గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఉద్రిక్తత, నారా లోకేష్ వెళ్లినప్పుడు ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. హత్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని అధికార వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
లైవ్ కవరేజీ
వరికూటి రామకృష్ణ
జో బైడెన్: ‘యుక్రెయిన్‌కు రూ.2.5 లక్షల కోట్లు సాయం ఇస్తాం’
ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌కు
మరింత సాయం అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు.
సైనిక, ఆర్థిక,
మానవీయ సాయంగా 33 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.2.5 లక్షల కోట్లు అందించేందుకు
ఆయన కాంగ్రెస్ అనుమతి కోరారు. అయితే తాము రష్యాను లక్ష్యంగా చేసుకోవడం లేదని
తెలిపారు.
యుక్రెయిన్ తనను
తాను రక్షించుకునేందుకు ఈ సాయం ఎంతో అవసరమని బైడెన్ చెప్పుకొచ్చారు.
ఆంటోనియో గ్యుటేరస్: ‘యుద్ధాన్ని ఆపడంలో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విఫలమైంది’
ఫొటో సోర్స్, UN Photo/Eskinder Debebe
ఐక్యరాజ్యసమితి జనరల్
సెక్రటరీ ఆంటోనియో గ్యుటేరస్ యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే
ఆ నగరం మీద రాకెట్ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపడంలో ఐక్యరాజ్యసమితి
సెక్యూరిటీ కౌన్సిల్ విఫలమైందని ఆయన విమర్శించారు.
‘ఇది తీవ్ర
నిరాశకు గురి చేస్తోంది. పట్టలేని అసహనం, కోపం వస్తోంది. ఈ యుద్ధాన్ని ముందే నివారించడంలో
కానీ ఆపడంలో కానీ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విఫలమైందని నేను స్పష్టంగా
చెబుతున్నా.’ అని గ్యుటేరస్ అన్నారు.
ఇక యుక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక, మానవీయ సాయంగా 33 బిలియన్ డాలర్లు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌ను అనుమతి కోరారు.
‘కేటీఆర్.. ఏపీకి రండి.. అభివృద్ధి చూపిస్తా’ – కేసీఆర్‌ను కలిశాక ఏపీ మంత్రి రోజా ఆహ్వానం
మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ఇంటర్నేషనల్ డాన్స్ డే: ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి కుగ్రామంలోని సంప్రదాయ నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యింది?
ఈనాటి ముఖ్య పరిణామాలు ఇవీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో
సమావేశమయ్యారు. కేసీఆర్ గతంలో కూడా హేమంత్ సొరేన్‌ని కలిశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తన జీవితంలో చివరి సమయాన్ని ఆరోగ్య
రంగానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అస్సాంలోని దిబ్రూగడ్‌లో
టాటా ట్రస్ట్స్ ఆధ్వర్యంలోని అస్సాం క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ (ఏసీసీఎఫ్)
నిర్మించిన ఏడు క్యాన్సర్ ఆస్పత్రులను గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ
ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం
తుమ్మపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. హత్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని
పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ని
అధికార వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
21వ శతాబ్దంలో యుద్ధం మానవజాతికి వినాశకారని
ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యుటేరస్ అన్నారు. నేడు యుక్రెయిన్
రాజధాని కీయెవ్‌లో ఆయన పర్యటించారు.
పాదయాత్రలో పాతిక లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని
హామీ ఇచ్చామని ఇప్పుడు ముపై లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో
కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్
వంటి అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలు
తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు అయిపోగానే మళ్లీ
రేట్లు పెంచిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు.
పెట్రోలు, డీజిల్ మీద విధించే
పన్నుల్లో 62శాతం కేంద్రమే తీసుకుంటోందని అయినా వ్యాట్ తగ్గించాలంటూ ప్రధాని
రాష్ట్రాలను కోరుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) జవాన్లు
గ్రామల్లోకి వచ్చి ప్రజలను కొడుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఆరోపించారు. ప్రజలను చంపడంతోపాటు వారిని దేశం సరిహద్దుల అవతలకు విసిరేస్తున్నారని
అన్నారు.
