నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు కూడా ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు కూడా రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరు కానున్నారు.
సోమవారం ఆయనను సుమారు 10 గంటల పాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో సోనియా గాంధీ కూడా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సోకడం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఆమె ప్రస్తుతం గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీల విచారణ నేపథ్యంలో సోమవారం దిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి.
ఈ నేపథ్యంలో నేడు మోతీలాల్ నెహ్రూ మార్గ్‌తో పాటు ఇతర మార్గాల్లో 144 సెక్షన్ విధించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


