ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు: ఫస్ట్ ఇయర్ 54% ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ -2022 ఫలితాలు వచ్చాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు.
తొలి ఏడాది విద్యార్థుల్లో 2,41,591 (54శాతం)మంది పాస్ కాగా రెండో ఏడాది విద్యార్థుల్లో 2,58,449 (61శాతం) మంది పాస్ అయ్యారు.
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది.
ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగాచివరి స్థానంలో కడప జిల్లా నిలిచింది.