గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది: అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, @aimim_national
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో మునిసిపల్ ఎన్నికల నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంఐఎం సన్నద్ధమవుతోందని చెప్పారు.
ఒవైసీ శరివారం నాడు గుజరాత్‌లో భుజ్ నగరంలో మీడియాతో మాట్లాడారు.
‘‘గుజరాత్ ఎన్నికల్లో మేం పూర్తి శక్తితో పోరాడుతాం. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది మేం ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయంలో పార్టీ గుజరాత్ విభాగం అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగనున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది




