కేసీఆర్‌ను కలిసిన తమిళ హీరో విజయ్

తమిళ సినీ హీరో విజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. రాజీవ్ గాంధీ చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఒక యువతి గంధపు మాల తీసుకుని ఆయన పాదాలను తాకేందుకు వంగగానే..

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  3. నేటి ముఖ్యాంశాలు

    • అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఐదు లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
    • తమిళ హీరో విజయ్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
    • దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజల్ రాజీనామా చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
    • భారత ఆర్థిక పరిస్థితి శ్రీలంకను తలపిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
    • టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ఖరారుచేసింది. దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పేర్లను పార్టీ ప్రకటించింది.
    • గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ ఉప్పు ఫ్యాక్టరీ గోడ కుప్పకూలడంతో 12 మంది మరణించారు.
  4. భారత్‌లో కాలుష్యం వల్ల 2019లో 23 లక్షల మంది మృతి

    వాయు కాలుష్యం

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    కాలుష్యం వల్ల 2019లో భారత్‌లో 23 లక్షల మంది అకాల మరణం చెందినట్లు లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడించింది.

    మొత్తం మరణాల్లో 16 లక్షలు ఒక్క వాయు కాలుష్యం వల్లే సంభవించినట్లు లాన్సెట్ పేర్కొంది. మరో 5 లక్షల మరణాలు జల కాలుష్యం వల్ల సంభవించినట్లు వివరించింది.

    మరోవైపు ప్రపంచంలో ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం వల్లే సంభవిస్తున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

    90 శాతానికిపైగా కాలుష్యకారక మరణాలు అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోనే సంభవిస్తున్నట్లు దీనిలో వెల్లడించారు. వీటిలో 23.6 లక్షల మరణాలతో భారత్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. భారత్ తర్వాత స్థానంలో చైనా (21 లక్షలు) ఉంది.

  5. ఆకాశం నుంచి పడిన భారీ గోళాలు, 12 గ్రామాల్లో భయంభయం

  6. అస్సాం వరదల్లో కొట్టుకుపోయిన రైలు, ఏనుగు

  7. అస్సాంలో వరదల బీభత్సం.. 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

    వరదలు

    ఫొటో సోర్స్, ani

    దేశంలో ఒకవైపు హీట్‌వేవ్ విజృంభిస్తుంటే.. మరోవైపు అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

    అస్సాంలో వరదల వల్ల నాలుగు లక్షల మందికిపైగా ప్రజలపై ప్రభావం పడుతోంది. 26 జిల్లాల్లోని వెయ్యికిపైగా గ్రామాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది.

    వరదల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో రోడ్డు, రైలు మార్గాలకు అంతరాయం ఏర్పడుతోంది.

    మే 24 వరకు గువాహాటి నుంచి సిల్‌చర్‌, అగర్తలాలకు వెళ్లే రైళ్లను రైల్వే రద్దుచేసింది.

    అస్సాం

    ఫొటో సోర్స్, ANI

    కొండ చరియలు విరిగిపడటం, వరదలతో గువాహాటి-సిల్‌చర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. హాఫ్‌లోగ్ రైల్వే స్టేషన్‌లో పక్కకు ఒరిగిపోయింది.

    మరోవైపు డిటోకచేరా రైల్వే స్టేషన్‌లో మరో ప్రయాణికుల రైలు కూడా ఇలానే మధ్యలోనే నిలిచిపోయింది.

    వైమానిక దళం సాయంతో 2400 మంది ప్రయాణికులను కాపాడినట్లు ఎన్‌ఎఫ్ రైల్వే సీపీఆర్‌వో సవ్యసాచి డే తెలిపారు.

    వరదల వల్ల 5 లక్షల మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి పీయూష్ హజారికా రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

  8. సోనీ సోరీ: రాజద్రోహం కేసులో నిర్దోషి, ‘కానీ ఆ చట్టం ఆమె జీవితంలో 11 ఏళ్లను మింగేసింది’

  9. కేసీఆర్‌ను కలిసిన తమిళ హీరో విజయ్

    విజయ్, కేసీఆర్

    ఫొటో సోర్స్, TRS

    తమిళ సినీ హీరో విజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

    విజయ్ బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

    ఈ సందర్భంగా విజయ్‌ను కేసీఆర్ శాలువా కప్పి సత్కరించారు.

  10. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా

    దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా చేసినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

    ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు.

    2016 డిసెంబరులో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన బైజల్ గత అయిదున్నరేళ్లుగా ఈ పదవిలో ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. శ్రీలంకను తలపిస్తున్న భారత ఆర్థిక స్థితి: రాహుల్ గాంధీ

    భారత్ ప్రస్తుత ఆర్థిక స్థితి శ్రీలంకను తలపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

    తన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన ఇండియా, శ్రీలంకలను పోల్చుతూ ట్విటర్‌లో కొన్ని గ్రాఫ్‌లను షేర్ చేశారు.

    ప్రజలను తప్పుదోవ పట్టించినంత మాత్రాన వాస్తవాలేమీ మారిపోవు అని ఆయన అన్నారు.

