‘‘రైతుల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని కేంద్రం అంటోంది.. మేం చచ్చినా ఆ పని చేయం’’ – కేసీఆర్

‘‘నిరసనలు చేపడుతున్న రైతులను ఖలిస్థానీ ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. కేవలం పంజాబ్, హరియాణా, దిల్లీ, యూపీలో మాత్రమే కాదు దేశం మొత్తం రైతులు నిరసనలు చేపట్టాలని నేను కోరుతున్నాను’’అని కేసీఆర్ అన్నారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. ‘నేను చచ్చిపోయానని అనుకుంటామన్నారు.. కానీ ఇప్పుడు కాపుకాసి నా భర్తను చంపేశారు’

  2. అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసిన కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి వెళ్లారు.

    కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన కేసీఆర్... వెండి వీణను కేజ్రీవాల్‌కు బహూకరించారు.

    మధ్యాహ్న భోజనం కోసం కేజ్రీవాల్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

    లంచ్ అనంతరం కేసీఆర్, పంజాబ్‌కు బయల్దేరనున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఆంధ్రప్రదేశ్: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై హత్య ఆరోపణలు ఎందుకొచ్చాయి? వివాహేతర సంబంధాల ప్రస్తావన ఏమిటి

    అనంతబాబు

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం మృతి సంచలనంగా మారింది.

    మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీ తన స్టిక్కర్‌తో ఉన్న కారులో మృతుడి ఇంటికి తీసుకెళ్లడం అనుమానాలు పెంచుతోంది.

    సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ఎమ్మెల్సీ చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగి ఉన్నాయని, మృతదేహంపై ఇసుక ఉందని చెబుతుండటంతో సందేహాలు పెరుగుతున్నాయి.

    పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  4. ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’

  5. మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?

    మంకీపాక్స్

    ఫొటో సోర్స్, REUTERS

    కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి మనమింకా తేరుకోలేదు. నిజానికి కరోనావైరస్ ప్రపంచాన్ని ఇంకా కలవరపెడుతూనే ఉంది. ఇంతలోనే మరో వైరస్ కలకలం రేపుతోంది. దానిపేరు మంకీపాక్స్.

    అంటే మశూచి (పెద్ద అమ్మవారు - స్మాల్ పాక్స్), పొంగు (చిన్న అమ్మవారు, ఆటలమ్మ - చికెన్ పాక్స్) తట్టు వంటి మరో వైరస్.

    ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో 80 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఈ వ్యాధి కనిపించని బ్రిటన్‌లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి.

    అసలు ఏం జరుగుతోంది? ఈ మంకీపాక్స్ గురించి మనం భయపడాలా? లేకపోతే కోవిడ్ నీడలో బతికి బయటపడ్డాం కనుక ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నామా?

    ఈ అంశాల గురించి తెలుసుకోవాలంటే పూర్తి కథనాన్ని చదవండి.

  6. ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది?

    ఔరంగజేబు

    ఫొటో సోర్స్, Getty Images

    సుమారు 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇప్పుడు భారతదేశంలో హాట్ టాపిక్‌గా మారాడు. సోషల్ మీడియాలో ఔరంగజేబు మీద చర్చలు నడుస్తున్నాయి.

    భారతదేశాన్ని ఘనంగా పాలించిన మొఘల్ చక్రవర్తులలో చివరివాడిగా ఔరంగజేబు గురించి చెప్పుకుంటారు.

    ఔరంగజేబు ముత్తాత అక్బరు దయగల ప్రభువుగా, లౌకికవాదిగా పేరు తెచ్చుకున్నాడు. తాత జహంగీర్ కళలు, వాస్తుశిల్పం పట్ల మక్కువ ఉన్న రాజుగా, తండ్రి షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించిన గొప్ప ప్రేమికుడిగా చరిత్ర పుటల్లోకెక్కారు.

    కానీ, చరిత్రకారులకు ఔరంగజేబు ఏమంత ప్రియమైనవాడు కాడు. ఇటీవల ఔరంగజేబు పేరు మళ్లీ చర్చల్లోకి రావడం, అతడిపై విస్తరిస్తున్న ద్వేషం ఊహకు అందనిది.