గత 24 గంటల్లో 3,303 కొత్త కరోనా కేసులు నమోదు
కాగా 2,563 మంది కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 16,980
కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది.
యుక్రెయిన్ యుద్ధంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే
మాములుగా ఉండదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. మెరుపు వేగంతో
వారికి బదులిస్తామని అన్నారు.
ఇవీ ఈనాటి ముఖ్య పరిణామాలు. దీనితో నేటి బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
కేసీఆర్‌తో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ భేటీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గురువారం
సాయంత్రం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు.
ఇరువురు ముఖ్యమంత్రులూ ప్రగతి భవన్‌లో భేటీ
అయ్యారు. హేమంత్ సోరేన్ సొంత పని మీద హైద్రాబాద్ వచ్చినట్టు సమాచారం.
కేసీఆర్ గతంలో కూడా హేమంత్ సొరేన్‌ని కలిశారు. ఇప్పుడు
మరోసారి వీరిద్దరూ భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ దృష్టి సారించిందని,
దేశానికి కొత్త ఎజెండా కావాలని కేసీఆర్ బుధవారం నాడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
సందర్భంగా ప్లీనరీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద
తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
ఈ నేపథ్యంలో సోరేన్, కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా
మారింది.
ఈ బండరాళ్లు గుడి గంటల్లా గణ గణ మోగుతాయి
సిసిలీ సాగర తీరంలో బయటపడ్డ శిథిలనౌకల కంచు ముక్కులు చెప్తున్న ప్రాచీన చరిత్ర ఏమిటి?
నా జీవితంలో చివరి ఐదేళ్లూ ఆరోగ్య రంగానికి అంకితం: రతన్ టాటా
ఫొటో సోర్స్, ANI
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ
చైర్మన్ రతన్ టాటా తన జీవితంలో చివరి సమయాన్ని ఆరోగ్య రంగానికి అంకితం చేయాలని
నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
అస్సాంలోని దిబ్రూగడ్‌లో టాటా ట్రస్ట్స్
ఆధ్వర్యంలోని అస్సాం క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ (ఏసీసీఎఫ్) నిర్మించిన ఏడు క్యాన్సర్
ఆస్పత్రులను గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం
17 క్యాన్సర్ ఆస్పత్రులను నిర్మించాలన్నది ఏసీసీఎఫ్ లక్ష్యం.
ఫొటో సోర్స్, ANI
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా మాట్లాడారు. ఈ క్యాన్సర్ ఆస్పత్రులను ప్రారంభించటం రాష్ట్ర చరిత్రలో గొప్ప పరిణామమని అభివర్ణించారు.
క్యాన్సర్ చికిత్సలో అస్సాం అగ్రస్థానంలో నిలవబోతోందన్నారు.
అయితే.. ప్రసంగం ప్రారంభించటానికి ముందు రతన్ టాటా తాను హిందీలో మాట్లాడలేనని, కాబట్టి ఇంగ్లిష్‌లో మాట్లాడతానని చెప్పారు.
రోజుకు మూడు పూటలూ తినాలా? రెండు భోజనాల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి
గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం
తుమ్మపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది.
హత్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని
పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ని అధికార వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
బాధితురాలికి నివాళి అర్పించిన
లోకేష్ ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులని ఓదార్చారు. ఆ సమయంలో లోకేష్‌కి వ్యతిరేకంగా కొందరు
నినాదాలు చేశారు.
దాంతో పాటుగా లోకేష్ మీదకు రాయి
విసిరినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. లోకేష్‌కి సమీపంలోనే పెద్ద రాయి పడినట్టు ఆరోపించారు.
అయినప్పటికీ పోలీసులు వైసీపీ కార్యకర్తలను నిలువరించలేదంటూ మండిపడ్డారు.
