You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

నేపాల్ విమాన ప్రమాదం: పైలట్ ఫోన్ సహాయంతో విమానం ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు

పైలట్ ఫోన్ రింగ్ అవుతుందని, దీని ద్వారా విమానం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని నేపాల్ విమానయాన అధికారులు చెబుతున్నారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. అంబేడ్కర్ పుట్టిన గడ్డపై ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినప్పుడు ఎందుకంత హింస చెలరేగింది?

  2. ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటన్స్... ఫైనల్లో రాజస్థాన్‌పై ఘన విజయం

  3. నేటి ముఖ్యాంశాలు

    • యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీతో ప్రత్యక్ష చర్చలు జరపాలని ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరారని జర్మనీ చాన్సలర్ కార్యాలయం తెలిపింది.
    • ఉత్తర్‌ప్రదేశ్‌, రనియాలోని అక్బర్‌పూర్ కొత్వాలిలో ఒక బాయిలర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
    • మహారాష్ట్రలో మొదటిసారి కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
    • జమ్ము కశ్మీర్ పోలీసులు ఆదివారం ఉదయం కతువా సరిహద్దు జిల్లాలోని హరియా చక్ ప్రాంతంలో ఒక డ్రోన్‌ను కూల్చివేశారు.
    • నైరుతి రుతుపవనాలుఆదివారం కేరళలోకి ప్రవేశించాయి.ఊహించిన దానికంటే మూడు రోజుల ముందుగా కేరళకు చేరుకున్నాయి.
    • పౌరులు సమర్పించిన ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు దుర్వినియోగం అవుతుండడంతో యూఐఏడీఐ ప్రజలను అప్రమత్తం చేసింది.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.

  4. కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

  5. నేపాల్ విమాన ప్రమాదం: పైలట్ ఫోన్ సహాయంతో విమానం ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు

    పైలట్ ఫోన్ రింగ్ అవుతుందని, దీని ద్వారా విమానం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని నేపాల్ విమానయాన అధికారులు చెబుతున్నారు.

    మొబైల్ ఫోన్ రింగ్‌ను ట్రాక్ చేయడానికి ఒక హెలీకాప్టర్‌ను పంపామని, అయితే ఇప్పటివరకు విమానం జాడ తెలియలేదని జోమ్‌సోమ్ విమానాశ్రయంలో పనిచేస్తోన్న అధికారి సుశీల్ రిసాల్ తెలిపారు.

    ‘‘మేం తుకుచే కొండల వైపు మరిన్ని హెలీకాప్టర్లు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కానీ, వాతావరణం ప్రతికూలంగా ఉంది’’ అని ఆయన చెప్పారు.

    కనిపించకుండా పోయిన విమానం కోసం న్యూరీకోత్, కోవాంగ్, తెలె, ఘోడెపాల్నీ, తితితాల్‌లలో వెదుకుతున్నామని ఆదివారం మధ్యాహ్నం నేపాల్ విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    నేపాల్‌లోని పొఖారా నుంచి 22 మందితో జోమ్‌సోమ్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎన్ఏఈటీ ట్విన్ ఇంజన్ విమానం ఉదయం 10: 11 గంటల నుంచి కనిపించకుండా పోయింది.

    ప్రయాణీకుల్లో నలుగురు భారతీయులు ఉన్నారు.

  6. సిద్ధూ మూసేవాలా హత్య: పంజాబీ సింగర్‌, కాంగ్రెస్ నాయకుడిపై కాల్పులు, హత్య... కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఏమన్నారంటే..

  7. చార్ ధామ్ యాత్ర: ఇప్పటివరకు 86 మంది యాత్రికులు చనిపోయారు.. కారణం ఏమిటి?

  8. జమ్ము కశ్మీర్: మాగ్నటిక్ బాంబులతో సరిహద్దు దాటి వస్తోన్న డ్రోన్‌ కూల్చివేత, మోహిత కంధారి, బీబీసీ ప్రతినిధి

    జమ్ము కశ్మీర్ పోలీసులు ఆదివారం ఉదయం కతువా సరిహద్దు జిల్లాలోని హరియా చక్ ప్రాంతంలో ఒక డ్రోన్‌ను కూల్చివేశారు.

    డ్రోన్‌తో పాటు 7 మాగ్నటిక్ బాంబులు, 7 అండర్ బారెల్ 'గ్రెనేడ్ లాంచర్' (ముజీబీఎల్) గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం నుంచి డ్రోన్ వచ్చింది. రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌‌కు చెందిన సెర్చ్ పార్టీ వెంటనే డ్రోన్‌ను కూల్చివేసింది.

    డ్రోన్‌కు జతచేసి కొన్ని వస్తువులు ఉన్నాయని, వాటిని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ విచారించిందని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు.

    డ్రోన్‌తో పాటు 7 మాగ్నటిక్ బాంబులు, 7 యూజీబీఎల్ గ్రెనెడ్లు ఉన్నట్లు జమ్ము జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ ధ్రువీకరించారు.

  9. కర్రపెండలం అంటే ఏమిటి? గోదుమలు మానేసి దీన్ని తినాలని ఈ దేశాధ్యక్షుడు ఎందుకు అన్నారు?

  10. కేరళను ముందుగానే తాకిన రుతుపవనాలు

    నైరుతి రుతుపవనాలుఆదివారం కేరళలోకి ప్రవేశించాయి.ఊహించిన దానికంటే మూడు రోజుల ముందుగా కేరళకు చేరుకున్నాయి.

    దక్షిణ శ్రీలంక మీదుగా నైరుతి రుతుపవనాలు కేరళ వైపు కదులుతున్నాయని వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది.

    జూన్ 1కి బదులుగా మే 29వ తేదీనే రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.

