చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రవీంద్ర జడేజా గుడ్ బై... మళ్లీ ధోనీకే పగ్గాలు

రవీంద్ర జడేజా శనివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, మహేంద్ర సింగ్ ధోనీ మరొకసారి ఈ జట్టుకు మరోసారి నాయకత్వం వహించబోతున్నాడు. ఐపీఎల్ పోటీలలో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న సమయంలో రవీంద్ర జడేజా ఈ నిర్ణయం తీసుకున్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. గంగా నదిలో పడిపోయిన అమ్మాయిలను కాపాడిన సైనికులు

  2. రష్యా అకృత్యాలకు పాల్పడ్డా కానీ పుతిన్‌తో మాట్లాడటానికి నేను సిద్ధం: జెలియెన్‌స్కీ

    వొలొదిమిర్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, EPA/SERGEY DOLZHENKO

    యుక్రెయిన్‌లో బుచా, మరియుపోల్, ఇతర ప్రాంతాల్లో రష్యా అకృత్యాలకు పాల్పడ్డప్పటికీ.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడటానికి తాను సిద్ధంగానే ఉన్నానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు.

    ఆయన పోలండ్ మీడియాతో మాట్లాడుతూ పుతిన్‌ను కలవాలని తాను భావిస్తుండటానికి కారణం.. ‘‘రష్యాలో ఒకే ఒక్క మనిషి అన్నీ నిర్ణయించటమే’’ అని పేర్కొన్నారు.

    యుక్రెయిన్‌లో రష్యా బలగాలు ఆక్రమించిన ప్రాంతాల్లో ఆ దేశం పాల్పడిన దుశ్చర్యల వల్ల చర్చలు విఫలమయ్యే ముప్పు ఎక్కువగా ఉందని కూడా జెలియన్‌స్కీ పేర్కొన్నారు.

    ‘‘బుచా, మరియుపోల్ పరిస్థితులను చూశాక ఆయనను చంపేయాలని జనం కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నపుడు దేని గురించైనా మాట్లాడటం కష్టం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    తాను మనసావాచా తన జనంతోనే ఉన్నానని.. అయితే ఏదైనా ఒక్క అవకాశం ఉన్నా తాము చర్చించాలని చెప్పారు.

  3. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఎవరు దాడి చేశారు? ఏలూరులో ఈ హత్యా రాజకీయాలు ఎందుకు

  4. కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహిస్తే.. ప్రజలకు భరోసా పెరుగుతుంది: ప్రధాని మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దీనివల్ల సామాన్య పౌరులకు దేశ న్యాయవ్యవస్థ మీద భరోసా పెరుగుతుందని చెప్పారు.

    శనివారం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో మోదీ ప్రసంగించారు.

    ‘‘న్యాయ వ్యవస్థను మెరుగుపరచటానికి మేం మా శక్తిమేరకు కృషిచేస్తున్నాం. న్యాయ సదుపాయాలను అభివృద్ధి చేయటానికి కూడా మేం పనిచేస్తున్నాం’’ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    న్యాయవ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించటం డిజిటల్ ఇండియా మిషన్‌లో ఒక కీలక భాగంగా ప్రభుత్వం పరిగణిస్తోందని చెప్పారు. ఈ-కోర్టుల ప్రాజెక్టును శరవేగంగా అమలు చేస్తున్నామన్నారు.

    అలాగే.. 2015లో తాము ఇప్పుడు అవసరం లేకుండా పోయిన 1,800 చట్టాలను గుర్తించామని మోదీ తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 1450 చట్టాలను రద్దు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయన్నారు.

    దేశంలో 4 కోట్లకు పైగా పెండింగ్ కేసులు: సీజేఐ

    అంతకుముందు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఈ సదస్సులో మాట్లాడుతూ.. ‘‘మనం విధి నిర్వహణలో లక్ష్మణ రేఖను గమనంలో ఉంచుకోవాలి. ప్రభుత్వ పాలన చట్టబద్ధంగా ఉన్నట్లయితే న్యాయవ్యవస్థ ఎన్నడూ అందులో జోక్యం చేసుకోబోదు’’ అని పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ‘‘మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు తమ విధులను నిర్వర్తిస్తే, పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేస్తే, అక్రమ కస్టడీ హంస అంతమైపోతే ప్రజలు కోర్టుల వైపు చూడాల్సిన అవసరం ఉండదు’’ అని ఆయన చెప్పారు.

    దేశంలోని విచారణ కోర్టుల్లో 4 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సీజేఐ తెలిపారు. ‘‘కానీ న్యాయాధికారుల పోస్టుల సంఖ్య 24,000 మాత్రమే. అంటే ప్రతి పది లక్షల మంది ప్రజలకు 20 మంది జడ్జిలు ఉన్నారు. పెరిగిపోతున్న కేసులను పరిష్కరించటానికి ఇది ఏమాత్రం సరిపోదు’’ అని పేర్కొన్నారు.

    పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు) అనే వాటి వెనుక సదుద్దేశాలను దుర్వినియోగం చేస్తుండటంతో.. అవి ‘పర్సనల్ ఇంటరెస్ట్ లిటిగేషన్’గా మారిపోయిందని సీజేఐ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులను నిలిపివేయటానికి, ప్రభుత్వాధికారులను భయపెట్టటానికి, రాజకీయ, కార్పొరేట్ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవటానికి ఇది పనిముట్టుగా మారిపోయిందన్నారు.

    వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
    ఫొటో క్యాప్షన్, ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు
  5. ఏపీలో వైసీపీ నాయకుడి హత్య.. పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి

    వైసీపీ ఎమ్మెల్యేపై దాడి

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్ లోని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

    శనివారం తెల్లవారుజామున గ్రామంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజి ప్రసాద్‌ని దుండగులు హత్య చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గ్రామానికి వెళ్లారు.

    ఏపీలో వైసీపీ నాయకుడి హత్య

    ఫొటో సోర్స్, UGC

    ఆ సమయంలో మృతుడి అనుచరులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలోనే కొందరు ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. చివరకు పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే వెంకట్రావు అక్కడి నుంచి బయటపడ్డారు.

    గ్రామంలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని ద్వారకా తిరుమల పోలీసులు బీబీసీకి తెలిపారు. ఎమ్మెల్యేపై దాడి యత్నం జరిగిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారని వారు తెలిపారు.

    హత్య ఘటనకు స్థానిక కారణాలే కీలకం అని ప్రాధమికం అంచనా వేసత్ఉన్నట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన వారిని నిలువరించామని అంటున్నారు.

  6. ప్రశాంత్ కిశోర్‌: 'కొత్త పార్టీ గురించి రెండు మూడు రోజుల్లో చెబుతా' - బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ

  7. తిరుమలలో ఆదిత్య ఠాక్రే

    ఫొటో సోర్స్, @AUThackeray

    మహారాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే శనివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

    ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడైన ఆదిత్య తిరుమల ఆలయాన్ని సందర్శించటానికి ముందు పద్మావతీ ఆలయాన్ని కూడా సందర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ సందర్భంగా.. నవీ ముంబైలో వెంకటేశ్వర ఆలయం కోసం భూమి కేటాయింపు లేఖను మంత్రి ఆదిత్య ఠాకరే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి అందించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  8. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3,688 కోవిడ్ కేసులు నమోదు

    కోవిడ్ కేసులు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    భారతదేశంలో గడచిన 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ) 3,688 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమాచారం చెప్తోంది.

    దీంతో దేశంలో ప్రస్తుత యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 18,684కు పెరిగింది.

    ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనావైరస్ వల్ల 50 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,23,803 కు పెరిగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా ప్రజలకు ఇప్పటివరకూ 188 కోట్ల 89 లక్షల 90 వేల 935 వ్యాక్సీన్లు వేశారు.

    మరోవైపు దేశ రాజధాని దిల్లీ నగరంలో శుక్రవారం నాడు కొత్తగా 1,607 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 5,609కి పెరిగింది.

    కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా 5.28 శాతానికి పెరిగింది.

  9. కాబూల్‌లో మసీదు వద్ద పేలుడు.. ‘50 మంది మృతి’

    కాబూల్ పేలుడు

    ఫొటో సోర్స్, EPA

    అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో శుక్రవారం ఒక మసీదు వద్ద సంభవించిన భారీ పేలుడులో 50 మంది చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    కాబూల్ పశ్చిమ ప్రాంతంలోని ఖలీఫా సాహిబ్ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం వందలాది మంది జనం ప్రార్థనల కోసం గుమిగూడినపుడు ఈ పేలుడు సంభవించింది.

    ప్రార్థనలు ముగిసిన వెంటనే జరిగిన ఈ పేలుడులో కనీసం 50 మంది చనిపోయినట్లు మసీదు ప్రధాన పెద్ద చెప్పారని బీబీసీ పర్షియన్ సర్వీస్ ప్రతినిధి జియా షహరియార్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అయితే అధికార తాలిబాన్ చెప్తున్న మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

    ఈ పేలుడులో పది మంది చనిపోయినట్లు అఫ్గానిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి బిస్ముల్లా హబీబ్ చెప్పారు.

    ఈ పేలుడు ఆత్మాహుతి దాడిలాగా కనిపిస్తోందని, ప్రార్థనలు చేస్తున్న వారి మధ్య ఉండి ఈ దాడికి పాల్పడి ఉంటారని మసీదు పెద్ద చెప్తున్నారు.

    ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ కాలంలో అఫ్గానిస్తాన్‌లో పలు పేలుళ్లు సంభవించాయి. అనేక మంది పౌరులు చనిపోయారు.

    గత వారం కుందూజ్ ప్రావిన్స్‌లో జరిగిన ఇదే తరహా దాడిలో పలువురు చిన్నారులు సహా 33 మంది చనిపోయారు.

  10. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

  11. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రవీంద్ర జడేజా గుడ్ బై... మళ్లీ ధోనీకే పగ్గాలు