ఈ ఘటనపై లోకేష్ స్సందించారు. రాష్ట్రంలో
ఎవరికీ చట్టాలంటే గౌరవం, భయం లేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెయ్యి రోజుల జగన్ పాలనలో
800మందికి పైగా మహిళలపై దాడులు జరిగాయన్నారు. గన్ కంటే
ముందు వస్తానన్న జగన్ ఎక్కడా? అని ప్రశ్నించారు. నాపై రాళ్లు విసిరితే పారిపోతాననుకున్నారా అంటూ నిలదీశారు. పదిమంది
వైకాపా మూకల్ని పోలీసులు కంట్రోల్ చేయలేరా అంటూ వ్యాఖ్యానించారు.
తుమ్మపూడిలోని సొంత ఇంట్లోనే బుధవారం
మధ్యాహ్నం ఓ మహిళపై అత్యాచారం జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ కేసులో దోషులను శిక్షించాలంటూ ఉదయం నుంచి
సీపీఎం కార్యకర్తలు సహా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, నష్టపరిహారంగా రూ. 15లక్షలు, ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం
హామీ ఇచ్చింది. సాయంత్రం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లిన సమయంలో
ఉద్రిక్తత తలెత్తింది. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందని పోలీసులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
క్రైమియాలో డాల్ఫిన్లను మోహరించింది: అమెరికా నౌకా సంస్థ
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అమెరికా నేవీలో కూడా ట్రైన్డ్ డాల్ఫిన్లు ఉన్నాయి. ఈ ఫొటోలోని డాల్ఫిన్‌ను శాండియాగో బేలో పాత టార్పెడోను వెదికి పట్టుకోవటానికి ఉపయోగించారు
క్రైమియాలోని సెవాస్తొపోల్ నౌకాశ్రయం ప్రవేశ మార్గం
దగ్గర శిక్షణనిచ్చిన నౌకాదళ డాల్ఫిన్లను రష్యా మోహరించిందని అమెరికా నౌకాదళ సంస్థ
(యూఎస్ఎన్ఐ) చెప్పింది.
యుక్రెయిన్ మీద రష్యా ఫిబ్రవరిలో సైనిక దండయాత్ర
మొదలు పెట్టినపుడే రెండు డాల్ఫిన్ గూళ్లను అక్కడికి తరలించినట్లు ఉపగ్రహ చిత్రాలు
చూపుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. నల్ల సముద్రంలోని ఒక నౌకాదళ స్థావరానికి భద్రతగా
ఈ డాల్ఫిన్ గూళ్లను మోహరించినట్లు చెప్పింది.
నల్లసముద్రంలో రష్యాకు
సంబంధించిన అత్యంత ముఖ్యమైన నాకాదళ స్థావరం సెవస్తొపోల్ అని భావిస్తారు. అత్యంత
విలువైన నౌకలను ఈ స్థావరంలో ఉంటాయి. అవి యుక్రెయిన్ క్షిపణుల పరిధికి దూరంగా ఉన్నప్పటికీ
సముద్రగర్భం నుంచి వాటిని దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
ఇలా జలగర్భంలో ఆపరేషన్లు చేపట్టటానికి, డైవర్
ఆపరేషన్లను తిప్పికొట్టటానికి సాయపడటం కోసం.. అమెరికా, రష్యా సైన్యాలు రెండూ
సంప్రదాయంగా సముద్ర క్షీరదాలకు శిక్షణనిస్తున్నాయి.
2019లో నార్వే సమీపంలో సముద్రంలో కనిపించిన ఒక
బెలూగా తిమింగలానికి రష్యా హార్నెస్ తొడగి ఉండటంతో.. అది రష్యా గూఢచారి అని
అభివర్ణించారు.
