మోదీ స్పందించాల్సిన సమయం వచ్చింది: అసదుద్దీన్ ఒవైసీ
దేశంలో విభజన సృష్టించేలా చోటుచేసుకుంటున్న చర్యలను తాను సమర్థించబోనని, తమ ప్రభుత్వం ‘ప్రార్థన స్థలాల చట్టం- 1991’కి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
లైవ్ కవరేజీ
అరుణ్ శాండిల్య
ఈ రోజు ముఖ్యాంశాలు
* తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ (52 కిలోల విభాగం) సాధించారు.
* దేశంలో విభజన సృష్టించేలా చోటుచేసుకుంటున్న చర్యలను తాను సమర్థించబోనని, తమ ప్రభుత్వం ‘ప్రార్థన స్థలాల చట్టం- 1991’కి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
* కాంగ్రెస్‌లో ఉండడం వల్ల తన పొలిటికల్ కెరీర్‌లో మూడేళ్లు వృథా అయిందని ఆ పార్టీకి రాజీనామా చేసిన గుజరాత్ నేత హార్దిక్ పటేల్ అన్నారు.
* పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పనుల తవ్వకాల్లో ఒక శివలింగం బయటపడింది.
* పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది.
* జ్ఞాన్‌వాపి వివాదానికి సంబంధించిన కేసుల విచారణను శుక్రవారం వరకూ నిలిపేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణను కూడా శుక్రవారం వరకు చేపట్టకూడదని భారత ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
పోలవరం డయాఫ్రమ్ వాల్ ఎందుకిలా అయింది?
నిఖత్ జరీన్: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిజామాబాద్ బాక్సర్

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ (52 కిలోల విభాగం) సాధించారు.
టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన పోటీలో థాయిలాండ్‌కు చెందిన బాక్సర్ జె.జిట్‌పాంగ్‌పై ఆమె విజయం సాధించారు.
సెమీ ఫైనల్‌లో 5-0 తేడాతో బ్రెజిల్ బాక్సర్ కరోలినా డి అల్మైడాపై గెలిచిన జరీన్ ఫైనల్‌లోనూ అదే జోరు చూపించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు.
సిజేరియన్ ప్రసవాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ ఎందుకు అయింది
‘ప్రార్థన స్థలాల చట్టం- 1991’కి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని చెప్పాలి: అసదుద్దీన్ ఒవైసీ
దేశంలో విభజన సృష్టించేలా చోటుచేసుకుంటున్న చర్యలను తాను సమర్థించబోనని, తమ ప్రభుత్వం ‘ప్రార్థన స్థలాల చట్టం- 1991’కి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ఇలాంటి అన్నిటికీ ఇక స్వస్తి పలకాలి అని ఒవైసీ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
షాహీ ఈద్గా మసీదును తొలగించాలని మథుర కోర్టులో పిటిషన్ దాఖలైందని, ఇది కూడా ‘ప్రార్థన స్థలాల చట్టం- 1991’కి విరుద్ధమని ఆయన అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కర్ణాటక స్కూల్ పుస్తకాల్లో హెడ్గేవార్ ప్రసంగాలను ఎందుకు ప్రవేశపెడుతున్నారు
కాంగ్రెస్ వల్ల నా రాజకీయ జీవితంలో మూడేళ్ల కాలం వృథా అయింది: హార్దిక్ పటేల్
కాంగ్రెస్‌లో ఉండడం వల్ల తన పొలిటికల్ కెరీర్‌లో మూడేళ్లు వృథా అయిందని ఆ పార్టీకి రాజీనామా చేసిన గుజరాత్ నేత హార్దిక్ పటేల్ అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల నా రాజకీయ జీవితంలో మూడేళ్ల కాలాన్ని వృథా చేసుకున్నాను. కాంగ్రెస్‌లో కనుక లేకపోయి ఉంటే గుజరాత్ కోసం మరింతగా పనిచేసి ఉండేవాడిని’ అన్నారాయన.
గుజరాత్ కోసం పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ తనకెలాంటి అవకాశం ఇవ్వలేదని చెప్పారు హార్దిక్.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘లక్ష రూపాయల’ కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన రతన్ టాటా, వైరల్‌గా మారిన వీడియో
కరోనా వైరస్: మీరు ఇంతవరకూ వినని నాలుగు కోవిడ్ లక్షణాలు
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే పనుల్లో బయటపడిన శివలింగం

