నేడు బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్
నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాను పని చేయనున్నట్లు పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ తెలిపారు. ఈమేరకు ఆయన నేడు బీజేపీలో చేరుతున్నారు.
గుజరాత్‌కు చెందిన హార్దిక్ పటేల్, 2019లో కాంగ్రెస్‌లో చేరగా ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.
త్వరలోనే గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో దీన్ని కీలక పరిణామంగా చూడొచ్చు.
గుజరాత్‌లోని పాటీదార్లను ఓబీసీలుగా పరిగణించాలంటూ 2015లో హార్దిక పటేల్ నేతృత్వంలో భారీ స్థాయి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం నుంచి ఆయన నేతగా ఎదిగారు.
ఒకనాడు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ ఉండేవారు హార్దిక్ పటేల్. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌తో పొసగని ఆయన, కొద్ది నెలలుగా బీజేపీతో టచ్‌లో ఉంటూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఆయన మీద కొన్ని కేసులను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ వచ్చింది.