శివసేనతో పెట్టుకుంటే 20 అడుగుల గొయ్యి తీసి పాతేస్తాం: సంజయ్ రౌత్
శనివారం ఉదయం ముంబయిలోని నవనీత్ కౌర్ నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శివసేన కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట నిరసన చేపట్టారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
రష్యా యుద్ధనౌక మోస్క్వాలో ఒక సైలర్ మృతి, 27 మంది గల్లంతు
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, 2021 జూన్‌లో ఇస్తాంబుల్ సమీపంలో ప్రయాణిస్తున్న రష్యా యుద్ధనౌక మోస్క్వా
రష్యా
యుద్ధనౌక మోస్క్వా గత వారం నల్లసముద్రంలో మునిగిపోయిన ఘటనలో ఒక సైలర్ చనిపోగా, మరో
27 మంది గల్లంతయ్యారని ఆర్ఐఏ వార్తా సంస్థ రష్యా రక్షణ మంత్రిత్వశాఖను ఉటంకిస్తూ
తెలిపింది.
మోస్క్వా మునిగిపోయే
ముందు ఆ నౌక నుంచి 396 మంది సిబ్బందిని రక్షించినట్లు చెప్పింది.
యుద్ధనౌక మీద
మంటలు చెలరేగటం వల్ల మందుగుండు పేలిపోయిందని, నౌకను తుపానులో తరలిస్తుండగా అది
మునిగిపోయిందని రష్యా చెప్తోంది.
అయితే.. ఆ నౌక మీద తాము క్షిపణులు పేల్చామని,
అందువల్లే అది మంటల్లో చిక్కుకుని మునిగిపోయిందని యుక్రెయిన్ అంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరి మృతి; భార్యా, పిల్లలకు గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లో
ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. ఇటీవల పలుచోట్ల ఇలాంటి
ప్రమాదాలు జరుగుతుండగా తాజాగా ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలో ప్రమాదం జరిగింది.
పోలీసులు
వెల్లడించిన సమాచారం ప్రకారం నగరంలోని సూర్యారావుపేటలో శనివారం తెల్లవారుజామున ఈ
ఘటన జరిగింది. గులాబీపేటలో నివాసముంటున్న శివకుమార్ అనే వ్యక్తి కొత్త ఎలక్ట్రిక్
బైక్ కొనుగోలు చేసిన మరునాడే ప్రమాదానికి గురికావడం విస్మయం కలిగిస్తోంది.
బైక్ బ్యాటరీకి
చార్జింగ్ పెట్టి ఉండగా పేలిపోయింది. దాంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. శివకుమార్‌తో
పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వారి
అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వెంటనే ఇంటి తలుపులను పగలగొట్టి బాధితులను రక్షించే
యత్నం చేశారు.
తీవ్రగాయాల
పాలయిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే శివకుమార్ చనిపోయారు. ఆయన భార్య
పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఘటనపై
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యుక్రెయిన్ మీద దాడి ప్రారంభం మాత్రమే: జెలియెన్‌స్కీ
ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్
దక్షిణ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది రష్యా అభిమతమని.. తద్వారా మాల్దోవాలోని
వేర్పాటువాద ప్రాంతం ట్రాన్‌నిస్ట్రియాకు తమకు దారి లభిస్తుందని రష్యా సైనిక
కమాండర్ చేసిన వ్యాఖ్యలను ప్రమాదకరమైనవని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్
జెలియెన్‌స్కీ హెచ్చరించారు.
రష్యా ఇతర
దేశాల మీద కూడా దండయాత్ర చేయాలని భావిస్తోన్నట్లు రష్యా కమాండర్ వ్యాఖ్యలు చాటుతున్నాయని..
ఆ రకంగా చూస్తే యుక్రెయిన్ మీద దాడి కేవలం ఆరంభం మాత్రమే అవుతందని జెలియెన్‌స్కీ విశ్లేషించారు.
‘‘నేను చాలాసార్లు
చెప్పిన విషయాన్ని ఇది నిర్ధారిస్తోంది. యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర కేవలం
ఆరంభం మాత్రమే. ఆ తర్వాత మిగతా దేశాలను కూడా లొంగదీసుకోవాలని వారు
కోరుకుంటున్నారు’’ అని ఆయన శుక్రవారం రాత్రి తన వీడియో ప్రసంగంలో పేర్కొన్నారు.
‘‘రష్యన్
ఫెడరేషన్ ఆకాంక్షను దెబ్బతీయటానికి ఎంతకాలం అవసరమైతే అంత కాలం మమ్మల్ని మేం రక్షించుకుంటాం.