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పనుల తవ్వకాల్లో ఒక శివలింగం బయటపడింది.
పోలవరం స్పిల్‌వే ఎగువన గోదావరి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేసేందుకు తవ్వకం పనులు జరుగుతున్నాయి.
ఈ పనుల్లో బుధవారం సాయంత్రం శివలింగం బయటపడిందన్న సమాచారంతో స్థానికులు ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు.
బుల్డోజర్‌తో తవ్వేటప్పుడు ఆ శివలింగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు స్థానికంగా కొన్ని గ్రామాల్లో జనవాసాలు ఉండేవి.
పునరావాసంలో భాగంగా నాలుగు గ్రామాలను ఇప్పటికే తరలించారు. తాజాగా బయటపడినది ఆయా గ్రామాల్లో ఉన్న ఆలయాలకు సంబంధించిన శివలింగమా? లేక ప్రాచీన శివలింగమా? అన్నది నిర్థరణ కాలేదు.
ప్రస్తుతం ఆ శివలింగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉంచినట్టు కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
కాగా శివలింగం దొరికిందని సమాచారం తమకు అందిందని, పూర్తి వివరాలు పరిశీలించి చెబుతామని జంగారెడ్డిగూడెం ఆర్డీవో అన్నారు.
బ్రేకింగ్ న్యూస్, సిద్ధూకు ఏడాది జైలు శిక్ష, 1988 నాటి కేసులో సుప్రీంకోర్టు తీర్పు

ఫొటో సోర్స్, Getty Images
30 ఏళ్ల కిందటి కేసులో పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది.
1988 డిసెంబరు 27న పాటియాలాలో సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపీందర్ సింగ్‌లు కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడ్డారు. ఆ సమయంలో సిద్ధూ, ఆయన స్నేహితుడు కలిసి గుర్నామ్ సింగ్‌ను కారు నుంచి బయటకు లాగి కొట్టారన్నది ఆరోపణ. అనంతరం గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
సుదీర్ఘ కాలం కొనసాగిన ఈ కేసులో 2018 మే నెలలో పంజాబ్, హరియాణా హైకోర్టు సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ జైలు శిక్షను రద్దు చేసి రూ. వెయ్యి జరిమానా విధించారు.
అయితే, ఆ తీర్పును సమీక్షించాలంటూ గుర్నామ్ సింగ్ కుటుంబీకులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
దీంతో 2018 నాటి తన తీర్పును సమీక్షించిన సుప్రీంకోర్టు గురువారం సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం పంజాబ్ పోలీసులు సిద్ధూను అదుపులోకి తీసుకోనున్నారు.
శ్రీలంక సంక్షోభం: 'నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి బతికిపోయాను... లేదంటే జైలే'
జ్ఞాన్‌వాపి కేసుల విచారణను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశం

ఫొటో సోర్స్, ANI
జ్ఞాన్‌వాపి వివాదానికి సంబంధించిన కేసుల విచారణను శుక్రవారం వరకూ నిలిపేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణను కూడా శుక్రవారం వరకు చేపట్టకూడదని భారత ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ కేసులను సుప్రీం కోర్టు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తుంది.
దీనికి సంబంధించిన కేసులో వారణాసి న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని సుప్రీం కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది.
జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో సర్వే జరపడాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన దావాపై సుప్రీం కోర్టు మే 17 మంగళవారం నాడు విచారణ ప్రారంభించింది.
మసీదులో నమాజు చేయడాన్ని ఆపాల్సిన పన లేదని చెప్పిన సుప్రీం కోర్టు, శివలింగం లభించినట్లుగా చెబుతున్న అక్కడి పరిసరాలను గట్టి బందోబస్తుతో సురక్షితంగా ఉంచాలని వారణాసి పాలక యంత్రాంగాన్ని ఆదేశించింది.
కాశీ, మధుర, అయోధ్యల గురించి కంగన ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో.. మసీదు ఆవరణలో సర్వే కార్యక్రమం ముగిసింది. ఈ వివాదం అంతటి మీదా కేసులు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరుతున్నాయి.
జ్ఞాన్‌వాపి మసీదు వివాదానికి సంబంధించి అనేక ప్రకటనలు వస్తున్నాయి.
తాజాగా బాలీవుడ్ నటి కంగన రనౌత్ బుధవారం సాయంత్రం వారణాసి వెళ్లారు. ఆమె కొత్త సినిమా ‘ధాకడ్’ ప్రధాన తారాగణంతో కలిసి కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ.. ‘‘మధురలో అణువణువునా కృష్ణుడు ఉన్నాడు. అయోధ్యలోని ప్రతి అణువులోనూ రాముడు ఉన్నాడు. అలాగే కాశీలో కూడా అణువు అణువులోనూ శివుడు ఉన్నాడు. అతడికి ఏ నిర్మాణమూ అవసరం లేదు. ప్రతి అణువులోనూ ఆయన నివసిస్తుంటాడు’’ అని పేర్కొన్నారు.
ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా ఈ రోజు విచారించనుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రూ. 1,000 దాటి పరుగు తీస్తున్న గ్యాస్ సిలిండర్ ధర

