అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దిల్లీలో కాంగ్రెస్ సత్యాగ్రహ నిరసన.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశానికి సేవ చేయటం కోసం సైన్యంలో చేరాలని నేను కోరుకునేదాన్ని. ఇప్పుడు జరుగుతున్నది తప్పు. ఈ పథకాన్ని ఉపసంహరించాలి’’ అని పేర్కొన్నారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
'యుక్రెయిన్ యుద్ధం ఏళ్ల పాటు సాగుతుంది'- నాటో హెచ్చరిక
నేటి ముఖ్యాంశాలు
- సైన్యంలో నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోబోమని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రక్షణ శాఖ మిలిటరీ వ్యవహారాల అదనపు కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ స్పష్టం చేశారు.
- జూన్‌లో ఇప్పటివరకు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు రూ.31,430 కోట్లను ఉపసంహరించుకున్నారు.
- యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆకస్మికంగా యుద్ధరంగానికి వెళ్లి.. రష్యా బాంబుదాడులను తిప్పికొడుతున్న తమ దేశపు సైనికులను కలిశారు.
- అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.
- అగ్నిపథ్ పథకం కింద నియామకాల కోసం భారత వాయుసేన తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
లక్షల రూపాయల బంగారాన్ని పారేసుకుంటే... ఎలుకలు తెచ్చిచ్చాయి
సోవియట్ జెండా పట్టుకున్న ఈ యుక్రెయిన్ వృద్ధ మహిళ రష్యా ప్రచారాస్త్రంగా ఎలా మారారు?
అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకునేది లేదన్న త్రివిధ దళాల అధిపతులు, ఇంకా ఏమన్నారంటే...
జూన్‌లో రూ. 31,430 కోట్లను ఉపసంహరించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, file photo భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారుల ఉదాసీనత కొనసాగుతోంది.ఈ నెలలో ఇప్పటివరకు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు రూ.31,430 కోట్లను ఉపసంహరించుకున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్, ద్రవ్యోల్బణంలో పెరుగుదల, షేర్ల ధరలు అధికంగా ఉండటాన్ని దీనికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, 2022లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి 1.98 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు.
‘‘అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలలో ఎఫ్‌పీఐలు బలహీనంగా మారుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానం తదితర కారణాల వల్ల ఇలా జరుగుతోంది’’ అని వార్తా సంస్థ పీటీఐతో కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.
డేటా ప్రకారం, జూన్ 17 నాటికి విదేశీ పెట్టుబడిదారులు, భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 31,43 కోట్లను ఉపసంహరించుకున్నారు.
2021 అక్టోబర్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ డబ్బును ఉపసంహరించుకోవడం కొనసాగిస్తున్నారు.
‘మహమ్మద్ ప్రవక్తపై భారత్‌లో చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారమే గురుద్వారాపై దాడి’ - ఇస్లామిక్ స్టేట్
విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
యుక్రెయిన్: యుద్ధ రంగంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, UKRAINIAN PRESIDENTIAL PRESS SERVICE
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆకస్మికంగా యుద్ధరంగానికి వెళ్లి.. రష్యా బాంబుదాడులను తిప్పికొడుతున్న తమ దేశపు సైనికులను కలిశారు.
సైనికులను కలవటానికి ముందు మైకోలేవ్ నగరంలో.. రష్యా దాడుల్లో ధ్వంసమైన భవనాలను జెలియెన్‌స్కీ సందర్శించారు.
ఆ తర్వాత ఇంకా యుక్రెయిన్ నియంత్రణలోనే ఉన్న కీలక రేవు నగరం ఒడెస్సా వెళ్లారు.
నల్లసముద్రంలో ముఖ్యమైన ఈ రెండు నగరాలను ఆక్రమించుకోవటం కోసం రష్యా వీటిపై నిరంతరం దాడులు చేస్తోంది.
ఇదిలావుంటే.. తూర్పు దోన్బాస్ ప్రాంతంలో, ముఖ్యంగా సెవెరోదోన్యస్క్ నగరం చుట్టూ రష్యా, యుక్రెయిన్ బలగాల మధ్య భీకర పోరాటం కొనసాగుతూనే ఉంది.
ఈ ప్రాంతంలో యుద్ధం చేయటానికి రష్యా భారీ సంఖ్యలో సైనికులను పంపిస్తోందని గవర్నర్ చెప్పారు.
అగ్నిపథ్ స్కీమ్‌పై ఈ నిరసనలకు కారణమేంటి
స్పైస్ జెట్ విమానానికి మంటలు.. 185 మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
పట్నా నుంచి దిల్లీ బయల్దేరిన స్పైస్ జెట్ విమానాన్ని అత్యవసరంగా పట్నా విమానాశ్రయంలో దించేశారు.
ఈ విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు.
పట్నా నుంచి ఇది టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. దీంతో పైలట్ వెంటనే పట్నాలోనే విమానాన్ని ల్యాండ్ చేశారని అధికారులు చెప్పారు.
టేకాఫ్ అయిన విమానానికి మంటలు అంటుకున్న విషయం స్థానికులు చూశారని, వారు వెంటనే అధికారులను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పట్నా కలెక్టర్ చెప్పారు.
ప్రస్తుతం ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు.
సాంకేతిక సమస్యల వల్లే మంటలు అంటుకున్నాయని.. ఇంజినీరింగ్ టీం దీనిపై దర్యాప్తు చేస్తోందని అధికారులు చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాబుల్ గురుద్వారాపై దాడి చేశాం: ఐఎస్

