తెలంగాణ: ‘‘కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ’’ – నరేంద్ర మోదీ
‘‘తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’’అని మోదీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెప్పారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
ఆంధ్రప్రదేశ్: వాలంటీర్ల న్యూస్‌పేపర్ ఖర్చును ప్రభుత్వం ఎందుకు ఇస్తోంది, విపక్షాలకు అభ్యంతరం ఎందుకు?
హోటళ్ళు, రెస్టారెంట్లలో ఏదైనా తిన్న తరువాత సర్వీస్ చార్జి ఇవ్వమంటే ఏం చేయాలి?
ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనిషికి ఎప్పటి నుంచి మొదలైంది?
పాకిస్తాన్‌లో చైనా పౌరులపై దాడుల వల్ల సీపెక్ ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయా?
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ముగిస్తున్నాం. అమెరికా ఇండిపెండెన్స్ డే పరేడ్ కాల్పుల ఘటన అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సిడ్నీని ముంచెత్తిన భారీ వరదలు.. ఏడాదిన్నరలో మూడోసారి ముంపులో నగరవాసులు
విశాఖపట్నం: అగస్ట్ 14 నుంచి అగ్నివీరుల రిక్రూట్‌మెంట్, శ్రీనివాస్ లక్కోజు, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Facebook/IndianArmy
విశాఖపట్నంలో ఈ ఏడాది అగస్ట్ 14 నుంచి 31 వరకు అగ్నిపథ్ కింద రిక్రూట్‌మెంట్ ర్యాలీ చేపట్టనున్నారు. వన్ టౌన్ ఏరియాలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ ర్యాలీ నిర్వహిస్తారని వైజాగ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం తెలిపింది.
అభ్యర్థులు www.joinindianarmy.nic ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, పార్వతీపురం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, యానాంల అభ్యర్థులు పాల్గొనవచ్చు.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టెక్నికల్ విభాగాలకు రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నారు.
ఈ పోస్టులకు 8, 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు.
ఉత్తర్ ప్రదేశ్: హిందూ దేవుళ్ల బొమ్మలున్న న్యూస్ పేపర్లో చికెన్ అమ్మినందుకు ముస్లిం వ్యక్తి అరెస్టు
‘పిల్లల ఆకలి తీర్చడానికి బిస్కెట్ కొనలేకపోతున్నా.. పాలు కూడా ఇవ్వలేకపోతున్నా’- ఓ తల్లి వేదన
కేరళ మంత్రి: ‘భారత్ రాజ్యాంగం ప్రజలను దోచుకుంటోంది’

ఫొటో సోర్స్, Facebook/Saji Cherian
భారత రాజ్యాంగం ప్రజలను దోచుకుంటోందంటూ కేరళ రాష్ట్ర మంత్రి సాజీ చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
‘బ్రిటీషర్లు తయారు చేశారు. దాన్ని భారత్ రాసి, అమలు చేసింది. ప్రజలను దోచుకోవడానికి అందమైన రాజ్యాంగాన్ని భారత్ రాసింది.’ అని సీపీఐఎం కార్యక్రమంలో మాట్లాడుతూ చెరియన్ అన్నారు.
అయితే చెరియన్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వి.మురళీధరన్ తప్పు పట్టారు. ‘సాజీ చెరియన్ రాజ్యాంగాన్ని అవమానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి.’ అని మురళీధరన్ విమర్శించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
IND vs ENG: ఐదో టెస్టులో ఇంగ్లండ్ చరిత్రాత్మక విజయం.. టీమిండియా పొరపాట్లు ఇవేనా?
జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహించడంపై వివాదం దేనికి... పాకిస్తాన్ ఎందుకు వద్దంటోంది?
పాకిస్తాన్‌లో అత్యవసరంగా దిగిన స్పైస్‌జెట్ విమానం

ఫొటో సోర్స్, Facebook/FlySpiceJet
దిల్లీ నుంచి దుబాయి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్‌జీ-11 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల కరాచీ విమానాశ్రయంలో దించినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
విమానంలోని సాంకేతికత లోపం ఇండికేటర్ లైట్‌కు సంబంధించినదిగా స్పైస్‌జెట్ వెల్లడించింది.
కరాచీలో విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా ప్రయాణికులందరూ బాగానే ఉన్నారని, ప్రయాణికుల కోసం మరొక విమానాన్ని పంపుతున్నట్లు తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పుష్ప గ్యాంగ్: సరికొత్తగా చందనం స్మగ్లింగ్... పగలంతా రెక్కీ, రాత్రిపూట పక్కాగా చోరీ
కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మార్గదర్శి ఈ లాయర్
పుంగనూరు ఆవులు: చూడడానికి చాలా చిన్నగా ఉండే ఈ ఆవులంటే ఎందుకంత క్రేజ్?
స్టార్టప్స్ ప్రోత్సాహంలో టాప్ పెర్ఫార్మర్‌గా తెలంగాణ
భారత్‌లో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ‘టాప్ పెర్ఫార్మర్’ కేటగిరీలో నిలిచింది.
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం స్టార్టప్ స్టేట్ ర్యాంకులను విడుదల చేశారు.
బెస్ట్ పెర్ఫార్మర్స్, టాప్ ఫెర్ఫార్మర్స్, ద లీడర్స్, ఎమర్జింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ విభాగాలుగా రాష్టాలను విభజించారు.
ఇందులో బెస్ట్ పెర్ఫార్మర్స్ కేటగిరీలో గుజరాత్, కర్ణాటక, మేఘాలయ ఉన్నాయి.
టాప్ ఫెర్ఫార్మర్స్ విభాగంలో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ కశ్మీర్ ఉన్నాయి
లీడర్స్ విభాగంలో తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్,పంజాబ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్, గోవా ఉండగా... చివరిదైన ఎమర్జింగ్ స్టార్టప్ కేటగిరీలో బిహార్, ఆంధ్రప్రదేశ్, మిజోరామ్, లడఖ్ చోటు దక్కించుకున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో కొత్తగా 13,086 కరోనా కేసులు
భారత్‌లో సోమవారం కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిథ్వ శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 19 మంది చనిపోయారు. 12,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా కేసులతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,14,475గా ఉంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అగ్నిపథ్: విశాఖపట్నంలో అగస్ట్ 14 నుంచి రిక్రూట్‌మెంట్ డ్రైవ్