You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

‘‘మొఘల్ పాలకుల భార్యలు ఎవరు?’’ – అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు

‘‘మొఘల్స్‌కు భారత్‌లోని ముస్లింలతో సంబంధం లేదు. మరి మొఘల్ పాలకుల భార్యలు ఎవరో మీరే చెప్పండి’’అని ఆయన ప్రశ్నించారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. సెక్స్, అధికారం, భయం....మన పురాణాలకు ప్రేరణ ఇచ్చింది ఇవేనా?

  2. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  3. నేటి ముఖ్యాంశాలు

    కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని 27 హిందు, జైన దేవాలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించిన దిల్లీ సాకేత్ కోర్టు, తీర్పును రిజర్వ్ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    శ్రీనగర్‌లో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపారు. దాడిలో ఆయన కుమార్తె కూడా గాయపడ్డారు.

    ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ సత్కరించారు.

    కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ఆందోళన తీవ్రమవుతోంది. మంగళవారం నిరసన కట్టలు తెంచుకుంది.

    పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు. దిల్లీలో ఈ ఏడాది అక్టోబరు 18న ఆయన ప్రదర్శన ఉంటుందని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

  4. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌గా టెడ్రోస్ అఢనోమ్ మరోసారి ఎన్నిక

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతిగా టెడ్రోస్ అఢనోమ్ మరోసారి ఎన్నికయ్యారు.

    ఐదేళ్లపాటు ఆయన మరోసారి ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది.

    టెడ్రోస్ పదవీ కాలం ముగియనుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశంలో కొత్త చీఫ్ ఎన్నిక జరిగింది.

    టెడ్రోస్ స్వదేశం ఆఫ్రికాలోని ఇథియోపియా.

  5. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బట్టలు విప్పేసిన మహిళ

  6. కుతుబ్ మినార్ కేసు: తీర్పు రిజర్వ్ చేసిన దిల్లీ కోర్టు

    కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని 27 హిందు, జైన దేవాలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించిన దిల్లీ సాకేత్ కోర్టు, తీర్పును రిజర్వ్ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    మెహ్రూలీలోని కవ్వత్-ఉల్-ఇస్లాం మసీదును, హిందూ దేవాలయాల ప్రాంగణంలో నిర్మించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    అప్పీలుదారు, ఇతర పక్షాలు చేసిన సుదీర్ఘ వాదనలు విన్న అదనపు జిల్లా జడ్జి నిఖిల్ చోప్రా తీర్పును జూన్ 9 వరకు రిజర్వ్ చేశారు.

    దిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఉన్న కుతుబ్ మినార్, కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు భారతదేశంలో ముస్లింలు నిర్మించిన తొలి కట్టడాల్లో ఒకటి.

    కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు నిజానికి ఒక హిందూ దేవాలయమని, అక్కడ పూజలు చేసుకోవడానికి హిందువులను అనుమతించాలని కొన్ని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కోర్టులో దావా కూడా వేశాయి

  7. అమలాపురంలో విధ్వంసం: మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లకు నిప్పు

  8. శ్రీనగర్‌లో కాల్పులు.. పోలీసు అధికారి మృతి

    శ్రీనగర్‌లో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపారు. దాడిలో ఆయన కుమార్తె కూడా గాయపడ్డారు.

    ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు మంగళవారం ట్విటర్‌లో వెల్లడించారు.

    మరణించిన పోలీసు అధికారి పేరు సైఫుల్లా ఖాద్రిగా పేర్కొన్నారు.

    ఆయన కుమార్తెకు ఎలాంటి ప్రాణాపాయమూలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  9. నిఖత్ జరీన్‌ను సత్కరించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్

    ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ సత్కరించారు.

    సీనియర్ విభాగంలో జరీన్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డ్ సృష్టించారు. టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌‌‌లో ఆమె స్వర్ణం సాధించారు.

    52 కేజీల విభాగం (ఫ్లై వెయిట్)లో గురువారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5-0తో జిట్‌పోంగ్ జుటామస్ (థాయ్‌లాండ్)పై గెలిచారు.

    మరోవైపు కాంస్య పతకాలు గెలిచిన మనీషా మౌన్, ప్రవీన్‌లను కూడా దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్కరించారు.

