శివసేనతో పెట్టుకుంటే 20 అడుగుల గొయ్యి తీసి పాతేస్తాం: సంజయ్ రౌత్

శనివారం ఉదయం ముంబయిలోని నవనీత్ కౌర్ నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శివసేన కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట నిరసన చేపట్టారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. ఈ రోజు ముఖ్యాంశాలు

    * అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ వీరు చెప్పడంతో రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

    * శివసేనతో పెట్టుకుంటే 20 అడుగుల లోతున పాతిపెడతామంటూ నవనీత్ కౌర్, రవి రానాలను శివసేన నేత సంజయ్ రౌత్ హెచ్చరించారు.

    * జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించారు.

    * భారత రెజ్లర్ బజరంగ్ పునియా ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 2022లో రజత పతకంతో సాధించారు.

    * ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ ఫార్మాసీటీ ఎస్ఎన్ఎఫ్ (ఇండియా) ఫార్మాలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది.

  2. శివసేనతో పెట్టుకుంటే 20 అడుగుల గొయ్యి తీసి పాతేస్తాం: సంజయ్ రౌత్

    నవనీత్, రవి రానాల వ్యవహారంపై శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    తమతో గొడవ పెట్టుకుంటే 20 అడుగుల లోతున పాతిపెడతామని హెచ్చరించారు.

    ‘‘ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం దగ్గర ఏదో చేయాలని కుట్ర చేశారు. వీరి(నవనీత్ రానా, రవి రానా) భుజాలపై తుపాకీ పెట్టి దాడి చేయాలని బీజేపీ ప్రయత్నించింది.

    నవనీత్, రవిలు మహారాష్ట్రకు శత్రువులు. వారి వెనుక మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఉన్నారు’’ అన్నారాయన.

    ‘శివసేన, 'మాతోశ్రీ'తో గొడవ పెట్టుకోవద్దు. అలా గొడవ పెట్టుకుంటే మిమ్మల్ని 20 అడుగుల లోతున పాతేస్తామని చెబుతున్నాను. కెమేరాల ముందే నేను ఈ మాట చెబుతున్నాను. శివసేన సహనాన్ని పరీక్షించొద్దు’’ అని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆకలి తీర్చలేకపోతుందా

  4. హైదరాబాద్ హలీం ఎందుకు ఇంత ఫేమస్

  5. నరేంద్ర మోదీ: జమ్ములో పర్యటిస్తున్న ప్రధాని కశ్మీర్ ఎందుకు వెళ్లడం లేదు

  6. నవనీత్ కౌర్ అరెస్ట్

    అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ వీరు చెప్పడంతో రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

    ఖర్‌లోని వారి నివాసం నుంచి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. కౌలు రైతులకు అండగా ఉంటాను: పవన్ కల్యాణ్

    కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్న పవన్ కల్యాణ్

    జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తన ‘రైతు భరోసా’ యాత్ర కొనసాగిస్తున్నారు.

    ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి రూ. లక్ష చొప్పున వారికి ఆర్థిక సహాయం అందించారు.

    తొలుత ఈ రోజు ఉదయం ఆయన దెందులూరు నియోజకవర్గం జానంపేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు నెరుసు మల్లికార్జునరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున రూ. లక్ష సహాయం చేశారు.

    చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడేనికి చెందిన దాసరి రాజారావు కుటుంబానికి, మట్టగూడెంలో మరో కౌలు రైతు కాకొల్లు బాబూరావు, సుందరరావుపేటలో యర్రా రాంబాబు, లింగంపాలేనికి చెందిన భూక్యా వెంకటేశ్వరరావు కుటుంబం సహా ఆత్మహత్యలు చేసుకున్న మరో అయిదుగురు కౌలు రైతుల కుటుంబాలనూ పరామర్శించిన సహాయం అందజేశారు.

  8. ఒకే వ్యక్తికి మూడు వయసులు - కొరియాలో పుడితే అంతే

  9. సబ్సిడీలు, ప్రైజులు అంటున్న నకిలీ వెబ్‌సైట్లను నమ్మొద్దు: ఇండియా పోస్ట్ హెచ్చరిక

    ఇండియా పోస్ట్

    ఫొటో సోర్స్, ANI

    కొన్ని సర్వేలు, క్విజ్‌ల ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు అందిస్తామంటూ సోషల్ మీడియాలో చలామణి అవుతున్న మోసపూరిత వెబ్‌సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియా పోస్ట్ హెచ్చరించింది.

