శ్రీలంక: నిరసనల నడుమ అధికార పార్టీ ఎంపీ ఆత్మహత్య

శ్రీలంకలో సోమవారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. అమరకీర్తి వాహనంపైనా నిరసనకారులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అమరకీర్తి వాహనం లోపలే ఉన్నారు.

లైవ్ కవరేజీ

  1. చార్‌ధామ్ యాత్రలో తెలుగు భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

    హిమాలయ చార్ ధామ్ యాత్ర ప్రారంభమయ్యింది. మే 3 అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాల్లో యాత్రికులకు అనుమతివ్వగా మే 6న కేదార్‌నాథ్, మే 8 నుంచి బదరీనాథ్ పుణ్యక్షేత్రాలలో భక్తుల సందడి కనిపిస్తోంది.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  2. విశాఖ: డ్రగ్స్ ఇంజెక్షన్లు పట్టుకున్న పోలీసులు

    డ్రగ్స్ ఇంజెక్షన్ల బాక్సులు

    ఫొటో సోర్స్, AP Police

    ఫొటో క్యాప్షన్, డ్రగ్స్ ఇంజెక్షన్ల బాక్సులు

    విశాఖలో 4 బాక్సుల మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిలో పెంటాజోసైన్ మెడిసిన్ వాడుతున్నట్లు తెలిపారు.

    ఈ ఇంజెక్షన్లను మత్తు కోసం యువత ఎక్కువగా వాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    ఈ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.

    ఒక్కో బాక్సును రూ.1,300కు కొనుగోలు చేసి రూ.6 వేలకు అమ్ముతున్నారు.

    వైజాగ్‌లోని లీలా మహాల్, భీమిలి ప్రాంతాల్లో పెంటాజోసైన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

  3. ఈరోజు కూడా నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

    బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ

    ఫొటో సోర్స్, Getty Images

    స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 599 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్లు నష్టపోయాయి.

    నిఫ్టీ బ్యాంక్, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా వంటి రంగాల్లో అమ్మకాలు కనిపిస్తున్నాయి.

    బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ వంటి షేర్లు నష్టాల్లో కదులుతున్నాయి.

    గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలను చవి చూస్తున్నాయి.

  4. కామారెడ్డి రోడ్డు ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

    తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

    మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ, ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

    అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.

    ఆదివారం సాయంత్రం టాటా ఏస్‌ను లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. విశాఖ దిశగా పయాణిస్తున్న అసాని తుపాను

    తుపాను మ్యాప్

    ఫొటో సోర్స్, IMD

    అసాని తుపాను ఉత్తర ఆంధ్రా తీరం దిశగా పయాణిస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరానికి ఆగ్నేయంగా 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.

    ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున ఉత్తర కోస్తాలో రేపు సాయంత్రం నుంచి భారీ, తేలిక పాటి వానలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.

    గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

  6. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.