You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'రష్యా మీద ఆంక్షలు విధించిన దేశాలే ఎక్కువ నష్టపోతాయి' - అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యా మీద ఆంక్షలు విధించిన దేశాలకే ఎక్కువ హాని జరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.

లైవ్ కవరేజీ

  1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ నిరసనలు: ‘రెండు వేల మంది వచ్చారు.. మూడు గంటలు విధ్వంసం సృష్టించారు’

  2. బ్రేకింగ్ న్యూస్, దేశవ్యాప్తంగా 35 రైల్వే సర్వీసులు రద్దు

    అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల ప్రభావం దేశవ్యాప్తంగా మొత్తం 200 ట్రైన్ సర్వీసుల మీద పడినట్లు రైల్వే శాఖ తెలిపింది.

    మొత్తం 35 సర్వీసులను పూర్తిగా క్యాన్సిల్ చేయగా 13 సర్వీసుల దూరాన్ని తగ్గించారు.

  3. కాసేపట్లో అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ షెడ్యూల్

    అగ్నిపథ్ పథకం కింద సైనిక నియామకాలకు సంబంధించి కాసేపట్లో రిక్రూట్‌మెంట్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు.

    త్వరలోనే రిక్రూట్‌మెంట్ ర్యాలీలు చేపట్టేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు వివరించారు.

    సైన్యంలోని ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయసును 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తమకు అందాయని వెల్లడించారు.

    అయితే ఈ వయసు పరిమితి సడలింపు ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

  4. సికింద్రాబాద్ స్టేషన్‌లో విధ్వంసం

    అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారు.

    కొన్ని రైళ్లకు నిప్పు పెట్టారు. సిగ్నల్ వ్యవస్థలను, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.

    రైల్వే సిబ్బంది మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.

  5. బ్రేకింగ్ న్యూస్, అగ్నిపథ్ నిరసనలు... ‘సికింద్రాబాద్ స్టేషన్‌లో కాల్పులు’

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు స్టేషన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు.

    వందల మంది నిరసనకారులు స్టేషన్‌లోకి దూసుకొచ్చారు. కొన్ని రైళ్లకు నిప్పు పెట్టారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.

    ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాష్ప వాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ఫైర్ చేస్తున్నారు.

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘పోలీసులు ఫైరింగ్ చేస్తున్నారని, నలుగురు చనిపోయారని’ కొందరు ఆందోళనకారులు చెప్పారు. మరికొందరు ఇద్దరు అని చెబుతున్నారు. కానీ దీన్ని బీబీసీ ధ్రువీకరించుకోలేదు.

    పోలీసులు 15 రౌండ్ల కాల్పులు జరిపారనే వార్తలు స్థానిక న్యూస్ చానెల్స్‌లో వస్తున్నాయి.

  6. గల్వాన్ లోయ ఘర్షణల్లో చనిపోయిన సైనికులకు నివాళులు అర్పించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ

  7. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముట్టడి

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా మూడో రోజూ దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.

    సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ వద్ద యువత నిరసనలకు దిగింది. రైల్వే ట్రాక్‌పై బస్తాలు, టైర్లు వేశారు. కొన్ని బోగీలకు నిప్పు కూడా అంటుకుంది.

    బిహార్‌లో నేడు పొద్దున లకీసరాయ్‌ జంక్షన్‌లో ఒక రైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు.

    ‘సుమారు 5 కంపార్ట్‌మెంటులు కాలిపోయి ఉంటాయి. నేను వీడియో తీస్తుంటే నా ఫోన్ లాక్కున్నారు.’ అని అక్కడి పోలీసు తెలిపారు.

    ఉత్తర్ ప్రదేశ్‌లోనూ బాలియా రైల్వే స్టేషన్ వద్ద యువత నిరసనకు దిగింది. కానీ తాము వారిని అడ్డుకున్నామని అధికారులు తెలిపారు.

  8. ‘అగ్నిపథ్’కు పోటీ పడే అభ్యర్థుల వయసు పరిమితి పెంపు

    ‘అగ్నిపథ్’ పథకంలో భాగంగా చేపట్టే సైనిక నియామకాలకు పోటీ పడే అభ్యర్థుల వయసు పరిమితిని ఈ ఏడాది 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు.

    వయసు పరిమితిని 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉంచడం, సర్వీసు కాల పరిమితిని నాలుగేళ్లుగా ఉంచడం, పెన్షన్ లేకపోవడం వంటి విషయాలను వ్యతిరేకిస్తూ యువత ఆందోళనకు దిగింది.

    ఈ నేపథ్యంలో వయసును 21 నుంచి 23 ఏళ్లకు పెంచుతూ కేంద్ర రక్షణశాఖ ఆదేశాలు జారీ చేసింది.

  9. బీబీసీ ఇంటర్వ్యూలో సెర్జీ లావ్రోవ్: ‘రష్యా కడిగిన ముత్యమేమీ కాదు... మేం చేస్తున్న దానికి సిగ్గుపడటం లేదు’

    రష్యా కడిగిన ముత్యమేమీ కాదని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి సెర్జీ లావ్రోవ్ అన్నారు.

    బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజన్‌బర్గ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాము యుక్రెయిన్ మీద దండయాత్రకు దిగలేదని దాన్ని ‘డీనాజిఫై’ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

    ‘మేం యుక్రెయిన్ మీద ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపట్టాం. యుక్రెయిన్‌ను నేటో కూటమిలోకి లాగాలని ప్రయత్నిస్తున్న పశ్చిమ దేశాలకు, అది తప్పు అని చెప్పడానికి మాకు మరొక మార్గం కనిపించలేదు.’ అని లావ్రోవ్ అన్నారు.

    యుక్రెయిన్‌లోని చెర్నిహివ్ ప్రాంతంలో గల యహిద్నీ గ్రామంలో 360 మంది పౌరులను రష్యా సైనికులు 28 రోజుల పాటు ఒక స్కూలు బేస్‌మెంట్‌లో ఉంచడంపై బీబీసీ ప్రశ్నించింది.

    ఆ బేస్‌మెంట్‌లో టాయిలెట్స్ లేవు. మంచి నీటితోపాటు ఇతర మౌలిక సదుపాయాలు లేవు. 10 మంది వృద్ధులు చనిపోయారు.

    దీనిపై స్పందిస్తూ అది ఎంతో బాధాకరమని లావ్రోవ్ అన్నారు.

    తూర్పు యుక్రెయిన్‌లో వేర్పాటువాదుల ప్రాంతాల్లో యుక్రెయిన్ చేస్తున్న దారుణాల గురించి బీబీసీ చెప్పడం లేదని లావ్రోవ్ విమర్శించారు. అక్కడి పౌరుల మీద ఎనిమిదేళ్ల పాటు యుక్రెయిన్ బాంబులు కురిపించిందని ఆయన ఆరోపించారు.

    అయితే అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు అనుమతి ఇవ్వాలని బీబీసీ ఆరేళ్లుగా అడుగుతున్నప్పటికీ వేర్పాటువాదుల ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేని బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజన్‌బర్గ్‌, సెర్జీ లావ్రోవ్‌కు గుర్తు చేశారు.

  10. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.