కానీ, చావు మీద బతుకు విజయం సాధిస్తుందని నమ్మే మా లాంటి దేశాలన్నీ మాతో కలిసి
పోరాడాలి. మాకు సాయం చేయాలి. ఎందుకంటే ఈ దారిలో ముందున్నది మేం. మా తర్వాత ఉండేది ఎవరు?’’
అని వ్యాఖ్యానించారు.
‘‘తర్వాతి
స్థానంలో ఉండగల వారెవరైనా ఇప్పుడు తటస్థంగా ఉండాలని కోరుకుంటే.. అది అత్యంత
ప్రమాదకరమైన జూదం. ఎందుకంటే అప్పుడు వారు సర్వస్వం కోల్పోతారు’’ అని జెలియెన్‌స్కీ
హెచ్చరించారు.
మేజర్ జనరల్
రుస్తం మిన్నెకయేవ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాల్దోవా తమ దేశంలోని రష్యా
రాయబారికి సమన్లు జారీ చేసింది.
బీహార్‌లో ఆట మొదలైద్ది.. నితీశ్ కుమార్‌తో రహస్యంగా మాట్లాడా: తేజ్ ప్రతాప్ యాదవ్
ఫొటో సోర్స్, ANI
బీహార్‌లో
రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ ఇచ్చిన
విందుకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ హాజరవటంతో పాటు.. ఆర్‌జేడీ నేత, మాజీ మంత్రి
తేజ్ ప్రతాప్ యాదవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
‘‘ఇవి
రాజకీయాలు. అనూహ్య పరిణామాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నితీశ్
జీతో నేను రహస్యంగా మాట్లాడా’’ అని తేజ్ ప్రతాప్ యాదవ్ శుక్రవారం రాత్రి ఏఎన్ఐ
వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇఫ్తార్ పార్టీకి నితీశ్ కుమార్ హాజరవటాన్ని పెద్ద పరిణామంగా భావించాలా అని అడిగిన ప్రశ్నకు.. ‘‘ఇఫ్తార్ విందుకు నితీశ్ కుమార్ జీ వచ్చారు. గతంలో మేం ‘నో ఎంట్రీ’ బోర్డ్ పెట్టాం. ఇప్పుడు ‘నితీశ్ చాచాజీకి ఎంట్రీ’ బోర్డు పెట్టాం. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చారు గనుక ప్రభుత్వం ఏర్పాటవుతుంది’’ అని నితీశ్ బదులిచ్చారు.
‘బీహార్ మహాభారతంలో మీరు శ్రీకృష్ణుడా’ అని అడిగిన ప్రశ్నకు ‘శ్రీకృష్ణుడు ఇంకెవరవుతారు?’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, ANI
అయితే.. బీహార్
మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత రబ్రీ దేవి నివాసంలో ఇఫ్తార్ పార్టీకి హాజరవటంలో
విశేషమేమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
ఆయన శనివారం ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు
బదులిస్తూ.. ‘‘అలాంటి ఇఫ్తార్ పార్టీలకు చాలా మందిని ఆహ్వానిస్తారు. దానికి
రాజకీయాలతో సంబంధం ఏముంటుంది? మేం కూడా ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తుంటాం. దానికి అందరినీ
ఆహ్వానిస్తుంటాం’’ అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎలక్ట్రిక్ బైక్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ బ్యాటరీలు పేలకుండా ఉండాలంటే ఇలా చేయండి
దేశవ్యాప్తంగా 2,527 కొత్త కోవిడ్ కేసులు నమోదు
ఫొటో సోర్స్, Getty Images
భారతదేశ
వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 2,527 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ఏఎన్ఐ
వార్తా సంస్థ తెలిపింది.
దేశంలో
యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య పెరగటం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కేసులు 15 వేలు
దాటాయి.
కేంద్ర ఆరోగ్య
మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం.. రోజువారీ ఇన్‌ఫెక్షన్ రేటు 0.56 శాతానికి
పెరిగింది.