ఫొటో సోర్స్, MALIK MUDASSIR
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.
భారత్‌లో మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు ఆ సంస్థ చెప్పింది.
అఫ్గానిస్తాన్‌లో ప్రబలంగా ఉన్న ఐఎస్ ఖొరాసన్ గ్రూప్ ఈ మేరకు తెలిపింది.
గురుద్వారాపై దాడిలో ముగ్గురు మరణించారు. ఐఎస్ దాడి అనంతరం తాలిబాన్లు ముగ్గురు ఐఎస్ సభ్యులనూ హతమార్చారు.
ఇందిరాగాంధీ వెంట 21 ఏళ్లు నీడలా నడిచిన ఆర్‌కే ధవన్ కాంగ్రెస్‌లో అనాథగా మిగిలారెందుకు?
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహ నిరసన.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు

ఫొటో సోర్స్, @INCIndia
సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు దిల్లీలోని జంతర్ మందర్ వద్ద నిరసన చేపట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశానికి సేవ చేయటం కోసం సైన్యంలో చేరాలని నేను కోరుకునేదాన్ని. ఇప్పుడు జరుగుతున్నది తప్పు. ఈ పథకాన్ని ఉపసంహరించాలి’’ అని పేర్కొన్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీద విమర్శలు ఎక్కుపెడుతూ ట్వీట్లు చేశారు.
‘‘ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు ఉద్యోగం ఇస్తామనే బూటకపు ఆశలు కల్పిస్తూ దేశ యువతను నిరుద్యోగ పథంలోకి నడిపించారు’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.
‘‘ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండింది. కానీ యువతకు పకోడీలు వేయించే జ్ఞానం మాత్రమే ఇచ్చారు. దేశంలో ఈ పరిస్థితికి ప్రధానమంత్రి మాత్రమే కారకులు’’ అని ధ్వజమెత్తారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అగ్నిపథ్ వ్యతిరేక నిరసనకారులపై ఎన్ని బుల్‌డోజర్లు వాడతారు?: ఒవైసీ ప్రశ్న

ఫొటో సోర్స్, ANI
‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పుడు నిర్ణయం వల్ల వాళ్లు (యువత) రోడ్ల మీదకు వచ్చారు. దేశ యువతను ధ్వంసం చేయటానికి ఒక దారి కనుక్కున్నారు. ఇప్పుడు వారి ఇళ్లను ధ్వంసం చేయటానికి ఎన్ని బుల్‌డోజర్లను మీరు ఉపయోగిస్తారు?’’ అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
ఒవైసీ శనివారం నాడు హైదరాబాద్‌లో మాట్లాడారు. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో తాత్కాలిక నియామకల పట్ల వెల్లువెత్తిన నిరసనలు, చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింస విషయంలో, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం వైఖరిలో తేడా గురించి కూడా ఒవైసీ ప్రస్తావించారు.
‘‘మీరు ఎవరి ఇంటినైనా ధ్వంసం చేయాలని మేం కోరుకోవటం లేదు’’ అని పేర్కొన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అలాగే.. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను చట్ట ప్రకారం అరెస్ట్ చేసి, ఆమెపై తగిన చర్యలు చేపట్టాలని కూడా ఒవైసీ అన్నారు.
‘‘ఆమె మరో 6, 7 నెలల్లో తిరిగి పార్టీలోకి చేరతారని నేను కచ్చితంగా చెప్పగలను. ఆమెను పెద్ద నాయకురాలిగా చూపుతారు. ఆమె దిల్లీ ముఖ్యమంత్రి పదవికి పోటీదారు కూడా అయ్యే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించారు.
అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
అగ్నిపథ్ పథకం: భారత వాయుసేనలో నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

