You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

‘‘దేశద్రోహ చట్టాన్ని పునరాలోచించాల్సిన అవసరం లేదు’’: సుప్రీం కోర్టు అఫిడవిట్‌లో కేంద్రం

దుర్వినియోగం అవుతున్నట్లు చెబుతోన్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ చట్టంపై పునరాలోచన తగదని కేంద్రం పేర్కొంది.

లైవ్ కవరేజీ

అరుణ్ శాండిల్య

  1. ‘నీళ్లు లేవని మా ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వడం లేదు’

  2. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీక్‌కు రెండేళ్లు.. బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

  3. 5 కిలోమీటర్ల పరుగుపందెంలో కొత్త నేషనల్ రికార్డ్ - 30 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టిన అవినాశ్ సాబ్లే

    5 కిలోమీటర్ల పరుగు పందెంలో 30 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును అథ్లెట్ అవినాశ్ సాబ్లే బద్దలుగొట్టారు.

    13:25.6 నిమిషాల సమయంలో 5 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసి ఆయన కొత్త నేషనల్ రికార్డు సాధించారు.

    ఇంతకుముందు బహుదూర్ ప్రసాద్ పేరిట ఈ రికార్డ్ ఉండేది.

    అమెరికాలోని శాన్ జువాన్‌లో జరిగిన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్‌లో అవినాశ్ భారత్ తరఫున ఈ కొత్త రికార్డు స్థాపించారు.

    అయితే, ఈ పోటీల్లో అవినాశ్ 12వ స్థానంలో నిలిచారు.

  4. నాగరాజు హత్యను ఖండిస్తున్నా, ఇస్లాం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం: అసదుద్దీన్ ఒవైసీ

    హైదరాబాద్‌లో ముస్లిం యువతి ఆశ్రీన్‌ను పెళ్లి చేసుకున్న హిందూ యువకుడు నాగరాజు హత్యను మజ్లీస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

    ‘‘మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇద్దరు ముస్లింల మధ్య వివాహం జరిగితేనే అది నిఖా అవుతుంది. షరియత్ చట్టం కింద వస్తుంది.

    హిందూ వివాహ చట్ట ప్రకారం హిందువుల మధ్య వివాహం జరిగితేనే అది లీగల్ అవుతుంది.

    ఇక్కడ ఆ అమ్మాయి తనకు నచ్చినవాడిని పెళ్లిచేసుకుంది. చట్ట ప్రకారం ఆమెకు ఆ హక్కు ఉంది.

    కానీ, ఆమె భర్తను చంపే ఎలాంటి హక్కూ ఆమె సోదరుడికి లేదు. అది చట్ట ప్రకారం నేరం.

    ఇస్లాం ప్రకారం చాలా పెద్ద నేరం.

    ఎందుకు ఆ అబ్బాయిని చంపారు? ఈ చర్యను బహిరంగంగా ఖండిస్తున్నాను.

    మీకు నచ్చలేదంటే, మీరు ముఖం తిప్పుకొని వెళ్లిపోండి. కానీ, మీరు నేరం చేశారు, తప్పు చేశారు.

    మజ్లీస్ దీన్ని ఖండిస్తుంది.

    ఒక వ్యక్తిని చంపితే, మొత్తం మానవత్వాన్నే చంపినట్టు. ఒక అమాయకుడి ప్రాణం కాపాడితే, మానవత్వాన్ని కాపాడినట్టు’’ అని అసదుద్దీన్ అన్నారు.

  5. రాహుల్ చంచల్‌గూడ పర్యటనకు అనుమతి

    ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తన తెలంగాణ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 11.45 గంటలకు సంజీవయ్య పార్కుకు వెళ్లి అక్కడ మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులర్పించనున్నారు.

    అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన చంచల్‌గూడ జైలుకు వెళ్లి అక్కడ ఎన్ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ కానున్నారు.

    తొలుత రాహుల్ గాంధీకి చంచల్‌గూడ జైలు నుంచి అనుమతులు రాలేదు, కానీ, మరోసారి జైలు సూపరింటెండెంట్‌ను అనుమతులు కోరగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను మాత్రమే ములాఖత్‌కు అనుమతించారు.

    ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీని అనుమతించాలంటూ నిరసన తెలిపిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించడంతో వారిని కలిసేందుకు రాహుల్ వెళ్తున్నారు.

    కాగా మధ్యాహ్నం 1.30కి ఆయన గాంధీ భవన్‌లో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.

    అనంతరం 2.45 తరువాత పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు కో ఆర్డినేటర్లతో సమావేశమవుతారు.

