You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోనియా గాంధీ: కోవిడ్ సమస్యతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు
కోవిడ్ సంబంధిత అస్వస్థత కారణంగా సోనియా గాంధీ ఆదివారం దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
వరల్డ్ బ్లడ్ డోనర్ డే: అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఏవి? అత్యవసర పరిస్థితుల్లో అలాంటి రక్తం ఎక్కడ దొరుకుతుంది?
నేషనల్ హెరాల్డ్ కేసు: నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న రాహుల్ గాంధీ, నిరసన ర్యాలీలు చేపట్టనున్న కాంగ్రెస్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కానున్నారు.
ఈ వ్యవహారంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు ఆయనను పిలిచారు.
కాంగ్రెస్ పార్టీ సోమవారం తమ పార్టీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించనుంది. ఇందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూనిట్లు, తమ రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నాయి.
నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కట్టబెట్టే క్రమంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. తొమ్మిది నెలల క్రితం మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే రాహుల్ గాంధీ, ఈడీ విచారణకు హాజరయ్యే కంటే ముందురోజు ఆదివారం అనేక నగరాల్లో కాంగ్రెస్ పార్టీ, విలేఖరుల సమావేశాలు నిర్వహించింది. బీజేపీ, రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని ఆరోపించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ... “నేను ఒక కాంగ్రెస్ సభ్యుడిగా, న్యాయవాదిగా మాట్లాడుతున్నా.మనీలాండరింగ్ కింద రాహుల్ గాంధీకి ఈడీ పంపిన సమన్లు నిరాధారమైనవి’’ అని అన్నారు.
గాంధీ కుటుంబాన్ని వేధించేందుకు నేషనల్ హెరాల్డ్ కేసును ఉపయోగించుకుంటున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాయ్‌పూర్‌లో అన్నారు.విపక్షాల నోరు మూయించేందుకు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం అని ఆయన అన్నారు.
లక్నోలో విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ... కేంద్ర దర్యాప్తు సంస్థలు, బీజేపీ నాయకులను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేయడంపై సుప్రీం కోర్టుకు వెళ్లిన ముస్లిం సంస్థ
లేడీ ఆఫ్ హెవెన్: 'మొహమ్మద్ ప్రవక్త కూతురు కథ' సినిమాను పలు ముస్లిం దేశాలు ఎందుకు నిషేధిస్తున్నాయి?
కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
నేటి ముఖ్యాంశాలు
- మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేశారు.
- విశాఖపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల కారణంగా విమానాల ల్యాండింగ్‌కి ఇబ్బంది ఏర్పడింది.
- కోవిడ్ సంబంధిత అస్వస్థత కారణంగా సోనియా గాంధీ ఆదివారం దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు.
- యుక్రెయిన్‌లోని సెవెరోడోన్యస్క్ నగరం మీద రష్యా సైన్యం అవిరామంగా చేసిన బాంబుదాడుల ఫలితంగా ఒక రసాయన కర్మాగారంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ఆ ప్రాంత గవర్నర్ సెర్హీయ్ హాయ్‌దాయ్ చెప్పారు.
- దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 8,582 కేసులు నమోదయ్యాయి.
- నాగాలాండ్‌లో గత ఏడాది 13 మంది పౌరులు చనిపోయిన సైన్యం కాల్పుల ఘటనకు సంబంధించి 30 మంది సైనికులు నిందితులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
పోతన విజ్ఞానపీఠం: అలనాటి సాహిత్యానికి డిజిటల్ రూపం
ఉత్తరప్రదేశ్ అల్లర్లలో అనుమానితుల ఇళ్ళపై బుల్డోజర్ దాడులు
నూపుర్ శర్మకు మహారాష్ట్ర పోలీసుల సమన్లు
మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు సమన్లు జారీ చేశారు.
థానే జిల్లా భివాండీ నగర పోలీసులు జారీ చేసిన ఈ సమన్లలో జూన్ 13న విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించారు.
అయితే, విచారణకు హాజరు కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని నూపుర్ శర్మ తరపు న్యాయవాది భివాండీ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.
