నేటి ముఖ్యాంశాలు
- కరోనాతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఆ దేశం కరోనా మరణాలను అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.
- కాకినాడలో గోపాల కృష్ణ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన పని చేస్తున్నారు.
- జమ్మూ కశ్మీర్‌లో ముస్లింలను మైనారిటీలుగా మార్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు.
- ట్విటర్‌ను కొనుగోలు చేసే డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
- కీయెవ్‌లోని భారత ఎంబసీ మే 17న తిరిగి తెరుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.











