You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

హైదరాబాద్: పట్టపగలు, నడిరోడ్డుపై మహిళపై హత్యాయత్నం

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ఒక మహిళపై హత్యాయత్నం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. కంచన్ బాగ్ ప్రాంతంలో ఒమర్ హోటల్ దగ్గర మహిళ నడచి వెళ్తున్నప్పుడు వెనకేవచ్చిన వ్యక్తి ఆమెను కత్తితో పలుమార్లు పొడిచారు. దగ్గర ఉన్న వారు ఎవరూ ఆపే సాహసం చేయలేకపోయారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. జమ్ము-కశ్మీర్: శ్రీనగర్, అవంతిపురాలో ఎన్‌కౌంటర్లు, నలుగురు మిలిటెంట్లు మృతి

    జమ్ము-కశ్మీర్‌లో గురువారం రాత్రి భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి.

    శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లు, అవంతిపురాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ హత్యకు కారణమైన ఇద్దరు మిలిటెంట్లు చనిపోయారని ఏఎన్ఐ తెలిపింది.

    చనిపోయిన మిలిటెంట్ల నుంచి ఒక ఏకే-47 రైఫిల్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.

    గత మూడు రోజుల్లో పోలీసులు ఎన్‌కౌంటర్లలో 10 మంది మిలిటెంట్లను కాల్చి చంపారని, వారిలో ఏడుగురు లష్కరే, ముగ్గురు జైషే మహ్మద్‌కు చెందినవారని ఆయన చెప్పారు.

    ఇటీవల రాష్ట్రంలో మిలిటెంట్లకు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పుల ఘటనలు పెరిగాయి.

    కొన్ని రోజుల క్రితం లోయలో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్య జరిగినప్పటి నుంచి కశ్మీరీ పండిట్లు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం కూడా కనిపిస్తోంది.

  2. ఒంగోలులో తెలుగుదేశం 'మహానాడు' ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభమయ్యింది.

    ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

    మహానాడులో భాగంగా తొలిరోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ జరుగుతుందని టీడీపీ తెలిపింది.

    మహానాడులో ఆమోదించే 17తీర్మానాలను పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆమోదించారు.

    రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేలా మహానాడు నిర్వహిస్తామని నేతలు చెబుతున్నారు. మహానాడు నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు.

    గత రెండేళ్లలో కరోనా వల్ల టీడీపీ మహానాడు బహిరంగంగా నిర్వహించడం కుదరలేదు. ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి వేడుకల ప్రారంభమవుతున్న తరుణంలో ఈ మహానాడుకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారు

  3. నల్గొండ: బారాత్‌ వేడుకలో కారు డ్రైవ్ చేసిన పెళ్లి కొడుకు, బాలుడి మృతి

    నల్గొండ జిల్లా చండూర్ మండలం గట్టుప్పల్ గ్రామంలో బారాత్ వేడుకలో కారు నడిపిన పెళ్లి కొడుకు ఒక బాలుడి మృతికి కారణమయ్యాడు.

    యదాద్రి జిల్లా నారాయణపురంలో గట్టుప్పల్‌కు చెందిన మల్లేష్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వధూవరులు రాత్రి కారులో స్వగ్రామానికి బయల్దేరారు.

    ఈ సందర్భంగా డీజే పాటలతో బారాత్ ఏర్పాటు చేశారు. పెళ్ళికొడుకు ఇల్లు కొంత దూరంలో ఉండగా బంధువులు, స్నేహితులు డ్యాన్స్ చేస్తున్నప్పుడు డ్రైవర్ కారు దిగి పక్కకు వెళ్లాడు.

    అదే సమయంలో వరుడు తనకు డ్రైవింగ్ రాకపోయినా, ఆ కారు నడిపే ప్రయత్నం చేశాడు. దీంతో కారు ఒక్కసారిగా ముందు డ్యాన్స్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.

    కారు వేగంగా ముందున్న డీజే బాక్సులను,ట్రాక్టర్‌ను ఢీకొనడంతో 13 ఏళ్ల సాయి చరణ్ అనే బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. పెళ్లి కొడుకుతో సహా కొందరు గాయపడ్డారు.

    దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.