నౌకాదళానికి చెందిన సిబ్బంది, నౌకలు, నాకాశ్రయ
సదుపాయాలకు హాని చేయటానికి ప్రయత్నించే అనుమతిలేని
ఈతగాళ్లను, డైవర్లను పసిగట్టటానికి, పట్టుకోవటానికి భద్రతా శిబ్బందికి సాయం చేసేలా
డాల్ఫిన్లకు శిక్షణనివ్వవచ్చునని యూఎస్ నేవీ మెరైన్ మామల్ ప్రోగ్రామ్ చెప్తోంది.
అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు ప్రాణాలు తీస్తాయా? వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?
ప్రధాని నరేంద్ర మోదీ జమ్ము పర్యటనపై మాట్లాడే హక్కు పాకిస్తాన్‌కు లేదు- భారత విదేశాంగ శాఖ
జమ్ములో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్‌కు
ఎలాంటి హక్కు లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు.
చైనాలో కోవిడ్ పరిస్థితి గురించి తమకు తెలుసని, చైనా
పౌరులకు టూరిస్టు వీసాల జారీని పునరుద్దరించడానికి ఇది సరైన సమయం కాదని ఆయన
చెప్పారు.
గతంలో చైనా కూడా భారతీయులకు వీసాలు ఇవ్వడం నిలిపేసిందని
ఆయన గుర్తు చేశారు. చైనీయులకు టూరిస్టు వీసాలు ఇచ్చే విషయంపై చర్చిండానికి ఇది
సరైన సమయం కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఖర్చులు తగ్గించుకుని, డబ్బులు మదుపు చేయడానికి ఏడు మార్గాలు
మాయావతి: ‘ప్రధాని మంత్రి అవుతా కానీ రాష్ట్రపతి కాదు’
ఫొటో సోర్స్, Getty Images
ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి
అవ్వాలన్నది తన లక్ష్యం తప్ప రాష్ట్రపతి కావడం కాదని బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్‌పీ)
చీఫ్ మాయావతి అన్నారు.
‘ఉత్తర్ ప్రదేశ్‌లో బీఎస్‌పీ తన ఓట్లు
అన్నీ బీజేపీకి ఇచ్చి గెలిపించింది. మరి మాయావతిని బీజేపీ రాష్ట్రపతి చేస్తుందా?’
అంటూ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు
చేశారు.
ఉత్తర్ ప్రదేశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి
అవ్వడమో లేక మరింత ముందుకు వెళ్లి దేశానికి ప్రధాని కావడమో తనకు కావాల్సింది కానీ
రాష్ట్రపతి పదవి కాదని మాయావతి చెప్పుకొచ్చారు.
మొన్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో
బీఎస్‌పీ ఓడించేందుకు ఎస్‌పీ, బీజేపీ కలిసి పని చేశాయని ఆమె ఆరోపించారు. బీజేపీ
అధికారంలోకి రావడానికి బాధ్యత ఆ పార్టీదేనని అన్నారు.
మత ఘర్షణలు జరిగిన ఖార్గోన్ పట్టణం ఇప్పుడెలా ఉంది? ‘బుల్డోజర్ చర్య’లపై హిందూ, ముస్లింల అసంతృప్తి ఎందుకు?
ఆంటోనియో గ్యుటేరస్: ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు రష్యా సహకరించాలి’
ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యుటేరస్
21వ శతాబ్దంలో యుద్ధం అనేది అసంబద్ధమైనదని,
అది మానవజాతికి వినాశకారని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యుటేరస్ అన్నారు.
నేడు యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో పర్యటించిన
ఆయన, రష్యా బలగాలు ఆక్రమించుకున్న ప్రాంతాలను ఆయన సందర్శించారు.
బాంబు దాడుల్లో దెబ్బతిన్న నివాస
భవనాలను పరిశీలించారు.
యుద్ధంలో మరణించిన యుక్రెయిన్ పౌరుల
కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
సామూహికంగా ప్రజలను ఖననం చేసిన బుచాను
సందర్శించిన ఆయన, పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆకాంక్షించారు.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చేపట్టే
విచారణకు సహకరించాలని రష్యాకు విజ్ఞప్తి చేశారు.