ప్రస్తుతం
15,079 మంది రోగులు దేశంలో చికిత్స పొందుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మహారాష్ట్ర: నవనీత్ కౌర్ నివాసం ఎదుట ఉద్రిక్తత
ఫొటో సోర్స్, ani
మహారాష్ట్రలో శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ
ఎదుట హనుమాన్ చాలీసా పఠనంపై వివాదం ముదురుతోంది. మాతోశ్రీ ఎదుట శనివారం తాను
హనుమాన్ చాలీసా పఠిస్తానని, దమ్ముంటే తనను ఆపాలని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా,
ఆమె భర్త రవి రానా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే, శనివారం ఉదయం
ముంబయిలోని నవనీత్ కౌర్ నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శివసేన
కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట నిరసన
చేపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఈ అంశంపై నవనీత్ స్పందించారు. ‘‘మాకు అవరోధాలు సృష్టించాలని శివసేన కార్యకర్తలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. అందుకే వారు బారికేడ్లు తోసుకుని వస్తున్నారు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను. కచ్చితంగా మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదువుతాను. ప్రజలను జైళ్లలోకి ఎలా పంపాలో మాత్రమే మన సీఎంకు తెలుసు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే, రానా దంపతులు వస్తే, వారికి ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని శివసేన నాయకురాలు, ముంబయి నగర మాజీ మేయర్ కిశోరి పెడ్నేకర్ వ్యాఖ్యానించారు. ఆమె మాతోశ్రీ ఎదుట ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
‘‘వారి కోసమే మేం ఎదురు చూస్తున్నాం. వారు వస్తే గుణపాఠం చెబుతాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
భారత విద్యార్థులు పాకిస్తాన్ విద్యా సంస్థల్లో చేరవద్దు: యూజీసీ, ఏఐసీటీఈ హెచ్చరిక
ఫొటో సోర్స్, WWW.UGC.AC.IN
పాకిస్తాన్‌లోని
కాలేజీల్లో కానీ, ఇతర విద్యా సంస్థల్లో కానీ చేరవద్దని భారతీయ విద్యార్థులను యూనివర్సిటీ
గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్
(ఏఐసీటీఈ) హెచ్చరించాయి.
పాక్ కాలేజీలు,
విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు భారతదేశంలో ఉద్యోగం కానీ, ఉన్నత విద్య కానీ
లభించదని చెప్పింది.
భారత
విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చైనా విద్యా సంస్థల్లో చేరవద్దంటూ నెల రోజుల కిందట
హెచ్చరించారు.
పీటీఐ వార్తా
సంస్థ కథనం ప్రకారం.. ‘‘భారతీయ విద్యార్థులందరికీ ఉన్నత విద్య కోసం పాకిస్తాన్
వెళ్లరాదని సలహా ఇస్తున్నాం. భారతజాతీయులు ఎవరైనా, భారతజాతీయత మూలాలున్న
విదేశీజాతీయులు ఎవరైనా పాకిస్తాన్‌లోని ఏ కాలేజీ లేదా విద్యా సంస్థలో
చేరాలనుకుంటే.. వారు పాకిస్తాన్ సర్టిఫికెట్ల ప్రాతిపదికన భారతదేశంలో ఉద్యోగం
కానీ, ఉన్నత విద్య కానీ పొందలేరు’’ అని యూజీసీ, ఏఐసీటీఈలు జారీచేసిన హెచ్చరిక చెప్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
అయితే.. ‘‘పాకిస్తాన్‌లో చదువుకుని వలసవచ్చిన పౌరులు, వారి పిల్లలు భారత పౌరసత్వం ఉన్నట్లయితే వారు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ పొంది భారతదేశంలో ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు’’ అని పేర్కొంది.
ఇటువంటి హెచ్చరిక జారీ చేయటానికి గల కారణాలకు సంబంధించి సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదని పీటీఐ తెలిపింది.
ఈ నిధి ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు
ఐక్యరాజ్యసమితి
సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ వచ్చే వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్
పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీలను కలువనున్నారు.
గుటెరెస్
మంగళవారం నాడు రష్యా రాజధాని మాస్కోలో పుతిన్‌తో భేటీ అవటంతో పాటు.. ఆ దేశ
విదేశాంగ మంత్రి సెర్గీ లార్వోవ్‌తో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.
ఆ తర్వాత
గురువారం నాడు యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో జెలియెన్‌స్కీతోను, ఆ దేశ విదేశాంగ
మంత్రి దిమిత్రో కులేబాతోనూ భేటీ అవుతారు గుటెరెస్.
రష్యా,
యుక్రెయిన్‌ల మధ్య సంఘర్షణ విషయంలో మధ్యవర్తిత్వం వహించటానికి మరింత క్రియాశీల
పాత్ర పోషించాలంటూ గుటెరెస్ మీద ఇటీవల ఒత్తిడి పెరగటంతో ఆయన ఈ దౌత్య రాయబార ప్రయాణం
చేస్తున్నారు.
యుక్రెయిన్‌లో
శాంతి నెలకొల్పటానికి అత్యవసర చర్యల కోసం చర్చలు జరపాలంటూ ఆయన ఇటీవల ఇరు దేశాల
నేతలకూ ఆ దేశంలోని యూఎన్ దౌత్య కార్యాలయాల ద్వారా గుటెరెస్ లేఖలు రాశారు.
రష్యా,
యుక్రెయిన్‌లు రెండూ యూఎన్ వ్యవస్థాపక సభ్య దేశాలు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.