హైదరాబాద్: పట్టపగలు, నడిరోడ్డుపై మహిళపై హత్యాయత్నం
హైదరాబాద్లో నడిరోడ్డుపై ఒక మహిళపై హత్యాయత్నం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. కంచన్ బాగ్ ప్రాంతంలో ఒమర్ హోటల్ దగ్గర మహిళ నడచి వెళ్తున్నప్పుడు వెనకేవచ్చిన వ్యక్తి ఆమెను కత్తితో పలుమార్లు పొడిచారు. దగ్గర ఉన్న వారు ఎవరూ ఆపే సాహసం చేయలేకపోయారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
వర్చువల్ కోర్టులతో ఏమేం మార్పులొచ్చాయంటే
నేటి ముఖ్యాంశాలు
- నల్గొండ జిల్లా చండూర్ మండలం గట్టుప్పల్ గ్రామంలో బారాత్ వేడుకలో కారు నడిపిన పెళ్లి కొడుకు ఒక బాలుడి మృతికి కారణమయ్యాడు.
- అమెరికా, టెక్సస్‌లో ఒక ప్రైమరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాయుధుడు స్కూల్లోకి చొరబడినప్పుడు అతడిని ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు.
- భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 58వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఆయనకు నివాళి అర్పించారు.
- ఒంగోలులో శుక్రవారం ప్రారంభమైన మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
- డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
లడక్: నదిలో పడిపోయిన ఆర్మీ బస్సు, ఏడుగురు సైనికులు మృతి

ఫొటో సోర్స్, Getty Images
లడక్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది మరణించినట్లు వార్తా ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
ఆర్మీ వాహనం 26 మంది సైనికులతో లడక్‌లోని పార్తాపూర్ ట్రాన్సిట్ క్యాంపు నుంచి సబ్ సెక్టార్ హనీఫ్‌కు వెళ్తుండగా, వాహనం రోడ్డుపై నుంచి షైనోక్ నదిలో పడిపోయినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ నది 50-60 అడుగుల లోతు ఉంటుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సైనికులు చనిపోగా, 19 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘లడక్‌లోని బస్సు ప్రమాదంలో సైనికులను కోల్పోవడం చాలా బాధ కలిగించింది. ఈ వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’’ అని రాశారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా మరణించిన సైనికులకు సంతాపం తెలియజేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఏడుస్తున్నాడని పసిబిడ్డ తలను సోఫాకేసి కొట్టిచంపిన తల్లి.. అసలేం జరిగింది?
హైదరాబాద్: పట్టపగలు, నడిరోడ్డుపై మహిళపై హత్యాయత్నం, బళ్ల సతీశ్

హైదరాబాద్లో నడిరోడ్డుపై ఒక మహిళపై హత్యాయత్నం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘటనజరిగింది. కంచన్ బాగ్ ప్రాంతంలో ఒమర్ హోటెల్ దగ్గర మహిళ నడచి వెళ్తున్నప్పుడు వెనకేవచ్చిన వ్యక్తి ఆమెను కత్తితో పలుమార్లు పొడిచారు. దగ్గర ఉన్న వారు ఎవరూ ఆపే సాహసంచేయలేకపోయారు.
హఫీజ్ బాబా నగర్ కి చెందిన నూర్ బాను భర్త మరణించాడు.ఆమె ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఆమెకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. దాదాపుఏడాదిగా అదే వీధికి చెందిన హబీబ్ అనే వ్యక్తి ఆమెను వేధిస్తన్నట్టు ఆమె కుమార్తె, మరిదిస్థానిక మీడియాకు చెప్పారు. దీనిపై తాము మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనివారు ఆరోపిస్తున్నారు. స్థానిక పెద్దలు నచ్చచెప్పినా అతను వినలేదని వారు చెబుతున్నారు.
అనుమానితుడు, బాధితురాలి మధ్య గొడవ జరిగి ఉండొచ్చనిపోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అనుమానితుడికోసం పోలీసులు వెతుకుతున్నారు.
తొమ్మిదో తరగతి చదివి, దేశాలన్నీ తిరుగుతూ నెలకు లక్షకు పైనే సంపాదిస్తున్న యువకుడు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థత పాలయ్యారు. శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు.
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరధిలోని గోటువారికండ్రిగ, మన్నవరప్పాడు, ఆమంచర్ల గ్రామాలలో ఆయన పర్యటించారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆమంచర్లలో పర్యటించిన ఆయన పాదయాత్ర సమయంలో గుండెలో నొప్పిగా ఉండటంతో పలు ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకున్నారు.
నొప్పి ఎక్కువ కావడంతో నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను చెన్నైకి తరలించారు.
బీబీసీ తెలుగు కార్టూన్