  6. లేడీ సింగం: మోసగాడని తెలియడంతో కాబోయే భర్తపై కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఎస్ఐ

  7. బస్‌లో ప్రయాణించిన ముఖ్యమంత్రి.. పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకున్న తమిళనాడు సీఎం

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఉదయం ఆ రాష్ట్ర రవాణా సంస్థ బస్సులో ప్రయాణించారు.

    మెరీనా బీచ్‌లోని కరుణానిధి, అన్నా మెమొరియల్స్‌కు వెళ్తూ ఆయన మధ్యలో కొద్ది దూరం బస్సులో ప్రయాణించారు.

    ఈ సందర్భంగా ఆయన తన ఏడాది పాలన ఎలా ఉందంటూ ప్రయాణికులను, కండక్టరును అడిగి తెలుసుకున్నారు.

    బస్సులు ఎలా ఉన్నాయనేదీ ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.

  8. వంటగ్యాస్‌పై రూ.50 పెంపు

    వంటగ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి.

    గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 50 పెంచారు.

    పెరిగిన ధర ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని చమురు కంపెనీలు వెల్లడించాయి.

    ధర పెరుగుదల అనంతరం తెలుగు రాష్ట్రాలలో సిలిండర్ ధర రూ. 1050 దాటింది.

  9. 24 గంటల్లో 3,805 కరోనావైరస్ పాజిటివ్ కేసులు

    దేశంలో గత 24 గంటల్లో 3,805 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    3,168 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

    గత 24 గంటల్లో 22 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

    ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,303కి పెరిగింది.

  10. రెండంతస్తుల భవనంలో మంటలు, ఏడుగురు మృతి

    మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లోని ఓ నివాస భవనంలో మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

    స్వర్ణభాగ్ కాలనీలోని ఒక రెండంతస్తుల భవనంలో శనివారం వేకువన ఈ ప్రమాదం జరిగిందని పోలీసులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

    ప్రమాదంలో ఏడుగురు చనిపోయారని, మరో తొమ్మిది మందిని రక్షించారని ఇండోర్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారి మిశ్రా తెలిపారు.

    ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

  11. క్యూబా: హవానాలో భారీ పేలుడు.. 22 మంది చనిపోయారు, 60 మందికి పైగా గాయపడ్డారు

    క్యూబాలోని ఒక ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 22 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు.

    ఓల్డ్ హవానాలోని సరాటోగా హోటల్‌ బయట పార్క్ చేసిన ఒక గ్యాస్ ట్యాంకర్ లీక్ అవ్వడంతో ఈ పేలుడు సంభవించినట్టు సమాచారం.

    చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఈ హోటల్ కరోనా కారణంగా మూతబడింది. మరో నాలుగు రోజుల్లో దీన్ని మళ్లీ తెరవనుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    ప్రమాదం కారణంగా భవనం పూర్తిగా దెబ్బతింది. పలు అంతస్తులు కూలిపోయాయి. హోటల్ బయటి గోడ చాలా వరకు దెబ్బతింది.

    శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    మృతుల్లో ఓ గర్భిణి, ఓ చిన్నారి కూడా ఉన్నారని క్యూబా అధ్యక్షుడు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.

    "పేలుడు జరగగానే భూకంపం వచ్చినట్టు అనిపించిందని" హోటల్‌కు కొద్ది దూరంలో నివసిస్తున్న యాజిరా డే లా కారిడాడ్ అనే మహిళ సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.

  12. నేడు హైదరాబాదులో రాహుల్ గాంధీ

    ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాదులో పర్యటించనున్నారు. 10.00 గంటలకు హొటల్ తాజ్ కృష్ణలో తెలంగాణ ఉద్యమ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

    ఆ తరువాత, సంజీవయ్య పార్కులో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు.

    మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో బందీలుగా ఉన్న ఎన్ఎస్‌యూఐ విద్యార్థులను కలవనున్నారు.

    అనంతరం, నాంపల్లి గాంధీభవన్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీటింగుకు హాజరవుతారు.

    మధ్యాహ్నం 14.45 నిమిషాలకు అసెంబ్లీ, పార్లమెంట్ మెంబర్‌షిప్ కోఆర్డినేటర్లతో సమావేశం అవుతారు.

  13. శ్రీలంకలో ఎమర్జెన్సీ..

    శ్రీలంకలో మే 6, శుక్రవారం అర్థరాత్రి 12.00 గంటల నుంచి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

    ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్ష ఈ నిర్ణయం తీసుకున్నారు.

    రాష్ట్రపతి ఇచ్చిన కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించి ఆయన ఈ చర్య తీసుకున్నారు.

  14. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

  15. హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘నడిరోడ్డుపై చంపుతుంటే 30 మందిలో ఒక్కరూ అడ్డుకోలేదు’

  16. ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’