తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందా?
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ఉద్ధవ్ ఠాక్రే
ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినాయకుడు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది.
అసెంబ్లీ వేదికగా జూన్ 30న ఉద్ధవ్ ఠాక్రే బలాన్ని నిరూపించుకోవాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సూచించారు. దీనికి వ్యతిరేకంగా శివసేన నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పరిణామాల నడుమ ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్
ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడిగా ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ప్రమాణ స్వీకారం చేశారు.
రోడ్రిగో డ్యుటెర్టె తరువాత పిలిప్పీన్స్ అధ్యక్షుడిగా మార్కోస్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది మేలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన 60 శాతం ఓట్లు సాధించారు.
ఈ విజయంతో మార్కోస్ కుటుంబం ఫిలిప్పీన్స్‌లో తిరిగి అధికారంలోకి వచ్చింది. 1986 తిరుగుబాటు తరువాత మార్కోస్ కుటుంబం అధికారానికి దూరమైంది.
ఆ దేశంలో మార్కోస్ జూనియర్‌ను ముద్దుగా బాంగ్-బాంగ్ అని కూడా పిలుస్తారు.
మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కుమార్తె సారా డ్యుటెర్టె ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మార్కోస్ జూనియర్ గురువారం మనీలాలోని నేషనల్ మ్యూజియంలో స్థానిక సమయం 12.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులను ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.
మార్కోస్ జూనియర్ తండ్రి ఫెర్డినాండ్ 1965 నుంచి 1986 వరకు ఫిలిప్పీన్స్‌లో అధికారంలో ఉన్నారు.
కానీ, 1986లో మార్కోస్ కుటుంబానికి వ్యతిరేకంగా లక్షలాది మంది తిరుగుబాటు చేశారు. దాంతో, మార్కోస్ కుటుంబం దేశం విడిచిపెట్టి హవాయికి పయనమైంది. అప్పుడు మార్కోస్ జూనియర్ వయస్సు 28 సంవత్సరాలు.
దీని తరువాత, మార్కోస్ జూనియర్ 1991లో ఫిలిప్పీన్స్‌కు తిరిగి వచ్చారు.
రాజస్థాన్: నేడు ఉదయ్‌పూర్ చేరుకోనున్న సీఎం అశోక్ గెహ్లాట్.. ఈరోజు జైపూర్‌లో బంద్
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
మంగళవారం ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్యలాల్ హత్య సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈరోజు ఉదయపూర్ చేరుకోనున్నారు. వీరితో పాటు హోం శాఖ సహాయ మంత్రి రాజేంద్ర యాదవ్, డీజీపీ ఎంఎల్ లాటర్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉదయ్‌పూర్‌లో పర్యటించనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు కన్నయ్యలాల్ దుకాణంలోకి ప్రవేశించి, ఆయన్ను గొంతు కోసి హత్య చేశారు.
ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారని, బుధవారం మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారని రాజస్థాన్ పోలీస్ డీజీపీ ఎంఎల్ లాటర్ బీబీసికి చెప్పారు.
ఈ హత్యపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందం విచారణ జరుపుతోంది.
మరోవైపు, జైపూర్‌లో హిందూ సంస్థలు ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈరోజంతా బంద్ కొనసాగుతుంది.
జూలై 3 ఆదివారం భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిపేందుకు హిందూ సంస్థలు సిద్ధమవుతున్నాయి. సుమారు లక్ష మంది వీధుల్లోకి వచ్చి ఈ నిరసనల్లో పాల్గొంటారని అంచనా.
కాగా, అన్ని రాజకీయ పార్టీలు, మత సంస్థలు, సాధారణ ప్రజలు సంయమనం పాటించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని సీఎం గెహ్లాట్ కోరారు. అశాంతిని, భయానక వాతావరణాన్ని ప్రేరేపించే వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
హత్య తరువాత, ముందు జాగ్రత్త చర్యగా రాజస్థాన్ అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. ఉదయపూర్‌లో 144 సెక్షన్ విధించారు.
సత్య సాయి జిల్లా: బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఆటో ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంఓ అధికారులు తెలియజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
సత్య సాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటోకు హైటెన్షన్ వైర్లు తగిలి అయిదుగురు మహిళా కూలీలు సజీవదహనం
ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, మంటల్లో కాలిపోయిన ఆటో
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడడంతో అయిదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
తాడిమర్రి మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన 11 మంది కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్ల కొండయ్య పల్లి గ్రామానికి ఆటోలు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో అయిదుగురు మహిళలు చనిపోయారని ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించామని ధర్మవరం రూరల్ సీఐ మన్సురుద్దీన్ బీబీసీతో చెప్పారు.
సహాయక చర్యలు జరుగుతున్నాయని మరిన్ని వివరాలు తరువాత తెలియజేస్తామని ఆయన అన్నారు.
ఏక్‌నాథ్ శిందే: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్
మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య పెరగడానికి అసలు కారణాలేంటి?
బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర: ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
ఫొటో సోర్స్, ANI
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్
ఠాక్రే రాజీనామా చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా గురువారం బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన
ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
బలపరీక్షలో ఓటు వేయడానికి నవాబ్ మాలిక్,
అనిల్ దేశ్‌ముఖ్‌లకు అనుమతి ఇచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఫేస్‌బుక్ వేదికగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తనకు మద్దతుగా నిలిచిన ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు.
తాను అనుకోకుండా ఈ పదవిలోకి వచ్చానని, అదే పద్ధతిలో పదవిని విడిచి వెళుతున్నానని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తన ప్రసంగంలో ఠాక్రే వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
తాజ్ హోటల్‌లో బీజేపీ నేతల సమావేశం
ముంబయిలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో
సమావేశమైన బీజేపీ నేతలు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా ప్రకటన వెలువడగానే మాజీ
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ
తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ సమావేశంలో ఫడణవీస్‌తో పాటు, బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మరికొందరు బీజేపీ నేతలు పాల్గొన్నారు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 4
22 రోజుల ముందే ముగిసిన వర్షాకాలం, ఆల్‌టైమ్ గరిష్ట ఉష్ణోగ్రతలతో హడలిపోతున్న ప్రజలు
ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?
భావప్రకటనా స్వేచ్ఛ ఒప్పందంపై మోదీ సంతకం చేయడాన్ని కొందరు ఎందుకు తప్పుబడుతున్నారు?
విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ సొరంగం గురించి ఎంతమందికి తెలుసు?
కన్నయ్యలాల్: రాజీ కుదిరిన తర్వాత కూడా నిందితులు ఎందుకు హత్యకు పాల్పడ్డారు, ఈ కేసులో ఇంతకు ముందు ఏం జరిగింది?
ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు
ఫొటో సోర్స్, ECISVEEP
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్ 6న జరగనున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం 2022 ఆగస్టు 10తో ముగియనుందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ మేరకు బుధవారం భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) ఎస్‌హెచ్ రాజీవ్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశమై ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
దీని ప్రకారం, జూలై 7న నోటిఫికేషన్ వెలువడనుంది.
నామినేషన్ల దాఖలు కోసం చివరి తేదీని జూలై 19గా నిర్ణయించారు.
జూలై 20న నామినేషన్లను పరిశీలిస్తారు.
నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు చివరి తేదీ జూలై 22.
ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ ట్విటర్ అకౌంట్ నిలిపివేత
ఫొటో సోర్స్, Twitter
పాకిస్తాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతాను భారత్‌లో నిలిపి
వేశారు.
లీగల్ కారణాల వల్ల భారత్‌లో @GovtofPakistan ఖాతాను హోల్డ్‌లో పెట్టారనే సందేశం పాకిస్తాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతాలో కనిపిస్తోంది.
ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు చెందిన పలు ట్విటర్
ఖాతాలను భారత్‌లో నిలిపి వేశారు.
యూఎన్‌లోని పాకిస్తాన్ ఎంబసీతోపాటు ఇరాన్,
ఈజిప్టు,టర్కీలలోని పాకిస్తాన్ ఎంబసీ ట్విటర్ ఖాతాలను ఇండియాలో ఆపేశారు.
అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్‌లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
రాజస్థాన్: కన్నయ్య లాల్ హత్యను ఖండించిన జమా మసీద్ ఇమామ్
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన కన్నయ్య
లాల్ హత్యను దిల్లీలోని జమా మసీద్ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఖండించారు.
‘అది పిరికిపందలు చేసే చర్య. రియాజ్, గౌస్ అనే
ఇద్దరు వ్యక్తులు మహ్మద్ ప్రవక్త పేరుతో హత్య చేయడం ఇస్లామ్‌కు వ్యతిరేకం.
భారతదేశంలోని ముస్లింల అందరి తరపున నేను దీన్ని
ఖండిస్తున్నా.’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
బిల్‌గేట్స్‌ను కలిసిన మహేశ్ బాబు
ఫొటో సోర్స్, Facebook/Mahesh Babu
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను తెలుగు
సినీ నటుడు మహేశ్ బాబు కలిశారు.
బిల్‌గేట్స్‌తో మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా
శిరోద్కర్ ఫొటో దిగారు. ఆ ఫొటోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సమ్మర్ వెకేషన్‌లో భాగంగా ప్రస్తుతం మహేశ్ బాబు
ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఉన్నారు.
ప్రపంచంలోనే గొప్ప దార్శనికుడైన వ్యక్తిని కలవడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు రాశారు.
సూర్యకు ‘ఆస్కార్’ నుంచి ఆహ్వానం
ఫొటో సోర్స్, Facebook/APV
తమిళ సినీ నటుడు సూర్య, బాలీవుడ్ నటి కాజోల్‌కు అరుదైన
అవకాశం లభించింది.
అకాడమీ క్లాస్‌లో సభ్యులు అయ్యేందుకు ఆస్కార్ అవార్డులు
ఇచ్చే ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ నుంచి సూర్య, కాజోల్‌కు
ఆహ్వానాలు అందాయి.
2022కు సంబంధించి 397 మంది కొత్త కళాకారులకు ఆహ్వానాలు
పంపారు.