పాప చనిపోయిందని ఖననం చేశారు, కానీ తవ్వి చూస్తే ప్రాణంతో ఉంది. ఆ తర్వాత..
భారత్‌కు 5 పతకాలు తెచ్చిన జూనియర్ షూటర్లు
పాకిస్తాన్: లీటర్ పెట్రోల్ రూ. 180... డీజిల్ రూ. 174... కిరోసిన్ రూ. 154.. భారత్‌ను పొగుడుతున్న ఇమ్రాన్ ఖాన్
ఎఫ్3 రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్‌ల వేసవి కాలక్షేపం... లాజిక్ లేని మ్యాజిక్

ఫొటో సోర్స్, SRI VENKATESWARA CREATIONS
ఎన్నో జోనర్లు. ఎన్నో కథలు. ఎప్పటికప్పుడు కొత్త జోనర్లు వస్తుంటాయి. పాత కథలు బోరు కొడుతుంటాయి. అయితే, కామెడీకి ఉండే గిరాకీనే వేరు. కామెడీ ఎప్పుడూ బోర్ కొట్టదు. `ఇంకోసారి నవ్విస్తాం..` అని చెప్పి, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమా తీస్తే చాలు. ఆదరణ దక్కడం ఖాయం.
అయితే, ఈమధ్య పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాలు రావడం లేదు. టాప్ హీరోలు ఈ జోనర్లకు ఎప్పుడో దూరమైపోయారు. కామెడీలు తీసే సామర్థ్యం ఉన్న దర్శకులూ కరువయ్యారు. కొద్దో గొప్పో అనిల్ రావిపూడి అలాంటి సినిమాలు అందిస్తూ వస్తున్నారు.
`ఎఫ్-2`తో ఆ దర్శకుడు చేసిన మ్యాజిక్ మనకు తెలిసిందే. ఇంటిల్లిపాదినీ కట్టిపడేసిన ఆ సినిమా అందరూ హాయిగా నవ్వుకునేలా చేసింది.
ఆ ఉత్సాహంతోనే, ఆ సినిమా ఇచ్చిన భరోసాతోనే `ఎఫ్ 3` వచ్చింది. వెంకటేష్, వరుణ్‌తేజ్ 'బ్రొమాన్స్', రావిపూడి డైరెక్షన్, తమన్నా, మెహరీన్‌ల గ్లామర్.. అన్నీ `ఎఫ్ 3`కి ఎలాంటి విజయాన్ని కట్టబెట్టాయి? ఎఫ్ 2తో పోలిస్తే.. ఈ సీక్వెల్ ఏ స్థాయిలో ఉంది..తెలుసుకుందాం?
పూర్తి కథనం చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
'ప్రజాస్వామ్యాన్ని సంపన్నులకు మేలు చేయడానికే పుట్టించారు, దాని కోసం పేదలు డబ్బు చెల్లిస్తున్నారు'
ఫ్యూచర్ ఫుడ్స్: 2050నాటికి మనం తినే ఆహార పదార్థాలు ఇవేనా?

ఫొటో సోర్స్, Getty Images
2050నాటికి మన ఆహారంలో భాగమయ్యే అవకాశమున్న కొన్ని మొక్కలపై పరిశోధకులు దృష్టిసారించారు. నిజానికి వీటిలో చాలా మొక్కలపై మనకు తెలిసిన వివరాలు చాలా తక్కువ.
భవిష్యత్‌లో ఫాల్స్ బనానాతో బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చని లేదా పాండెనస్ చెట్టు పళ్లను స్నాక్స్‌గా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రస్తుతం 90 శాతం కేలరీలు మనకు కేవలం 15 పంటల నుంచే వస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో మన ఆహారంలో భాగమయ్యే పంటలపై లండన్‌లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్ నిపుణులు దృష్టిసారించారు.
వాటి గురించి తెలుసుకోవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్

ఫొటో సోర్స్, INSTAGRAM
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
కోర్టులో శుక్రవారం ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 6,000 పేజీల అభియోగపత్రం దాఖలు చేసింది.
ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నట్లు ఆధారాలు లేవని ఎన్‌సీబీ అధికారి ఒకరు తెలిపారు.
ఆర్యన్, మెహక్ మినహా మిగతా అందరి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో 14 మంది నిందితులుగా ఉన్నారు.
ముంబయిలోని ఒక క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 2న దాడులు చేసింది. ఈ దాడుల్లో తొలుత 8 మందిని అరెస్ట్ చేసింది.
ఈ ఎనిమిది మందిలో నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌తోపాటూ అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమిచా గురించే ఎక్కువ చర్చ జరిగింది.
ఈ కేసులో ఆర్యన్‌ఖాన్‌తో పాటు మరో 17 మందిని ఎన్‌సీబీ గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ చేసింది. తర్వాత ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ లభించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’: మహానాడులో చంద్రబాబు

