నేటి ముఖ్య పరిణామాలు
- అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో శుక్రవారం ఒక మసీదు వద్ద సంభవించిన భారీ పేలుడులో 50 మంది చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
- యుక్రెయిన్‌లో బుచా, మరియుపోల్, ఇతర ప్రాంతాల్లో రష్యా అకృత్యాలకు పాల్పడ్డప్పటికీ.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడటానికి తాను సిద్ధంగానే ఉన్నానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు.
- బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ. 7.27 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
- తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్లాటెడ్ సర్వదర్శనం పునరుద్ధరించి త్వరలో భక్తులకు టైంస్లాట్ టోకెన్లు కేటాయించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
- భారత సైన్యం కొత్త చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
- రవీంద్ర జడేజా శనివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, మహేంద్ర సింగ్ ధోనీ మరొకసారి ఈ జట్టుకు మరోసారి నాయకత్వం వహించబోతున్నాడు.
ఇవాల్టికి బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ అప్డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.











