మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా
నిరసనలు వ్యక్తం చేస్తున్న ముస్లింలను అణచి వేయడాన్ని ఆపాలంటూ అంతర్జాతీయ
మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వాన్ని కోరింది.
నిరసనకారుల మీదకు భారీ సంఖ్యలో బలాలను పంపిస్తున్నారని, ఇప్పటి
వరకు ఈ హింసలో ఒక చిన్నారితో సహా సుమారు ఇద్దరు చనిపోయారని ఆ సంస్థ పేర్కొంది.
‘మహ్మద్ ప్రవక్త మీద, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి
నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్,
మహారాష్ట్ర, కర్నాటక, జమ్మూ కశ్మీర్ వంటి ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వేల మంది
వీధుల్లోకి వస్తున్నారు.
కానీ శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిని భారత
ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. కావాలనే ముస్లింలను టార్గెట్ చేస్తోంది.’ అని
ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ తన ప్రకటనలో పేర్కొంది.