ఫొటో సోర్స్, ANI
అగ్నిపథ్ పథకం కింద నియామకాల కోసం భారత వాయుసేన తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరతీసిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
వాయుసేన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పథకం కింద నాలుగేళ్లు సర్వీసు పూర్తిచేసిన తర్వాత 25 శాతం మంది అగ్నివీరులకు వాయుసేనలో అవసరం మేరకు రెగ్యులర్ కేడర్‌లోకి రిక్రూట్ చేసుకునే అవకాశం లభించవచ్చు.
అగ్నిపథ్ పథకం కింద నియామకాలకు 17 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయసు యువత అర్హులని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అగ్నివీరులకు ఏడాదికి 30 సెలవులు లభిస్తాయి. దీనికి అదనంగా వైద్యుల సలహా మేరకు మెడికల్ లీవ్ ఇస్తారు. అలాగే.. ఈ పథకం కింద చేరిన వారు నాలుగేళ్ల కాలం పూర్తయ్యేవరకూ ఉద్యోగం వదిలి వెళ్లటానికి అనుమతించారు. అయితే కొన్ని మినహాయింపులతో ఉద్యోగం వీడటానికి అనుమతించవచ్చు.
ఈ ఉద్యోగ కాలంలో నెలకు రూ. 30,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. ఈ జీతం ప్రతి ఏటా పెరుగుతుంది. దీనితో పాటు రిస్క్, డ్రెస్, ట్రావెల్ భత్యాలూ చెల్లిస్తారు.
అగ్నివీరులు ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వారికి ఉద్యోగం పూర్తయ్యాక గ్రాట్యుటీ బెనిఫిట్ కూడా లభించదు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

మాజీ మంత్రి, తెదేపా సీనియర్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను ఆదివారం తెల్లవారుజామున టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. దీనికి ముందు పోలీసు బలగాలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో.. రెండు సెంట్ల పంటకాల్వను అక్రమించి అయ్యన్నపాత్రుడు ఇల్లు కట్టారంటూ.. ఆ అక్రమిత స్థలంలో నిర్మించిన ఇంటి గోడను జేసీబీతో కూల్చారు.
ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని తహాశీల్దార్ నోటీసు ఇచ్చారు. ఈ నెల రెండో తారీకుతో ఉన్న నోటీసును ఇచ్చినట్లు అధికారులు లేఖను చూపుతున్నారు.

ఈ సంఘటన జరిగే సమయంలో అయ్యన్నపాత్రుడు ఇంటిలో లేరు. అయ్యన్న కుటుంబ సభ్యులు అధికారులను కొద్దిసేపు అడ్డుకున్నారు. వారితో వాదనకు దిగారు.
ఈలోగా కొందరు అయ్యన్న అనుచరులు, అభిమానులు అక్కడికి చేరుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడ నుంచి బయటకు పంపించేశారు.
ఆ తర్వాత అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకునే ముందు, వెనుక మార్గాలను పోలీసు మూసివేశారు. అయ్యన్నపాత్రుడు ఇంటి పరిసరాలు, నర్సీపట్నం టౌన్‌లో పెద్ద ఎత్తున పోలీసులు మెహరించారు.

ఫొటో క్యాప్షన్, అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు అధికారులను కొద్దిసేపు అడ్డుకున్నారు ఆస్తులు ధ్వంసం చేయటం ఏమిటి?: అయ్యన్న భార్య ఆగ్రహం
అయ్యన్న గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి ఆరోపించారు.
‘‘తెల్లవారు జామున కరెంట్ నిలిపివేసి కూల్చివేతకు దిగారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇళ్లు కూల్చివేస్తే మేం ఎక్కడ ఉండాలి? రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడం ఏమిటి?’’ అని ఆమె ప్రశ్నించారు.
‘‘మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం వేధింపులుకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కక్షా రాజకీయాలతో చంపుతున్నారు. మమ్మల్ని చంపండి. మాకు జీవించే హక్కు లేదా? జనం తరఫున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా? బీసీలుగా పుట్టడమే నేరమా?’’ అని మండిపడ్డారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
గుడ్ మార్నింగ్.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