ఫొటో సోర్స్, Getty Images
గృహావసరాలకు ఉపయోగించే వంటగ్యాస్ సిలిండర్ ధర గత రెండు వారాల్లో రెండోసారి పెరిగింది. మే నెల 7నసిలిండర్ ధర 50 రూపాయలు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు 3.50 రూపాయలు పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ ధర మే 19 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపాయి.
ఈ పెంపుతో దేశంలోని చాలా నగరాల్లో 14.2 కిలోల ఇంటి వంట గ్యాస్ ధర రూ. 1,000 దాటింది. దేశ రాజధాని దిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర నేటితో రూ. 1,003కు చేరింది. హైదరాబాద్‌లో ఏప్రిల్ నెలలో 1,000 రూపాయల మార్క్ దాటిన వంట గ్యాస్ ధర ఈ తాజా పెరుగుదలతో రూ. 1,055కు చేరుకుంది.
ఏడాది కాలంలోనే సిలిండర్ ధర రూ. 809 నుంచి వేయి రూపాయలకు పైగా పెరిగింది. అంటే, ఒక్క ఏడాదిలో గ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలకు పైగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలోనే గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 50 రూపాయలు పెరిగింది. మళ్లీ మే నెలలో మరోసారి మరో 50 రూపాయలు పెరిగింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలను బట్టి దేశీయ చమురు కంపెనీలు గ్యాస్ ధరలుపెంచుతూ వస్తున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బాబ్రీ తరువాత జ్ఞాన్‌వాపి మసీదు మరో మత రాజకీయ వివాదానికి కేంద్రంగా మారుతుందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిలో హిందువులు, ముస్లింలు పక్కపక్కనే ఉన్న గుడి, మసీదులలో ప్రార్థనలు చేస్తుంటారు. అయితే, దాని ముందే భారీ ఎత్తున మోహరించిన భద్రతా బలగాలు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక అపశ్రుతిలాగా కనిపిస్తాయి.
జ్ఞాన్‌వాపి మసీదు 16వ శతాబ్దంలో హిందూ పుణ్యక్షేత్రమైన విశ్వనాథ ఆలయ శిథిలాలపై నిర్మించారు. ఆరవ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669లో ఈ ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. ఇప్పుడీ ప్రాంతం రెండు వర్గాల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది.
రష్యా-యుక్రెయిన్ యుద్దంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తలెత్తే ప్రమాదం

ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్ధం మూలంగా రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ అన్నారు. పెరుగుతున్న ధరల మూలంగా పే దేశాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండవచ్చని ఆయన హెచ్చరించారు.
యుక్రెయిన్ ఎగుమతులు కనుక యుద్ధ పూర్వ స్థితికి చేరుకోకపోతే ప్రపంచం క్షామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆయన అన్నారు.
యుద్ధానికి ముందు యుక్రెయిన్ నౌకాశ్రయాల నుంచి సన్ ఫ్లవర్ నూనె భారీయెత్తును ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండేది. అలాగే, సజ్జలు,గోదుమలు వంటి ధాన్యాలను కూడా యుక్రెయిన్ నుంచి అధిక మొత్తంలో ఎగుమతి అయ్యేవి. యుద్ధం వల్ల ఈ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి.
దీనివల్ల ప్రపంచంలో చాలా దేశాలకు ఆహార సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నించడం వల్ల ధరలు పెరిగిపోయాయి. గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు 30 శాతం వరకూ పెరిగాయి.
“యుద్ధం వల్ల కోట్లాది ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. పోషకాహార లోపం సమస్య తలెత్తుంది” అని గుటెరస్ అన్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలకు సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నివేదిస్తుంది బీబీసీ లైవ్ పేజి.