    ‘‘సర్వేల ప్రాతిపదికగా సబ్సిడీలు, బోనస్‌లు, ప్రైజులు అందిస్తామంటూ చేస్తున్న ప్రకటనలు, కార్యకలాపాల్లో ఇండియా పోస్ట్ ప్రమేయం లేదదని దేశ ప్రజలకు తెలియజేస్తున్నాం. అటువంటి నోటిఫికేషన్లు, మెసేజీలు, ఈమెయిళ్లు అందుకుంటున్న వారు వాటిని నమ్మరాదని మేం కోరుతున్నాం. అటువంటి మోసపూరిత, నకిటీ సందేశాలకు స్పందించటం కానీ, వ్యక్తిగత వివరాలు ఇవ్వటం కానీ చేయరాదని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సమాచార సంబంధాల మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో చెప్పింది.

    ఇండియా పోస్ట్

    ఫొటో సోర్స్, ANI

    పుట్టిన రోజు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్ నంబర్, పుట్టిన స్థలం, ఓటీపీ వంటి వివరాలేవీ షేర్ చేయవద్దని కూడా ప్రజలను కోరింది.

    ఇలాంటి మోసపూరిత యూఆర్ఎల్స్, లింకులు, వెబ్‌సైట్లు చలామణీ కాకుండా నిరోధించటానికి తాము వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

  10. పుట్టిన బిడ్డకు గుండెలో రంధ్రం ఉంటే ఎలా గుర్తించాలి? చికిత్స ఏమిటి

  11. ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్: రజత పతకం గెలిచిన బజరంగ్ పునియా

    బజరంగ్ పునియా

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, బజరంగ్ పునియా (ఫైల్ ఫొటో)

    భారత రెజ్లర్ బజరంగ్ పునియా ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 2022లో రజత పతకంతో సరిపెట్టుకున్నారు.

    మంగోలియాలో జరుగుతున్న ఈ పోటీల్లో శనివారం 65 కిలోల విభాగంలో ఇరాన్ క్రీడాకారుడు రహమాన్ మౌసాతో పోటీ పడిన బజరంగ్.. 1-3 స్కోరుతో ఓడిపోవటంతో స్వర్ణం చేజారింది.

    ఈ చాంపియన్‌షిప్ పోటీలు మహిళల విభాగంలో.. శుక్రవారం నాడు భారత రెజ్లర్లు అన్షు మాలిక్ 57 కిలోల కేటగిరీలో, రాధిక 65 కిలోల కేటగిరీలో రజత పతకాలు గెలుచుకున్నారు. 62 కిలోల కేటగిరీలో పోటీపడిన మనీషా కాంశ్య పతకం సొంతం చేసుకున్నారు.

    ఇవే పోటీల్లో గురువారం నాడు భారత క్రీడాకారిణిలు సరితా మోర్, సుష్మా సోకీన్‌లు తమ తమ మహిళల ఫ్రీస్టైల్ కేటగిరీల్లో చెరో కాంశ్య పతకం గెలుచుకున్నారు.

  12. పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

    పరవాడ అగ్నిప్రమాదం

    ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ ఫార్మాసీటీ ఎస్ఎన్ఎఫ్ (ఇండియా) ఫార్మాలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది.

    వెల్డింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాధమిక సమాచారం.

    ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం రిపోర్ట్ కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణభయంతో సిబ్బంది ఫ్యాక్టరీ బయటకు పరుగులు తీశారు.

    అగ్నిమాపక సిబ్బంది, పరవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    పరవాడ అగ్నిప్రమాదం
  13. హనుమాన్ చాలీసా ఆందోళన విరమించుకుంటున్నాం: నవనీత్ కౌర్, రవి రానా

    నవనీత్ కౌర్ రానా, రవి రానా

    మహారాష్ట్రలో శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని, దమ్ముంటే తనను ఆపాలని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానా.. ఆ ఆందోళనను విరమించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.

    అంతకుముందు.. శనివారం ఉదయం ముంబయిలోని నవనీత్ కౌర్ నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శివసేన కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు రానా దంపతులు మాతోశ్రీ వద్దకు వస్తే వారికి ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని శివసేన నాయకురాలు, ముంబయి నగర మాజీ మేయర్ కిశోరి పెడ్నేకర్ వ్యాఖ్యానించారు.

    ‘‘వారి కోసం మేం ఎదురు చూస్తున్నాం. వారు వస్తే గుణపాఠం చెబుతాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

    ఈ పరిణామాలపై నవనీత్‌ కౌర్ స్పందిస్తూ.. ‘‘మాకు అవరోధాలు సృష్టించాలని శివసేన కార్యకర్తలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. అందుకే వారు బారికేడ్లు తోసుకుని వస్తున్నారు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను. కచ్చితంగా మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదువుతాను’’ అని ఉద్ఘాటించారు.

    కానీ మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత రానా దంపతులు.. హనుమాన్ చాలీసా ఆందోళనను విరమించుకుంటున్నట్లు చెప్పారు.