    అయితే, నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకున్నట్లు ఆదివారం వాతావారణ శాఖ ప్రకటించింది.

    రానున్న ఐదు రోజుల పాటు దిల్లీ, ఈశాన్య భారత్‌లో వడగాల్పుల నుంచి ఉపశమనం ఉంటుందని సీనియర్ శాస్త్రవేత్త ఆర్ జెనమణి, వార్తా సంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.

  11. డోలు వాయిస్తూ అందరిచేత శభాష్ అనిపిస్తున్న అక్కాచెల్లెళ్లు

  12. కోనసీమకు ఆ పేరు ఎలా వచ్చింది?

  13. కాంటాక్ట్స్ లెన్స్ కంప్యూటర్ స్క్రీన్లు కాబోతున్నాయా? స్మార్ట్ లెన్స్‌లలో రాబోతున్న కొత్త ఫీచర్లేంటి?

  14. బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?

  15. ఆధార్ జిరాక్స్ కాపీలు దుర్వినియోగం కాకుండా మాస్క్‌డ్ ఆధార్ వాడండి-యుఐడీఏఐ

    పౌరులు సమర్పించిన ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు దుర్వినియోగం అవుతుండడంతో యూఐఏడీఐ ప్రజలను అప్రమత్తం చేసింది.

    బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్, మొబైల్ సిమ్ లాంటి ఏదైనా అవసరాల కోసం ఆధార్ ఫొటోకాపీలు ఇవ్వడానికి బదులు ఇక నుంచి యూఐఏడీఐ వెబ్‌సైటు నుంచి ఆధార్ మాస్క్‌డ్ కాపీలు డౌన్‌లోడ్ చేసుకోవాలని, వాటినే ఉపయోగించాలని సంస్థ సూచించింది.

    యూఐఏడీఐ వెబ్ సైట్ నుంచి ఆధార్ మాస్క్‌డ్ కాపీలు డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు అందులో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి.

    ఈ ఆధార్ కాపీపై ఫొటో, క్యూఆర్ కోడ్, చిరునామా కూడా ఉంటాయి. ఎవరైనా గుర్తింపు కోసం ఆధార్ ఇవ్వాల్సివస్తే, ఈ మాస్క్‌డ్ ఆధార్ ఇవ్వవచ్చు.

    మొత్తం ఆధార్ నంబర్ కనిపించకుండా ఉండడం వల్ల దానిని ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఉంటారు.

    హోటళ్లు, సినిమా హాళ్లు లాంటి వాటికి పూర్తి ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా యూఐడీఏఐ చెప్పింది.

  16. బ్రేకింగ్ న్యూస్, నేపాల్‌లో విమానం గల్లంతు, ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు

    నేపాల్‌లోని పొఖారా నుంచి 19 మంది ప్రయాణికులతో దేశంలోని జోమ్‌సోమ్‌కు బయల్దేరిన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎన్ఏఈటీ ట్విన్ ఇంజన్ విమానం గల్లంతైందని ఏఎన్ఐ చెప్పింది.

    ఆదివారం ఉదయం 9.55 నిమిషాలకు ఆ విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు నేపాల్ ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారని తెలిపింది.

    ఈ విమానం ముస్టాంగ్ జిల్లాలోని జోమ్‌సోమ్ గగనతలంలో కనిపించిందని, తర్వాత దానిని మౌంట్ ధౌలగిరికి మళ్లించామని, ఆ తర్వాత నుంచి దానితో సంబంధాలు తెగిపోయాయని జిల్లా ప్రధానాధికారి నేత్రా ప్రసాద్ శర్మ ఏఎన్ఐతో చెప్పారు.

    ఆ ప్రాంతంలో గాలించడానికి ఒక హెలికాప్టర్‌ను పంపించినట్లు ముస్టాంగ్ డీఎస్పీ రామ్ కుమార్ దని చెప్పారని కూడా ఏఎన్ఐ పేర్కొంది.

    ఈ విమానంలో మొత్తం సిబ్బందితో కలిపి 22 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీయులు కాగా మిగతా వారందరూ నేపాల్ దేశస్థులేనని ఆ దేశ మీడియా తెలిపిందని ఏఎన్ఐ చెప్పింది.

  17. IPL 2022 GT vs RR: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్‌ రాయల్స్‌లో విజేతగా నిలిచేదెవరు

  18. 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు

  19. కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం, ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు, శరభవరం గ్రామాల్లోని 6 గేదెలను హతమార్చిన పులి

    కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

    గత పది రోజులుగా ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, పోతులూరు, శరభవరం గ్రామాల్లో ఏదో జంతువు పశువులపై దాడి చేస్తోందని, ఆరు గేదెల్ని కూడా చంపేసిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

    అనంతరం అటవీ అధికారులు సీసీ కెమెరాల సహాయంతో పులి తిరుగుతున్నట్లు నిర్ధరించుకున్నారు.

    పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

    పులిని పట్టుకునేందుకు 120 మంది అటవీ సిబ్బంది రంగంలో దిగినట్లు అటవీ అధికారులు తెలిపారు.

    చీఫ్ అటవీ అధికారి శరవణన్ ఆధ్వర్యంలో పులి అడుగు జాడలు గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

  20. ఐఎన్ఎస్ గోమతి సేవలకు ముగింపు పలికిన నావికా దళం

    34 ఏళ్లు సైన్యానికి సేవలందించిన ఐఎన్ఎస్ గోమతి సేవలకు మహారాష్ట్రలో భారత నావికాదళం ముగింపు పలికినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    ఐఎన్ఎస్ గోమతికి ఒక నావీ మెమోరియల్ నిర్మించేలా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.