జాస్ బట్లర్ సెంచరీ, 14 ఏళ్ల తర్వాత ఫైనల్లో రాజస్థాన్
ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన రాజస్థాన్ ఫైనల్ చేరుకుంది.
చెలరేగిపోయిన ఓపెనర్ జాస్ బట్లర్ 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్ 2008 తర్వాత మొదటిసారి ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఆ సమయంలో షేన్ వార్న్ కెప్టెన్సీలో ఆ జట్టు టోర్నీ మొదటి విజేతగా నిలిచింది.
టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బెంగళూరును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానంచాడు. బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.
తర్వాత ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీ, యశస్వి జైశ్వాల్ 21, కెప్టెన్ సంజు శాంసన్ 23 పరుగుల సాయంతో రాజస్థాన్ 19వ ఓవర్లోనే విజయం సాధించింది.
రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 59 బంతులకు సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ సిక్సర్‌తో జట్టుకు విజయం అందించాడు.