UPSC2021: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు వీళ్లే..
2021 వ సంవత్సరానికిగానూ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా మొదటి నాలుగు ర్యాంకుల్లో అమ్మాయిలే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు సివిల్స్ పరీక్షలో అర్హత సాధించారు. 50లోపు మూడు ర్యాంకులు వచ్చాయి.
లైవ్ కవరేజీ
శారద మియాపురం and బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?
ఫొటో సోర్స్, OTHER
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం నగరంలో వారం క్రితం హింస, దహనాలు జరిగాయి. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టడంతోపాటూ అయిదు బస్సులను కూడా తగలబెట్టారు. వాహనాలు ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. హింసాత్మకంగా మారిన నిరసనలను అదుపు చేయడానికి పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. అమలాపురం అంతటా 144 సెక్షన్ అమలు చేయాల్సి వచ్చింది.
ఈ హింస, మహారాష్ట్రలో 44 ఏళ్ల క్రితం ఒక యూనివర్సిటీ పేరు మార్చిన సందర్భంగా జరిగిన ఘర్షణలను గుర్తు చేస్తోంది.
ఆ సమయంలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అప్పుడు కూడా డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ పేరు గురించే వివాదం తలెత్తింది. కారణం అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక యూనివర్సిటీకి అంబేడ్కర్ పేరు పెట్టాలనుకుంది.
మరాఠ్వాడా యూనివర్సిటీకి డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే నిర్ణయం తర్వాత జరిగిన ఈ అల్లర్లు ఇప్పటికీ మహారాష్ట్ర సామాజిక చరిత్రకు ఒక గాయంగా మిగిలిపోయాయి.
బంగారం కొనేముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...
నేపాల్ విమాన ప్రమాదం: ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం
ఫొటో సోర్స్, ANI
నేపాల్‌లో
ఆదివారం కూలిపోయిన విమాన శకలాలు లభ్యమయ్యాయి. వీటి నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం
సోమవారం 14 మృతదేహాలను వెలికితీసింది.
నేపాల్ పోలీస్
కమిషనర్ రాజ్ కుమార్ తమంగ్ సారథ్యంలోని బృందం ఘటనా స్థలానికి చేరకుందని వార్తా
సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. కొందరు ప్రయాణికుల మృతదేహాలను గుర్తించడం దాదాపు అసాధ్యం
అని అధికారులు చెప్పినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారి దేవ్ చంద్రలాల్ కర్ణ్, బీబీసీతో మాట్లాడుతూ... ‘’14 మృతదేహాలు లభించాయి. నలుగురు భారతీయులు సహా మొత్తం 22 మంది విమానంలో ఉన్నారు’’ అని చెప్పారు.
ఫొటో సోర్స్, NEPAL ARMY
‘‘విమానంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ప్రమాదంలో మరణించినట్లు అనుమానిస్తున్నాం. మా ప్రాథమిక దర్యాప్తు ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని సూచిస్తుంది. కానీ, ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది’’ అని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫణీంద్ర మణి పోఖ్రెల్, ఏఎన్‌ఐతో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
బంగారం కొంటున్నారా? మోసపోకుండా ఉండేందుకు మీరు తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...
‘రాజ్యసభ పదవికి నేను అర్హురాలిని కాదా?’- కాంగ్రెస్ నేత నగ్మా
ఫొటో సోర్స్, Getty Images
రాజ్యసభ అభ్యర్థుల పేర్లు వెలువడగానే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు
మొదలయ్యాయి.
మొదట పవన్
ఖేరా ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా నగ్మా కూడా ఈ అంశంపై
ట్వీట్ చేశారు. 18 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ తనను రాజ్యసభకు
పంపుతానని హామీ ఇచ్చారని, అది ఇప్పటికీ నెరవేరలేదని ఆమె
ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘2003-04లో సోనియాగాంధీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్‌లో చేరినప్పుడు మా కాంగ్రెస్
అధ్యక్షురాలు సోనియా స్వయంగా నన్ను రాజ్యసభకు పంపుతానని హామీ ఇచ్చారు. ఇప్పటికి 18 ఏళ్లు అవుతుంది. కానీ, వారికి నన్ను రాజ్యసభకు పంపే అవకాశమే చిక్కలేదు.
మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్‌ను రాజ్యసభకు పంపుతున్నారు. నాకు ఆ అర్హత లేదా?" అని ఆమె ట్వీట్‌లో ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
దీనికంటే ముందు పవన్ ఖేరా... ‘‘బహుశా నా తపస్సులో ఏదో లోపం ఉండొచ్చు’’ అని ట్వీట్ చేశారు. దీనికి బదులుగా ‘‘ఇమ్రాన్ భాయ్ ముందు నా 18 సంవత్సరాల తపస్సు కూడా వెనుకబడింది’’ అని నగ్మా మరో ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
రాజ్యసభ ఎన్నికలకు 10 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఆదివారం రాత్రి ప్రకటించింది. పి.చిదంబరం, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారీ, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హిలను కాంగ్రెస్ ఈ జాబితాలో చేర్చింది.
రాజ్యసభ సీటు ఆశించి భంగపాటకు గురైన కొందరు నాయకులు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 800పైగా పాయింట్ల లాభంతో 55,697 వద్ద, నిఫ్టీ 16,578 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయని వార్తా సంస్థ ఏఎన్‌ఐ
తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో కొత్తగా 2,706 కరోనా కేసులు
భారత్‌లో గడిచిన 24
గంటల్లో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదైనట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. తాజా
కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 17,698కి చేరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటన్స్... ఫైనల్లో రాజస్థాన్‌పై ఘన విజయం
ఫొటో సోర్స్, BCCI/IPL
కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రతిభతో గుజరాత్ టైటన్స్ జట్టు తుదిపోరులో రాజస్థాన్ మీద 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 'ఐపీఎల్ 2022' చాంపియన్‌గా అవతరించింది. కొత్తగా ఏర్పడిన ఈ జట్టు తాను పాల్గొన్న తొలి ఐపీఎల్ టోర్నమెంట్‌లోనే ట్రోఫీని సొంతం చేసుకుంది.
హార్దిక్ పాండ్యా తన మొదటి నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకుని రాజస్థాన్ స్కోరు 130కి పరిమితం చేయగలిగాడు.
ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చి 34 పరుగులు చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో గుజరాత్ టైటన్స్ మొదటిసారిగా ఐపీఎల్ విజేతగా నిలిచింది.
నేపాల్ ప్రమాదం: అదృశ్యమైన విమాన శకలాల గుర్తింపు, ప్రయాణీకుల్లో నలుగురు భారతీయులు
ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లో ఆదివారం కనిపించకుండా
పోయిన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎన్‌ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమాన శకలాలు
లభ్యమయ్యాయి.
ముస్తాంగ్
జిల్లాలోని కోవాంగ్‌లో ఈ విమానం జాడను ఆదివారం సాయంత్రమే గుర్తించారు.
‘‘సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన దళాలు,
విమానం కూలిపోయిన ప్రదేశానికి చేరుకున్నాయని’’ నేపాల్ సైన్యం అధికార ప్రతినిధి
సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.
కూలిపోయిన విమానం ఫొటోను
కూడా షేర్ చేశారు.
మొత్తం 19 మంది
ప్రయాణీకులతో నేపాల్‌లోని పొఖారా నుంచి జోమ్‌సోమ్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన ఈ
విమానం కొద్దిసేపటికే ఎయిర్ కంట్రోల్ సిస్టమ్‌తో కమ్యూనికేషన్ కోల్పోయి కనిపించకుండా
పోయింది.
ప్రయాణీకుల్లో
నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాల్ ప్రజలతో పాటు నలుగురు విమాన
సిబ్బంది ఉన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అన్వేషణ ఆలస్యమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్
తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.