ఒక టీవీ కార్యక్రమంలో మొహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో దేశ విదేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. యూపీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో పలుచోట్ల ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. జార్ఖండ్‌లో ఇద్దరు మరణించారు.
విశాఖ: ఈదురు గాలులతో ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కి ఇబ్బంది.. విమానంలో కేంద్రమంత్రి జై శంకర్
విశాఖపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
ఈదురు గాలుల కారణంగా విమానాల ల్యాండింగ్‌కి ఇబ్బంది ఏర్పడింది.
వాతావరణం అనుకూలించకపోవడంతో దిల్లీ నుంచి విశాఖ వచ్చిన ఎయిర్ ఇండియా ఏఐ 451 విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు.
ఈ విమానంలో కేంద్రమంత్రి జై శంకర్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి మరో విమానంలో ఆయన విశాఖకు చేరుకున్నారు.
మోదీ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో విశాఖ పుర ప్రముఖులతో మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొనేందుకు జై శంకర్ విశాఖకు వచ్చారు.
గత నెల రోజుల కాలంలో ఎయిర్ ఇండియాకు ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇది రెండోసారి.
ఆకాశంలో అద్భుతం: ఒకే వరుసలోకి అయిదు గ్రహాలు... బైనాక్యులర్స్ లేకుండానే చూడొచ్చు
ప్రతీ 18 ఏళ్లకు ఒకసారి మాత్రమే చూడగలిగే అరుదైన దృశ్యం.... ఈ జూన్ నెలలో కనిపించబోతుంది.
అసాధారణ రీతిలో ఈ జూన్ నెలలో ఒకేసారి బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, శని గ్రహాలు కనిపించనున్నాయి. ఒకే అక్షంపైకి వచ్చే ఈ అయిదు గ్రహాలను మనం నేరుగా కళ్లతో చూడవచ్చు.
పూర్తి కథనం కోసం ఈ లింకును క్లిక్ చేయండి.
బ్రేకింగ్ న్యూస్, కోవిడ్ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆసుపత్రిలో చేరారు.
కోవిడ్ సంబంధిత అస్వస్థత కారణంగా సోనియా గాంధీ ఆదివారం దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు.
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన తెలిపారు.
‘‘సోనియా గాంధీ క్షేమం కోసం కోరుకుంటోన్న కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న రాయల్ బెంగాల్ టైగర్
‘అమెరికా ప్రజల మద్దతు కావాలంటే వారికి చావు భయం కల్పించాలి’ - ఈ ఒక్క మాట ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిందంటే
మంటల్లో యుక్రెయిన్ రసాయన కర్మాగారం.. 800 మంది పౌరులు చిక్కుకుపోయినట్లు ఆందోళన
యుక్రెయిన్‌లోని సెవెరోడోన్యస్క్ నగరం మీద రష్యా సైన్యం అవిరామంగా చేసిన బాంబుదాడుల ఫలితంగా ఒక రసాయన కర్మాగారంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ఆ ప్రాంత గవర్నర్ సెర్హీయ్ హాయ్‌దాయ్ చెప్పారు.
శనివారం నాటి బాంబుదాడుల్లో దెబ్బతిన్న రేడియేటర్ల నుంచి టన్నుల కొద్దీ చమురు లీక్ అయి మంటలు రాజుకున్నాయని సెర్హీయ్ యుక్రెయిన్ టీవీ చానల్‌కు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమైనా సంభవించిందా అనే వివరాలు ఆయన చెప్పలేదు.
ఈ అజోట్ ప్లాంటులో వందలాది మంది పౌరులు తలదాచుకుంటున్నట్లు చెప్తున్నారు. రష్యా సైనిక దాడుల నుంచి తప్పించుకోవటానికి ఈ ప్లాంటుకు చేరిన పౌరులు ఇప్పుడు అందులో చిక్కుబడినట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కనీసం 800 మంది పౌరులు ఇక్కడ ఉన్నట్లు యుక్రెయిన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తూర్పు యుక్రెయిన్‌ను తమ భూభాగంలో కలుపుకోవటానికి రష్యా రచించన ప్రణాళికకు సెవెరోదోన్యస్క్ కీలకం.
రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై మూడు నెలలు దాటిపోయింది. యుక్రెయిన్ రాజధాని కీయెవ్, ఇతర ముఖ్య నగరాలను హస్తగతం చేసుకోవటానికి చేసిన ప్రయత్నాలు విఫలమవటంతో రష్యా ఇప్పుడు తూర్పు ప్రాంతంలోని లూహాన్స్క్, దోన్యస్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది.
సెవెరోదోన్యస్క్ నగరంలో అత్యధిక భాగం ఇప్పుడు రష్యా చేతుల్లో ఉందని సెర్హీయ్ హాయ్‌దాయ్ ఒక ప్రకటనలో అంగీకరించారు. నగరంలోని నివాస ప్రాంతం మొత్తం ఇప్పుడు తమ నియంత్రణలో ఉందని రష్యా సైన్యం చెప్తోంది.
‘బ్రేకప్ తరువాత ఆయన నా ప్రైవేట్ వీడియోలన్నీ ఫ్రెండ్స్‌కి షేర్ చేశాడు.. అప్పుడు నేనేం చేశానంటే’
కోవిడ్: కొత్తగా 8,582 కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 8,582 కేసులు నమోదయ్యాయి.
దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 44,513కి పెరిగింది.
గత 24 గంటల్లో నలుగురు కోవిడ్ కారణంగా మరణించారు.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,761కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నాగాలాండ్ సైనిక కాల్పుల ఘటన కేసులో నిందితులుగా 30 మంది జవాన్లు, డిసెంబర్ 4న సైన్యం కాల్పుల్లో 13 మంది పౌరుల మృతి
నాగాలాండ్‌లో గత ఏడాది 13 మంది పౌరులు చనిపోయిన సైన్యం కాల్పుల ఘటనకు సంబంధించి 30 మంది సైనికులు నిందితులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
మియన్మార్ సరిహద్దులోని మాన్ జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన సైన్యం తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్ చేపట్టింది. ఆ సందర్భంగా జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న మైనర్లను తీవ్రవాదులుగా భావించిన సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని పోలీసులు తమ నివేదికలో చెప్పారు.
ఆ కాల్పుల్లో ఆరుగురు మైనర్లు అక్కడికక్కడే చనిపోయారు.
ఆగ్రహించిన జనం సైన్యంతో ఘర్షణకు దిగినపుడు మరో ఏడుగురు పౌరులు, భారత సైన్యానికి చెందిన జవాను ఒకరు చనిపోయారు.
ఈ హత్యల పట్ల భారత సైన్యం క్షమాపణ చెప్పింది. సంఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (సైనిక కోర్టు విచారణ)కు ఆదేశించింది.
పారా స్పెషల్ ఫోర్సెస్ బలగానికి చెందిన 21 మంది సైనికులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఇతర నిబంధనలను పాటించలేదని, వారి విచక్షణారహిత కాల్పుల వల్ల గ్రామస్తులు చనిపోయారని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెప్పారు.
ఆయుధాలు అయిపోయాయి.. త్వరగా పంపించండి: అమెరికా, యూరప్‌లకు యుక్రెయిన్ వినతి
రష్యా సైన్యంతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ బలగాల వద్ద ఆయుధాలు, మందు గుండు నిండుకుంటున్నాయని యుక్రెయిన్ నేతలు చెప్తున్నారు.
తమ సైనికులు ఆయుధాలు లేకుండానే యుద్ధం చేస్తున్నారని యుక్రెయిన్ దక్షిణ సరిహద్దులోని మైకొలేయివ్ గవర్నర్ విటాలీ కిమ్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
రష్యా సైన్యం చాలా బలంగా ఉందని, కానీ తమ సైనికులు ఆయుధాల కొరతతో సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
రష్యా సైన్యాన్ని తిప్పికొట్టటానికి.. దూర లక్ష్యాలపై దాడి చేసే ఆయుధాలు, మందుగుండును యుక్రెయిన్‌కు అందించే సరఫరాలను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
యూరప్, అమెరికాల సాయం చాలా ముఖ్యమన్నారు. యుక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన వాదిమ్ స్కిబిట్స్కీ కూడా శుక్రవారం నాడు బ్రిటన్ పత్రిక గార్డియన్ ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పారు.