స్వీడన్, ఫిన్‌లాండ్‌: ‘నాటోలో చేరతాం.. సభ్యత్వానికి దరఖాస్తు చేస్తాం’

తమ దేశానికి కూడా సభ్యత్వం ఇవ్వాలని నాటోకు దరఖాస్తు చేస్తామని ఫిన్‌లాండ్‌ ప్రధాన మంత్రి సనా మారిన్, అధ్యక్షుడు సౌలి నినిస్తో ప్రకటించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్వీడన్ నాటోలో చేరేందుకు మద్దతు ఇస్తామని స్వీడన్ అధికార పార్టీ ప్రకటించింది.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. ‘భర్త చనిపోయారు. ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు ఏమైందో తెలియడం లేదు’

  2. గత 24 గంటల్లో 2487 కోవిడ్ కేసులు నమోదు

    గత 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది

    దేశవ్యాప్తంగా మొత్తం 13 మంది కోవిడ్‌తో చనిపోయారు.

    యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 17, 692కు తగ్గింది.

    రికవరి రేటు 98.74శాతంగా ఉంది.

    దేశంలో ఇప్పటి వరకు మొత్తం 5లక్షల 24వేల 214 మంది కోవిడ్‌తో చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    కోవిడ్

    ఫొటో సోర్స్, ANI

  3. అమెరికాలో కాల్పులు.. 10 మంది మృతి

    అమెరికాలో కాల్పులు

    ఫొటో సోర్స్, Reuters

    అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం ఒక సూపర్‌మార్కెట్‌లో దుండుగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఇది జాతి విద్వేషంతో పాల్పడిన నేరంగా పరిగణిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    బఫెలో నగరంలోని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కొంత ప్రతిఘటన తర్వాత 18 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరును పోలీసులు వెల్లడించలేదు.

    అనుమానితుడు శనివారం మధ్యాహ్నం సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. ఈ దాడిని ఆన్‌లైన్‌లో లైవ్-స్ట్రీమ్ చేయటానికి అతడు ఒక కెమెరాను ఉపయోగించినట్లు పోలీసులు చెప్పారు.

    న్యూయార్క్ మ్యాప్

    ఇది ‘హింసాత్మక తీవ్రవాద’ చర్య అని ఎఫ్‌బీఐ అభివర్ణించింది.

    బఫలో నగరంలో ప్రధానంగా నల్లజాతి ప్రజలు నివసించే ఈ ప్రాంతానికి చేరుకోవటానికి అనుమానితుడు కొన్ని గంటల పాటు కారు నడుపుకుని వచ్చినట్లు భావిస్తున్నారు.

    ఈ కాల్పుల్లో మొత్తం 13 మందికి తూటాలు తగిలాయని, వారిలో అత్యధికులు నల్లజాతి వారేనని బఫెలో పోలీస్ కమిషనర్ జోసెఫ్ గ్రమగిలా చెప్పారు. పది మంది చనిపోగా, మిగతా ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.

    సూపర్‌మార్కెట్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్.. అనుమానితుడి మీద కాల్పులు జరపటానికి ప్రయత్నించి, అతడి కాల్పుల్లో చనిపోయారు.

    అనుమానితుడు అత్యంత శక్తివంతమైన రైఫిల్‌ను, శరీర రక్షణ కవచాలను, హెల్మెట్‌ను ధరించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

    పోలీసులు చుట్టుముట్టాక కొంతసేపు ప్రతిఘటించిన అనుమానితుడు అనంతరం తన రైఫిల్‌ను పోలీసులకు అప్పగించాడు.

    ఈ దాడిలో చనిపోయిన వారి కోసం, వారి కుటుంబాల కోసం దేశాధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య ప్రార్థనలు చేస్తున్నారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది.

  4. సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?

  5. కారు ప్రమాదంలో మృతి చెందిన ఆండ్రూ సైమండ్స్

    ఆండ్రూ సైమండ్స్

    ఫొటో సోర్స్, Getty Images

    ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి ఓ కారు ప్రమాదంలో చనిపోయారు.

    ఆయన ప్రయాణిస్తున్న కారు క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో ప్రమాదానికి గురైంది.

    ఆయన వయసు 46 సంవత్సరాలు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా తరఫున 198 వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. 2003, 2007 సంవత్సరాల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో సైమండ్స్ సభ్యుడిగా ఉన్నారు.

    భారత్-ఆస్ట్రేలియా 2008 సిరీస్‌లో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, సైమండ్స్ మైదానంలో తలపడ్డారు. ఆ సమయంలో భారత క్రికెట్ ప్రేమికుల్లో సైమండ్స్ బాగా పాపులర్ అయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    సైమండ్స్ రైట్-హ్యాండెడ్ బాట్స్‌మన్. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్ట్ మ్యాచ్‌లలో కూడా ఆడారు.

    ఆయన ఆస్ట్రేలియా జట్టులో ఆఫ్-బ్రేక్, మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తారు. ఫీల్డ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసే సైమండ్స్‌ను రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్ వంటి దిగ్గజాలతో సమానంగా పరిగణించేవారు.

  6. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.