  7. నరేంద్ర మోదీ: ‘థామస్ కప్ గెలుపొందడం చిన్న విజయం కాదు’

    ఉన్నతి

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీతో 14 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నతి హుడా

    ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుతో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

    దేశ ప్రజలందరి తరఫున ప్రధాని మోదీ, టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. థామస్ కప్ టైటిల్‌ను గెలుపొందడం చిన్న విజయమేమీ కాదని అభినందించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘మేమూ చేయగలమనే’ దృక్పథమే నేడు దేశానికి కొత్త శక్తిగా మారిందని అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మద్దతు లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

    పురుషుల జట్టుకు నేతృత్వం వహించిన తెలుగు క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్, మోదీతో భేటీ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

    ‘‘క్రీడాకారులకు ప్రధాని మోదీ అండగా నిలవడం అథ్లెట్లు అందరూ గర్వించే అంశం. దీనికి సాటి వచ్చే మరో అంశం లేదు. మా మ్యాచ్ అనంతరం ఆయన మాతో మాట్లాడిన తీరు నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇది క్రీడాకారులందరికీ ప్రేరణగా నిలుస్తుంది’’ అని శ్రీకాంత్ అన్నారు.

    థామస్ కప్‌లో పాల్గొన్న ప్లేయర్లతో పాటు ఉబెర్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల ఉన్నతి హుడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  8. దిల్లీలో సీఎం కేసీఆర్: నేడు కేజ్రీవాల్‌ నివాసంలో లంచ్, అనంతరం చండీగఢ్‌కు పయనం

    కేసీఆర్, కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, facebook/kcr

    దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లనున్నారు.

    మధ్యాహ్న భోజనం కోసం కేజ్రీవాల్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

    11:30 గంటలకు 6 ఫ్లాగ్ స్టాఫ్ మార్గ్, సివిల్ లైన్స్‌లోని కేజ్రీవాల్ నివాసంలో భోజనం చేసి, ఆయన చండీగఢ్‌కు పయనం కానున్నారు.

    అక్కడ రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, రూ. 3 లక్షల చొప్పున చెక్కులు అందజేస్తారు.

    మే 26న కేసీఆర్ బెంగళూరు చేరుకుని మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అవుతారు.

    మే 29, 30 తేదీలతో పశ్చిమబెంగాల్, బిహార్ పర్యటన ఉంటుంది.

  9. ఇమ్రాన్ ఖాన్: ‘భారత్‌లో పాలసీలు ప్రజల కోసం రూపొందుతాయి’

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    భారత ప్రభుత్వం శనివారం పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు ఉజ్వల్ పథకం కింద గ్యాస్ పొందుతోన్న వారికి రూ. 200 సబ్సిడీని కూడా ప్రకటించింది.

    అధిక ధరల నుంచి సగటు భారతీయులకు ఈ నిర్ణయాలు కాస్త ఉపశమనం కలిగించనున్నాయి.

    ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు.

    ‘‘ క్వాడ్‌లో భాగమైనప్పటికీ అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం ద్వారా దేశ ప్రజలకు ఉపశమనం కలిగించింది. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడం ద్వారా దీన్నే మా ప్రభుత్వం కూడా సాధించాలనుకుంది. మా ప్రభుత్వం, పాకిస్తాన్ సంక్షేమానికే పెద్దపీట వేసింది. కానీ దురదృష్టవశాత్తు మీర్ జాఫర్, సాదిక్ బాహరీ ఇప్పుడు బాహ్య ఒత్తిడికి తలొగ్గుతున్నారు. వారు ఆర్థికవ్యవస్థను పతనం వైపుకు తీసుకెళ్తున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

    ‘‘ఈ రోజు నేను భారత్‌ను ఆరాధిస్తున్నాను. వారెప్పుడూ స్వతంత్ర విదేశీ విధానాన్నే పాటించారు. క్వాడ్‌లో అమెరికాతో పొత్తు ఉన్నప్పటికీ వారు తటస్థంగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు కొంటున్నారు. ఎందుకంటే భారతదేశ పాలసీలు వారి ప్రజల కోసం రూపొందుతాయి’’ అని ఆయన ప్రశంసలు కురిపించారు.

    ఇమ్రాన్ ఖాన్, భారత్‌ను పొగడటం ఇదే తొలిసారి కాదు.

  10. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.