శ్రీలంక సంక్షోభం: పెట్రోల్ నిల్వలు ఒక రోజుకే సరిపోతాయి – కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘె

ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సెంట్రల్ బ్యాంకు కొత్తగా కరెన్సీని ముద్రిస్తుందని శ్రీలంక కొత్త ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె వివరించారు. ప్రభుత్వ విమానయాన సంస్థను కూడా ప్రైవేటు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. ప్రధానిగా మోదీకి ఉన్న పేరు 'హిందూ విరోధి' - సుబ్రణియన్ స్వామి

    సుబ్రణియన్ స్వామి, నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సుబ్రణియన్ స్వామి, నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)

    బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రణియన్ స్వామి ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆయన హిందూ వ్యతిరేకి అని అన్నారు.

    "ప్రధానిగా మోదీ ట్రాక్ రికార్డు 'హిందూ విరోధి'. ఆయన బీజేపీ మ్యానిఫెస్టోను అమలు చేయడం లేదు. రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పులో జాప్యం, రామసేతుకు ప్రాచీన వారసత్వ సంపద హోదా ఇవ్వకపోవడం, ఉత్తరాఖండ్‌లోని పురాతన దేవాలయాలను స్వాధీనం చేసుకోవడం, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని రద్దు చేయకపోవడం... ఇవన్నీ మోదీ హిందూ-వ్యతిరేక విధానాలకు ఉదాహరణలు" అంటూ ట్వీట్ చేశారు.

    సుబ్రణియన్ స్వామి తరచూ బీజేపీని, ప్రధానిని విమర్శిస్తూ ఉంటారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించి, ముస్లింలు దేశ చట్టాన్ని గౌరవించాలని కూడా స్వామి అన్నారు.

    "ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ముస్లిం లీగ్ డిమాండ్ చేయడం వల్లే విభజన జరిగింది. తరువాత, భారత్‌లో ఉండిపోయిన ముస్లింలు భారత రాజ్యాంగానికి లోబడి ఉండేందుకు అంగీకరించారు. కాబట్టి జ్ఞాన్‌వాపి మసీదును హిందువులకు తిరిగి ఇచ్చేయాలని కోర్టు చెబితే, ముస్లింలు దాన్ని గౌరవించాలి" అంటూ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  2. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.