నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్టు

ఫొటో సోర్స్, Facebook/Dr. Ponguru Narayana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల యజమాని పొంగూరు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు.
కొంతకాలంగా ఏపీలో పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. ఆ కేసులోనే నారాయణను అదుపులోకి తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారం.
ఆయనను చిత్తూరుకు తరలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.




