You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రాహుల్ గాంధీ: ‘‘మా అమ్మ ఆరోగ్యం బాలేదు.. ఈడీ విచారణకు రెండు రోజులు మినహాయింపు ఇవ్వాలి’’

తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఈ నెల 17, 18న విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోరారు.

లైవ్ కవరేజీ

  1. సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?

  2. 10-15శాతం పెరగనున్న స్పైస్‌జెట్ చార్జీలు

    అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి పడిపోవడం వల్ల విమాన చార్జీలు పెంచాల్సి వస్తోందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు.

    తాము వెంటనే 10 నుంచి 15 శాతం వరకు విమాన చార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించారు.

    ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు సుమారు 119 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇది దాదాపు 84 డాలర్లుగా ఉండేది.

    ఇక రూపాయి కూడా డాలరుతో పోలిస్తే క్షీణిస్తోంది. ప్రస్తుతం డాలరుకు 78.55 వద్ద ఉంది.

  3. అనకాపల్లి: ‘మా భూమి లాక్కుని మైనింగ్ కంపెనీకి ఇస్తున్నారు, మేమెలా బతకాలి?’

    ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలంలోని ఊర్లోవ కొండ ప్రాంతంలో 45 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది.

    తమను వెళ్లగొట్టేందుకు మైనింగ్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయంటూ స్థానిక గిరిజనులు జీడి తోటల్లో ఆందోళన చేపట్టారు.

  4. రెయిన్‌బో రంగుల్లో ఉండే బొమ్మలు హోమో సెక్సువాలిటీని ప్రోత్సహిస్తాయంటూ నిషేధం

    స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయంటూ ఇంద్రధనుస్సు రంగుల్లో ఉండే బొమ్మలను, పిల్లల బట్టలను సౌదీ అరేబియా అధికారులు నిషేధిస్తున్నారు.

    రాజధాని రియాద్‌లోని షాపుల నుంచి అటువంటి బొమ్మలు, దుస్తులను కామర్స్ మినిస్ట్రీ అధికారులు తీసేస్తున్నట్లుగా వార్తా సంస్థ అల్ ఎఖ్‌బరియా తెలిపింది.

    నిషేధించిన వాటిలో జడ పిన్నులు, టీషర్టులు, టోపీలు, పెన్సిల్ బాక్సులు కూడా ఉన్నాయి.

    ‘ఇవి ఇస్లాం విశ్వాసాలకు, నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేస్తున్నాయి.’ అని ఒక అధికారి తెలిపారు.

    ఇలాంటి వస్తువులను విక్రయించే షాపుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

    రెయిన్‌బో రంగుల్లో ఉండే బొమ్మలను నిషేధిస్తున్నట్లు గత డిసెంబరులో ఖతార్ అధికారులు ప్రకటించారు.

  5. స్విట్జర్లాండ్: నిప్పుల గుండంలో నడక... 25 మందికి గాయాలు

    స్విట్జర్లాండ్‌లో ఒక కంపెనీ టీం బిల్డింగ్ కసరత్తుల్లో భాగంగా ఉద్యోగులను నిప్పుల గుండంలో నడిపించింది.

    అలా నిప్పుల మీద నడిచిన ఉద్యోగుల్లో 25 మందికి కాళ్లు కాలి గాయాలయ్యాయి. వీరిలో 13 మందిని ఆసుపత్రిలో చేర్పించారు.

    సుమారు 10 అంబులెన్సులు ఘటనా స్థలాలకు చేరుకున్నాయి.

    కొన్ని మీటర్ల పొడవున నిప్పులు పోశారని, చాలా సేపు నిప్పుల మీద నడవడం వల్ల వారు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

    యూరప్‌లో వ్యక్తులను మోటివేట్ చేయడానికి, స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు సేకరించడానికి నిప్పుల మీద నడిచే ఈవెంట్లను నిర్వహిస్తుంటారు.

    2018లో ఇళ్లు లేని వారికి, క్యాన్సర్ పేషెంట్ల కోసం బ్రిటన్‌లో నిప్పుల గుండం ఏర్పాటు చేశారు.

    భారత్‌లోనూ పండుగలు, ఉత్సవాల సందర్భంగా నిప్పుల మీద నడవడమనేది సంప్రదాయంగా వస్తోంది.

  6. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.