You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వైఎస్ జగన్: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయితే రెగ్యులర్‌గానే పరిగణిస్తాం

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వాళ్లను రెగ్యులర్‌గానే భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు కూడా ఈడీ ముందుకు రాహుల్ గాంధీ

    నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు కూడా రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరు కానున్నారు.

    సోమవారం ఆయనను సుమారు 10 గంటల పాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

    ఈ కేసులో సోనియా గాంధీ కూడా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సోకడం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ఆమె ప్రస్తుతం గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

    రాహుల్ గాంధీ, సోనియా గాంధీల విచారణ నేపథ్యంలో సోమవారం దిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి.

    ఈ నేపథ్యంలో నేడు మోతీలాల్ నెహ్రూ మార్గ్‌తో పాటు ఇతర మార్గాల్లో 144 సెక్షన్ విధించారు.

  2. ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వర్సెన్‌కు చిరంజీవి డబ్బింగ్

    బాలీవుడ్ మిథలాజికల్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వర్సెన్‌కు సినీనటుడు చిరంజీవి గాత్రదానం చేస్తున్నారు.

    ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ సినిమా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తెలిపారు.

    బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇందులో హీరో, హీరోయిన్లుగా నటించారు.

    టాలీవుడ్ నటుడు నాగార్జున ఇందులో ఆర్కియాలజిస్ట్‌ పాత్ర చేశారు.

    అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.

  3. ఉత్తర్ ప్రదేశ్ నిరసనల్లో 337 మంది అరెస్టు

    ఉత్తర్ ప్రదేశ్ నిరసన ప్రదర్శనలకు సంబంధించి ఇప్పటి వరకు 337 మందిని అరెస్టు చేసిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు.

    మొహ్మద్ ప్రవక్త మీద బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉత్తర్ ప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసనలు చేపట్టారు.

    ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఈ నిరసన ప్రదర్శనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

  4. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.