  10. ‘‘మొఘల్ పాలకుల భార్యలు ఎవరు?’’ – అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు

    వారణాసిలోని కాశీ విశ్వనాథ మందిరం- జ్ఞాన్‌వాపి వివాదం తర్వాత మొఘల్ పాలకుల చుట్టూ జరుగుతున్న చర్చపై ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి స్పందించారు.

    ‘‘మొఘల్స్‌కు భారత్‌లోని ముస్లింలతో సంబంధం లేదు. మరి మొఘల్ పాలకుల భార్యలు ఎవరో మీరే చెప్పండి’’అని ఆయన ప్రశ్నించారు.

    ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ స్పందించారు.

    ‘‘మహిళలను కించ పరిచేలా ఒవైసీ వ్యాఖ్యలు చేశారు. ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? అయినా ఒవైసీ ఇలా మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు’’అని ఆయన అన్నారు.

  11. కోనసీమ ఉద్రిక్తం.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు, మూడు బస్సుల దహనం

  12. యోగి ఆదిత్యనాథ్: ‘అబ్బాయిలూ.... తప్పు చేస్తారు అంటే ఇక కుదరదు’

    సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, అత్యాచారం చేసిన వారికి మరణశిక్షను వ్యతిరేకిస్తూ 2014 ఏప్రిల్‌లో ‘అబ్బాయిలు తప్పులు చేస్తుంటారు’ అని అన్నారు.

    మొరాదాబాద్‌లో ర్యాలీ సందర్భంగా ములాయం సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి.

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అసెంబ్లీలో ములాయం సింగ్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్‌ను టార్గెట్ చేశారు.

    నేరం ఎలాంటిదైనా ఉపేక్షించేది లేదని అన్నారు. ‘‘ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇక్కడ ఎలాంటి నేరాన్ని క్షమించం. ‘అబ్బాయిలు... తప్పులు చేస్తుంటారు’ అని ఇక్కడ నేరస్థులను గురించి మాట్లాడం. దోషులు ఎవరైనా సహించేది లేదు. మేం నేరస్థులపై చర్యలు తీసుకుంటామని స్వయంగా ప్రతిపక్షాలే అంగీకరించాయి. గూండాయిజానికి మారుపేరుగా మారిన ప్రతీ నేరస్థుడినీ సమాజ్‌వాదీ పార్టీ కాపాడుతోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను మెరుగుపరచడం వల్లే మేం మళ్లీ అధికారంలోకి వచ్చాం’’ అని యోగి వ్యాఖ్యానించారు.

  13. భారత్: క్వాడ్ ‘టోక్యో సదస్సు’ లక్ష్యం చైనాయేనా

  14. పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు

  15. ఆరు జట్లతో 'మహిళల ఐపీఎల్' వచ్చే ఏడాది నుంచి ప్రారంభం.. ఈ ఏడాది సంగతేంటి

  16. అమలాపురంలో ఆందోళనలు, పోలీసులపైకి రాళ్లు, కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ నిరసనలు

    కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ఆందోళన తీవ్రమవుతోంది. మంగళవారం నిరసన కట్టలు తెంచుకుంది.

    పోలీస్ ఆంక్షలు ఉల్లంఘించి వందల మంది రోడ్లపైకి వచ్చారు.

    బారికేడ్లు, అడ్డుగా పెట్టిన వాహనాలను తోసుకుంటూ కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. నిరసన చేస్తున్నవారిలో కొందరు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు గాయాలపాలయ్యారు.

    సెక్షన్ 144, యాక్ట్ 30 అమలులో ఉందని, నిరసనకారులు రోడ్డుపైకి రావద్దని ఉదయం నుంచి పోలీసులు ప్రచారం చేశారు.

    అయితే ముందుగా ప్రకటించినట్టు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా వందలమంది వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి మీదకు రావడంతో ఒక్కసారిగా వేడెక్కింది.

    పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఉద్యమకారులు ఆగలేదు.

    దాంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది.

    అదే సమయంలో కలెక్టర్ ఆఫీసు వైపు ఆందోళనకారులు వెళ్లకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

    జై కోనసీమ నినాదాలతో వందల మంది కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

  17. దిల్లీలో జస్టిన్ బీబర్ ప్రదర్శన అక్టోబరు 18న

    పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు.

