలిచింది.

  2. మహారాష్ట్ర సంక్షోభం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే‌కు కరోనా పాజిటివ్

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కోవిడ్-19 వైరస్ సోకినట్లు కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తెలిపారు.

    డబ్బు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

    మహారాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేటివ్ మీటింగ్ ప్రారంభమైంది. మొత్తం 44 ఎమ్మెల్యేలలో 41 మంది వచ్చారని కమల్ నాథ్ వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. బ్రేకింగ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్: ఇంటర్మీడియల్ ఫలితాలు విడుదల

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల చేశారు.

    తొలి ఏడాదిలో 54శాతం మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలో 61శాతం మంది పాస్ అయినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ ప్రకటించారు.

  4. ‘రద్దు దిశగా మహారాష్ట్ర అసెంబ్లీ’

    శివసేన నేత సంజయ్ రౌత్

    ఫొటో సోర్స్, Facebook/Sanjay Raut

    ఫొటో క్యాప్షన్, శివ‌సేన నేత సంజయ్ రౌత్

    మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు దిశగా సాగుతోందని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

    రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్విటర్ ఖతా నుంచి మంత్రి హోదాను తొలగించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. ప్రాణాలు మింగేస్తున్న మ్యాన్‌హోల్స్‌ - మురుగు కాలువల్లోకి ఇంకా మనుషులే దిగాలా

  6. హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సమ్మెకు దిగిన తెలుగు సినిమా కార్మికులు

    సినిమా తీసే కెమెరా

    ఫొటో సోర్స్, Getty Images

    తమకు వేతనాలు పెంచాలంటూ తెలుగు సినీ కార్మికులు నేడు సమ్మెకు దిగారు. సినిమా షూటింగుల బంద్‌కు పిలుపునిచ్చారు.

    చాలా వరకు షూటింగు పనులకు కార్మికులు హాజరు కాలేదు.

    ఒక వ్యక్తి ఒంటి మీద పెట్రోలు పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

    ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీసులు తమ వాహనంలో తీసుకొని వెళ్లారు.

    కొద్ది గంటలుగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు నిరసనకు దిగారు.

    చిరంజీవి కలుగజేసుకొని తమ సమస్యలు తీర్చాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కరోనా సంక్షోభం సమయంలో ఆయన సినీ కార్మికులను ఆదుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

  7. మహారాష్ట్ర సంక్షోభం: ఏక్‌నాథ్ శిందేకు మద్దతుగా రెబెల్ ఎమ్మెల్యేల సంతకాలు

    శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందేకు మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేపట్టినట్లు తెలుస్తోందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష పెట్టేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని రెబెల్ ఎమ్మెల్యేలు కోరనున్నట్లు కూడా తెలుస్తోంది.

    33 మంది శివసేన, 7గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ శిందే ప్రస్తుతం గువహాటిలో ఉన్నారు.

    తన మద్దతుదారులతో ఏక్‌నాథ్ శిందే బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వస్తున్నాయి.

    బాల్ ఠాక్రే హిందుత్వ అజెండాను తాము కొనసాగిస్తామని మీడియాతో మాట్లాడుతూ ఏక్‌నాథ్ శిందే అన్నారు.

    మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం సంక్షోభంలో పడటంతో దిద్దుబాటు చర్యలకు కాంగ్రెస్ దిగింది.

    మహారాష్ట్ర కాంగ్రెస్ బాధ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ముంబయి చేరుకున్నారు.

    డబ్బును ఎరగా వేసి రాజకీయం చేయడమనేది రాజ్యాంగానికి విరుద్ధమని కమల్ నాథ్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. నెల్లూరు: రేపు ఆత్మకూరు ఉపఎన్నిక

    పోలింగ్ బూతులో వేలి మీద వేస్తున్న సిరా

    ఫొటో సోర్స్, AFP

    నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి రేపు ఉపఎన్నిక జరగనుంది.

    రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.

    పోలింగ్ కోసం 279 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

    1,132 మంది పోలింగ్ సిబ్బందితోపాటు148 మంది మైక్రో అబ్జర్వర్లు పని చేయనున్నారు.

    మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను మోహరించనున్నారు.

    ఆత్మకూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో చనిపోయిన విషయం తెలిసిందే.

    వైసీపీ తరపున మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ తరపున జి.భరత్‌కుమార్ పోటీ చేస్తున్నారు.

    ఈ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీ చేయడం లేదు.

  9. ఉత్తర్ ప్రదేశ్: ‘అల్లర్లకు, కూల్చివేతలకు సంబంధం లేదు’

    ఇల్లు కూలకొడుతున్న బుల్‌డోజర్

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తర్ ప్రదేశ్‌లో బుల్‌డోజర్‌తో ఇల్లు కూల్చడానికి, అల్లర్లకు సంబంధం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.

    తాము చట్టప్రకారమే ఇళ్లు కూల్చామని, ఆందోళనల్లో పాల్గొన్నందుకు కాదని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ స్పష్టం చేసింది.

    అల్లర్లలో పాల్గొన్న వాళ్ల మీద ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.

    ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్‌లో చెలరేగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

    ఈ ఘటనలో కొందరి ముస్లింల ఇళ్లను యోగి సర్కార్ బుల్‌డోజర్‌తో కూల్చడంపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. మొహాలీ ఆసుపత్రిలో చేరిన వల్లభనేని వంశీ, శంకర్ వడిశెట్టి

    వంశీ వల్లభనేని

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, వంశీ వల్లభనేని

    ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం నుంచి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వల్లభనేని వంశీ పంజాబ్‌లోని మొహాలీ ఆస్పత్రిలో చేరారు.

    అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు అభ్యసిస్తున్న ఆయన, క్లాసుల కోసం మొహాలీ క్యాంపస్‌కు వెళ్లినట్టు వంశీ సన్నిహితులు తెలిపారు.

    అక్కడ ఉండగానే ఆయన ఎడమ చేయి లాగినట్టు, సమస్య తీవ్రం కావడం వల్ల ఆస్పత్రిలో చేరినట్టు వెల్లడించారు.

    ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఈరోజు సాయంత్రానికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

  11. మహారాష్ట్ర సంక్షోభం: 40 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారన్న ఏక్‌నాథ్ శిందే

    శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, గువహటి చేరుకున్నాక మీడియాతో మాట్లాడుతున్న శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే

    శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిందే, 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అస్సాంలోని గువహటికి చేరుకున్నారు.

    ఆయన వెంట 33 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ శిందే బీజేపీలో చేరొచ్చే వార్తలు వస్తున్నాయి.

    ఇదే జరిగితే మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ఉమ్మడి ప్రభుత్వం కూలి పోతుంది.

    ‘ఇక్కడ 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వ ఎంజెడాను మేం కొనసాగిస్తాం.’ అని గువహటికి చేరుకున్న ఏక్‌నాథ్ శిందే అన్నారు.

    గువహటి వచ్చిన శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు రిసీవ్ చేసుకున్నారు.

    ఇది శివసేనలోని అంతర్గత సంక్షోభమని శరద్ పవార్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.