    నిరుద్యోగం, పెట్రో ధరలు, మత హింస విషయంలో ఇండియా, శ్రీలంకలను పోల్చుతూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. అంగారకుడిపై కనిపిస్తున్న ఈ ‘తలుపు’ వెనుక రహస్యమేంటి

  13. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్, దీవకొండ దామోదర్ రావు, హెటెరో పార్థసారథి రెడ్డి, గాయత్రి రవిల పేర్లు ఖరారు

    దీవకొండ దామోదర్ రావు, హెటెరో పార్థసారథి రెడ్డి, గాయత్రి రవి

    ఫొటో సోర్స్, TRS

    ఫొటో క్యాప్షన్, దీవకొండ దామోదర్ రావు, హెటెరో పార్థసారథి రెడ్డి, గాయత్రి రవి

    టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ ఖరారు చేశారు.

    దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పేర్లను ప్రకటించారు.

    వీరిలో దామోదర్ రావు న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ కాగా, డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి హెటెరో ఫార్మా సీఎండీ, వద్దిరాజు ర‌విచంద్ర‌ (గాయ‌త్రి ర‌వి) గ్రానైట్ వ్యాపారంలో ఉన్నారు.

    వీరిలో వద్దిరాజు రవిచంద్ర 2018 అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచికాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన 2019లో టీఆర్ఎస్‌లో చేరారు.

  14. జెర్సీ: తెలుగులో నాని నటిస్తే హిట్ అయింది, హిందీలో షాహిద్ కపూర్‌తో తీస్తే ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదు

  15. గుజరాత్: ఫ్యాక్టరీ గోడ కుప్పకూలి 12 మంది దుర్మరణం, శిథిలాల కింద మరికొందరు ఉన్నారని అనుమానం

    గుజరాత్

    ఫొటో సోర్స్, ANI

    గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ ఉప్పు ఫ్యాక్టరీ గోడ కుప్పకూలడంతో 12 మంది మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనపై సంతాపం ప్రకటించారు.

    మోర్బి జిల్లా హల్‌వద్ పట్టణంలోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జీఐడీసీ) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పీటీఐ వెల్లడించింది. ఈ ప్రాంతం రాజ్‌కోట్‌కు సమీపంలో ఉంటుంది.

    మృతులు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ పగటి ఉష్ణోగ్రత ఈ వీకెండ్‌లో ఉండొచ్చు - వాతావరణ విభాగం హెచ్చరిక

  17. రష్యా సైనికుడిపై తొలి యుద్ధ నేరాల విచారణ

    ట్యాంక్ కమాండర్ 21 ఏళ్ల వాదిమ్ షిషిమరిన్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ట్యాంక్ కమాండర్ 21 ఏళ్ల వాదిమ్ షిషిమరిన్

    రష్యా సైనికుడిపై ఈరోజు (బుధవారం) మొదటి యుద్ధ నేరాల విచారణ ప్రారంభం కానుంది. యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత యుద్ధ నేరాలకు సంబంధించి జరుగనున్న తొలి విచారణ ఇదే.

    నిరాయుధుడైన పౌరుడిని చంపారని 21 ఏళ్ల రష్యా సైనికుడు వాదిమ్ షిషిమరిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈ కేసులో దోషిగా తేలితే ఆయన జీవితఖైదు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    రష్యా చేసిన వేలాది యుద్ధ నేరాలను గుర్తించినట్లు యుక్రెయిన్ చెబుతోంది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలను రష్యా పదే పదే ఖండిస్తోంది.

    సుమీ రీజియన్‌లో 62 ఏళ్ల సైక్లిస్టును ఎన్‌కౌంటర్ చేసిన సమయంలో షిషిమరిన్ దొంగిలించిన వాహనాన్ని నడుపుతున్నారని, ఆయనతో పాటు ఇతర సైనికులు కూడా ఉన్నారని ప్రాసిక్యూటర్లు అంటున్నారు.

    ‘‘యుక్రెయిన్‌లో నేరాలకు పాల్పడిన లేదా అందుకు సహాయపడిన ఏ ఒక్కరినీ వదలబోమని ఈ తొలి విచారణ ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపిస్తున్నాం’’ అని ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనెడిక్టోవా చెప్పారు.

  18. ‘వృక్ష మాత’ తిమ్మక్కను సన్మానించిన కేసీఆర్

    వృక్ష మాతగా ప్రసిద్ధి చెందిన సాలుమరద తిమ్మక్కను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    కర్ణాటకకు చెందిన తిమ్మక్క వయస్సు 111 సంవత్సరాలు.

    తన జీవితంలో ఎన్నో మొక్కలను పెంచి పోషించిన ఆమె సేవలను కొనియాడుతూ కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో ఆమెను సన్మానించారు. ఈ మేరకు ఫొటోలను ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది

  20. జ్ఞాన్‌వాపి మసీదు: 2 రోజుల గడువు కోరిన మసీదు ప్రతినిధులు

    జ్ఞాన్‌వాపి కేసు

    ఫొటో సోర్స్, Getty Images

    జ్ఞాన్‌వాపి కేసుకు సంబంధించిన తమ అభ్యంతరాలను తెలిపేందుకు రెండు రోజుల సమయం కావాలని ముస్లింల పక్షం కోరింది.

    ఈ కేసులో ముస్లింల తరపున వాదిస్తోన్న న్యాయవాది అభయ్ యాదవ్ వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నారని అంజుమన్ ఇంతెజామియా మసీదు ప్రతినిధి తెలిపారు.

    మరోవైపు వారణాసి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఈరోజు సమ్మె పాటిస్తున్నారు.