ముఖ్యాంశాలు
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 12,781 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల పాటు సాగే ఈ యుద్ధంలో యుక్రెయిన్‌కు మద్దతును కొనసాగించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధం కావాలని ఆయన హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పరిసర గ్రామాల్లో ఎలుగుబంటి దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీపై పలు ఆరోపణలు చేశారు. మాజీ సైనికులు ఉద్యోగాల కోసం అంబానీ లేదా అదానీ ఇళ్ల ముందు బారులు తీరాలని ఎందుకు కోరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
అనంతపురంలో కుల అహంకార హత్య చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదోసారి సమన్లు జారీచేసింది.