    దిల్లీలో ఈ ఏడాది అక్టోబరు 18న ఆయన ప్రదర్శన ఉంటుందని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

    ‘జస్టిస్ వరల్డ్ టూర్’లో భాగంగా దిల్లీలోని జవహర్ ‌లాల్ నెహ్రూ స్టేడియంలో జస్టిన్ బీబర్ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.

    ఏఈజీ, బుక్‌ మై షోలు దీనికి కో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి.

    జస్టిస్ వరల్డ్ టూర్‌లో భాగంగా బీబీర్ 30 దేశాలలో పర్యటించనున్నారు. ఈ ఏడాది మే నుంచి 2023 మార్చ్ వరకు కొనసాగే ఈ టూర్‌లో ఆయన 125 ప్రదర్శనలు ఇస్తారు.

    జస్టిన్ బీబర్ ఇంతకుముందు 2017లో ఆయన భారత్‌లో ప్రదర్శన ఇచ్చారు. పర్పజ్ వరల్డ్ టూర్‌లో భాగంగా 2017లో ఆయన ముంబయిలో ప్రదర్శన ఇవ్వగా 40 వేల మంది అభిమానులు హాజరయ్యారు.

  18. బ్రేకింగ్ న్యూస్, జ్ఞాన్‌వాపి మసీదు: ‘మొదట ముస్లిం పక్షం పిటిషన్‌ను విచారిస్తాం’- వారణాసి జిల్లా కోర్టు

    జ్ఞాన్‌వాపి మసీదుపై తదుపరి విచారణను వారణాసి జిల్లా కోర్టు మే 26కి వాయిదా వేసింది.

    సర్వే నివేదికపై తమ లిఖితపూర్వక అభ్యంతరాలను దాఖలు చేసేందుకు కోర్టు ఇరుపక్షాలకు అనుమతి ఇచ్చింది.

    మే 26న ముస్లిం పక్షం పిటిషన్‌పై విచారణ జరగనుంది.

    మసీదులో సర్వే నిర్వహించడం 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణను చూస్తున్న అంజుమన్ ఇంతెజామియా కమిటీ చెబుతోంది. ఈ చట్టం ప్రకారం, దేశంలోని ఏ ప్రార్థనా మందిరం స్వరూపాన్ని మార్చకూడదు.

    ఈ అంశంపై గురువారం విచారణ జరగనుంది.జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే నిర్వహించడం చట్టబద్ధమైనదా కాదా అనే అంశాన్ని వారణాసి జిల్లా కోర్టు నిర్ణయిస్తుందని గత శుక్రవారం సుప్రీంకోర్టు పేర్కొంది.

    మంగళవారం విచారణ సందర్భంగా జిల్లా కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ... "దేశ ఉన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ న్యాయస్థానం అంజుమన్ ఇంతెజామియా మసీదు పిటిషన్‌పై తొలుత విచారించి, తర్వాత ఇతర పిటిషన్లను విచారిస్తుంది’’ అని అన్నారు.

  19. మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా

  20. నిఖత్ జరీన్: ‘కుమార్తెల పట్ల మీ దృక్పథం మార్చుకోండి’

    తల్లిదండ్రులు, తమ కుమార్తెల ఆకాంక్షలకు మద్దతుగా నిలవాలని, వారిపట్ల తమ వైఖరి మార్చుకోవాలని ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కోరినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ‘‘ఆడపిల్ల పుట్టిందని తెలియగానే బాధపడే తల్లిదండ్రులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. కానీ, కూతురు పుట్టిందంటే అర్థం లక్ష్మీదేవి పుట్టినట్లు. ఈరోజుల్లో ఆడపిల్లలు తమ కుటుంబసభ్యులతో పాటు దేశానికి గర్వంగా నిలుస్తున్నారు. అందుకే, ఆడపిల్లల పట్ల మీ దృక్పథాన్ని మార్చుకొని వారికి మద్దతుగా నిలవాలి. డాక్టర్, పోలీస్, బాక్సర్ అవ్వాలనే వారి కలలు నిజం అయ్యేందుకు మీరు సహాయపడండి. వారికి మీ మద్దతు అవసరం. నా దృష్టిలో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే’’ అని అన్నట్లు ఏఎన్ఐ పేర్కొంది.