జ్ఞాన్‌వాపి మసీదు: ‘‘మీరు కన్నేసిన మసీదుల జాబితా ఒకేసారి ఇచ్చేయండి’’ – మెహబూబా ముఫ్తీ
‘‘ఇప్పుడు జ్ఞాన్‌వాపి మసీదు వెంట పడుతున్నారు. దీని తర్వాతైనా ఊరుకుంటారా? ఈ రోజు ఈ మసీదు, రేపు ఆ మసీదు, ఎళ్లుండి ఇంకో మసీదు.. ఇలా వెళ్లండి. మీరు కన్నేసిన మసీదుల జాబితా మొత్తం ఒకేసారి మాకు ఇచ్చేయండి’’అని ఆమె వ్యాఖ్యానించారు.
లైవ్ కవరేజీ
ఆలమూరు సౌమ్య
బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ లుంబినీ పర్యటన
ఫొటో సోర్స్, ANI
బుద్ధ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నేపాల్‌లో ఉన్న గౌతమ బుద్ధుని జన్మస్థలం లుంబినీ సందర్శించనున్నారు.
అలాగే, ఇరు దేశాల మధ్య సంబంధాలను, సహకారాన్ని పెంపొందించేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో చర్చలు జరపనున్నారు.
దేవుబా ఆహ్వానం మేరకే మోదీ నేపాల్‌లో పర్యటిస్తున్నారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ మాయాదేవి ఆలయాన్ని సందర్శించనున్నారు. దీంతో పాటు బుద్ధ జయంతి సందర్భంగా లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఆయన ప్రసంగించనున్నారు.
దక్షిణ నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతంలో ఉన్న లుంబినీని బుద్ధుడు జన్మించిన ప్రదేశంగా, బౌద్ధుల పవిత్ర స్థలంగా పరిగణిస్తారు.
యుక్రెయిన్‌పై రష్యా రసాయనిక దాడులు చేస్తోందా? BBC FactCheck
ఫొటో సోర్స్, TELEGRAM
ప్రత్యర్ధులు దాడులు చేయకపోయినా చేశారని వాదించే పాత వ్యూహాన్ని రష్యా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా యుక్రెయిన్ సైన్యాలు వారి దేశంలోని ఎరువులను నిల్వ చేసే ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయని రష్యా ఆరోపించింది.
''తమపై రష్యన్లు రసాయన దాడులు చేస్తున్నాయని ఆరోపించడమే ఈ దాడుల ఉద్దేశం'' అని రష్యన్ రక్షణ శాఖ పేర్కొంది.
ఇది రష్యా వైమానిక దాడి అనుకునేలా చేయడానికి, ఈ దాడిలో మరణించిన వారంటూ కొన్ని శవాలను అక్కడికి చేర్చే ప్రయత్నం చేసిందని, ఇలాంటి ప్రయత్నాల్లో ఇది రెండోదని రష్యా ఆరోపించింది.
బఫెలో షూటింగ్: 'కావాలనే నల్లజాతీయులను టార్గెట్ చేశాడు'
ఫొటో సోర్స్, Reuters
న్యుయార్క్‌లోని షాపింగ్ మాల్‌లో దుండగుడు ఉద్దేశపూర్వకంగా నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడని నగర మేయర్ తెలిపారు.
బఫెలో సూపర్ మార్కెట్‌లో 10 మందిని కాల్చి చంపినట్లు అనుమానిస్తున్న వ్యక్తి కావాలనే నల్లజాతి జనాభా ఎక్కువగా ఉన్న చోటును ఎంచుకున్నాడని అధికారులు తెలిపారు.
అనుమానితుడు 18 ఏళ్ల పేటన్ జెండ్రాన్ ఈ దాడి చేయడానికి 320 కి.మీ కంటే ఎక్కువ దూరం డ్రైవ్ చేసుకుని వచ్చినట్టు చెప్పారు.
ఈ దాడిని జాతి వివక్షతో కూడిన హింసాత్మక చర్యగా పరిగణిస్తూ, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
"సాధ్యమైనంత ఎక్కువమంది నల్లజాతీయుల ప్రాణాలు హరించాలనే" ఉద్దేశంతోనే దుండగుడు అక్కడకు చేరుకున్నాడని బఫెలో నగర మేయర్ బైరాన్ బ్రౌన్ తెలిపారు.
అధికారుల కళ్లుగప్పి అనుమానితుడు ఈ దాడిని ఎలా జరిపాడని విచారిస్తున్నారు.
జెండ్రాన్ గత జూన్‌లో తన హైస్కూల్‌లో కాల్పులు జరుపుతానని బెదిరించినట్టు ఒక అధికారి అసోసియేట్ ప్రెస్‌కు తెలిపారు. ఆ తరువాత, అతడికి మానసిక ఆరోగ్య పరీక్షలు జరిపారు.
జెండ్రాన్ రాసిన 180 పేజీల పత్రం ఒకటి వెలుగులోకొచ్చింది. అందులో తాను ఫాసిస్టునని, తెల్లజాతీయుల ఆధిపత్యాన్ని విశ్వసిస్తానని రాసుకున్నాడు.
దాడికి ముందురోజు నిందితుడు ఆ ప్రాంతాన్ని సర్వే చేశాడని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
ఈలోగా, ఆన్‌లైన్‌లో అతివాద ధోరణులను ప్రేరేపించే కంటెంట్‌పై తమ కార్యాలయం దృష్టి సారిస్తుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తెలిపారు.
"ఒక తెలివితక్కువ, మందబుద్ధి గల, విద్వేషాన్ని విషంలా ఎక్కించుకున్న వ్యక్తి చేసిన చర్య ఇది" అని ఆమె అన్నారు.
కాల్పులు జరిపిన 13 మందిలో 11 మంది నల్లజాతీయులని పోలీసులు తెలిపారు. వారిలో తన కొడుకు పుట్టినరోజుకు కప్‌కేక్స్ కొనడానికి వచ్చిన వ్యక్తి ఉన్నారు. అలాగే, ఆస్పత్రిలో తన భర్తను చూసి వచ్చాక షాపింగ్‌కు వచ్చిన ఒక మహిళ ఉన్నారు.
ఫొటో సోర్స్, CBS NEWS
ఫొటో క్యాప్షన్, నిందితుడు పేటన్ జెండ్రాన్‌పై ఫస్ట్-డిగ్రీ హత్య కేసు వేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.