జమ్ము-కశ్మీర్: శ్రీనగర్, అవంతిపురాలో ఎన్‌కౌంటర్లు, నలుగురు మిలిటెంట్లు మృతి
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జమ్ము-కశ్మీర్‌లో గురువారం రాత్రి భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి.
శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లు, అవంతిపురాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ హత్యకు కారణమైన ఇద్దరు మిలిటెంట్లు చనిపోయారని ఏఎన్ఐ తెలిపింది.
చనిపోయిన మిలిటెంట్ల నుంచి ఒక ఏకే-47 రైఫిల్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
గత మూడు రోజుల్లో పోలీసులు ఎన్‌కౌంటర్లలో 10 మంది మిలిటెంట్లను కాల్చి చంపారని, వారిలో ఏడుగురు లష్కరే, ముగ్గురు జైషే మహ్మద్‌కు చెందినవారని ఆయన చెప్పారు.
ఇటీవల రాష్ట్రంలో మిలిటెంట్లకు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పుల ఘటనలు పెరిగాయి.
కొన్ని రోజుల క్రితం లోయలో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్య జరిగినప్పటి నుంచి కశ్మీరీ పండిట్లు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం కూడా కనిపిస్తోంది.