ఒంగోలులో శుక్రవారం ప్రారంభమైన మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు...
- పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనను కొనసాగిస్తున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు
- రాష్ట్రంలో కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయి. చేతకాని పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది.
- మహానాడు అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఇది తెలుగువారి పండుగ. తెలుగుదేశం వెనుకబడిన తరగతుల పార్టీ.
- వైసీపీ ప్రభుత్వం చెత్తపై, డ్రైనేజీపై, పెట్రోల్ ఇలా ప్రతి దానిపై పన్నులు, ధరలతో ప్రజలను బాదేస్తోంది. ఇసుక, సిమెంట్ ధరలు కూడా పెంచేసింది.
- సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణరంగం దెబ్బతింది. రాష్ట్ర ప్రజలు నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు.
మహానాడు: తెలుగుదేశం పార్టీ పండుగకు సంబంధించి 8 ఆసక్తికర అంశాలు

మహానాడు అంటే తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద పండుగలా భావిస్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం(మే 28) సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏటా మహానాడును నిర్వహిస్తుంది.
ఈసారి ఒంగోలులో మహానాడును రెండు రోజుల పాటు మే 27, 28 తేదీల్లో నిర్వహిస్తోంది. గతంలో మూడు రోజుల పాటు సాగిన ఈ మహానాడు స్వరూపం క్రమంగా మారుతోంది. అనేక కారణాల వల్ల తర్వాతి కాలంలో టీడీపీ దీనిని రెండు రోజలకే పరిమితం చేస్తూ వస్తోంది.
జవహర్‌లాల్ నెహ్రూ 58వ వర్ధంతి, కాంగ్రెస్ నేతల నివాళి

ఫొటో సోర్స్, ani
భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 58వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఆయనకు నివాళి అర్పించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ సందర్భంగా సోనియాగాంధీతోపాటూ రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన ఇతర నేతలు న్యూదిల్లీలోని శాంతి వనంలోని నెహ్రూ సమాధికి పుష్పాంజలి ఘటించారు.
జవహర్‌లాల్ నెహ్రూ 1964 మే 27న దిల్లీలో మృతిచెందారు. ఆయన 1946 నుంచి 1964లో చనిపోయేవరకూ చాలాసార్లు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు.
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 58వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా నివాళులు అర్పించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
టెక్సస్ స్కూల్ కాల్పులు: స్కూల్లో సాయుధుడిని ఎవరూ అడ్డుకోలేదు-పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, టెక్సస్‌లో ఒక ప్రైమరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాయుధుడు స్కూల్లోకి చొరబడినప్పుడు అతడిని ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు.
స్కూల్ సెక్యూరిటీ గార్డుల్లో ఒక్కరు కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, ఆ సమయంలో అసలు స్కూల్ తలుపు మూసి ఉందా, లేదా అనేది కూడా స్పష్టంగా తెలీడం లేదని టెక్సస్ రేంజర్ విక్టర్ ఎస్కెలాన్ చెప్పారు.
పోలీసుల దర్యాప్తుపై వస్తున్న విమర్శలను ఎస్కెలాన్ తోసిపుచ్చారు.
ఎలిమెంటరీ స్కూల్లో సాయుధుడు కాల్పులు జరుపుతున్నప్పుడు.. పోలీసులు వెంటనే లోపలికి వెళ్లకుండా ఆలస్యం చేశారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
దీనితోపాటూ కాల్పులు జరుతున్న యువకుడిని కాల్చి చంపాలని పోలీసులు అక్కడున్న గార్డులకు చెప్పారని వస్తున్న వార్తలను కూడా ఎస్కెలాన్ ఖండించారు.
సాయుధుడు స్కూల్లోకి వెళ్లిన నాలుగు నిమిషాలకే పోలీసులు కూడా స్కూల్లోకి వెళ్లారని ఆయన చెప్పారు.
సాయుధుడు ఆపకుండా కాల్పులు జరుపుతుండడంతో పోలీసులు వెంటనే లోపలికి వెళ్లలేకపోయారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
అమెరికా, టెక్సస్‌లోని ఒక ప్రైమరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది పిల్లల సహా 21 మంది మృతి చెందారు.
యువాల్డే నగరంలో రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరిపిన 18 ఏళ్ల అనుమానిత సాయుధుడు సాల్వడార్ రామోస్ తర్వాత భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందాడు.