    రవి రానా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబైలో శాంతిభద్రతల పరిస్థితులను శివసేన పార్టీ కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. హనుమాన్ చాలీసాకు వాళ్లు ఎందుకంత వ్యతిరేకంగా ఉన్నారు?’’ అని ప్రశ్నించారు.

    ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ముంబై వస్తున్నారు. ఈ పర్యటనకు ఎలాంటి కష్టాలూ కలిగించకూడదని మేం కోరుకుంటున్నాం. ఈ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నాం’’ అని ఆయన చెప్పారు.

    ‘‘మేం ఎవరికీ, ఏ బెదిరింపులకూ భయడటం లేదు. మేం ప్రజలకు సేవ చేయటం ద్వారా అసెంబ్లీకి, పార్లమెంటుకు చేరుకున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘మా లక్ష్యం నెరవేరింది’

    ‘‘మా లక్ష్యం నెరవేరింది. రవి రానా, నేను ‘మాతోశ్రీ’కి చేరుకోలేకపోయినప్పటికీ.. మేం చదవాల్సిన హనుమాన్ చాలీసాను సీఎం ఇంటి వెలుపల భక్తులు చదివారు’’ అని నవనీత్ కౌర్ రానా ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

    ‘‘శివసేన గూండాల పార్టీగా తయారైంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు జనం మీద కేసులు మోపటం, జైళ్లలో పెట్టటం మాత్రమే తెలుసు. ఆయన మహారాష్ట్రలో బెంగాల్ తరహా పరిస్థితులు సృష్టిస్తున్నారు’’ అని విమర్శించారు.

    నవనీత్ కౌర్, రవి రానాలు ఆందోళనను విరమించుకున్నట్లు ప్రకటించటంతో.. వారి ఇంటివద్ద పోగైన జనం వెనక్కు తిరగటం మొదలుపెట్టారు.

  14. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోని మంచివాళ్లంతా ఆప్‌లో చేరాలి: హిమాచల్‌ సభలో కేజ్రీవాల్

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    ‘‘నయా హిమాచల్ ప్రదేశ్’కు సమయం ఆసన్నమైంది. బీజేపీ, కాంగ్రెస్‌లలోని మంచి వారందరూ ఆ పార్టీలను వదిలి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

    కేజ్రీవాల్ శనివారం హిమాచల్‌లోని కాంగ్రాలో జరిగిన ఆప్ బహిరంగ సభలో ప్రసంగించారు.

    ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ‘‘హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో వాళ్లు (బీజేపీ వాళ్లు) ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తారని నేను విన్నాను. ఈసారి ఆప్‌కు ఒక అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.

    హిమాచల్ ప్రదేశ్ ప్రజలు, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌లు దిల్లీ వచ్చి అక్కడి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఆయన ఆహ్వానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. 184 మంది వీఐపీలకు భద్రతను ఉపసంహరించిన పంజాబ్ సర్కారు

    భగవంత్‌మాన్

    ఫొటో సోర్స్, ANI

    పంజాబ్‌లో 184 మంది మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఏలు, ప్రవేటు వ్యక్తులకు గతంలో కల్పించిన పోలీసు భద్రతను ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సర్కారు ఉపసంహరించింది.

    అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సెక్యూరిటీ ఏప్రిల్ 20వ తేదీతో రాసిన లేఖలో.. ‘‘ప్రస్తుత ముప్పు అంచనాలపై భద్రతా సమీక్ష అనంతరం.. మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ప్రవైటు వ్యక్తులకు భద్రతను ఉపసంహరించాలని నిర్ణయించటం జరిగింది’’ అని పేర్కొన్నారు.

    ఇలా భద్రత ఉపసంహరించిన వారిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కుటుంబం కూడా ఉంది.

    అయితే.. సుప్రీంకోర్టు, హైకోర్టుల నిర్దిష్ట ఆదేశాలతో ఏర్పాటు చేసిన భద్రత కొనసాగుతుందని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి.

    ఇంతకుముందు.. మార్చి 12వ తేదీన 122 మంది పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులకు కూడా భద్రతను ఉపసంహరించారు.

  16. యుక్రెయిన్ యుద్ధ విమానాన్ని, మూడు హెలికాప్టర్లను కూల్చివేశాం: రష్యా

    యుక్రెయిన్ ఎంఐ-8 హెలికాప్టర్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, 2018లో సైనిక విన్యాసాల్లో పాల్గొన్న యుక్రెయిన్ ఎంఐ-8 హెలికాప్టర్

    యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్ ప్రాంతంలో యుక్రెయిన్‌కు చెందిన ఒక ఎస్‌యు-25 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని, మూడు ఎంఐ-8 హెలికాప్టర్లను ధ్వంసం చేశామని రష్యా చెప్పింది.

    యుక్రెయిన్ సైనిక స్థావరాల మీద గత రాత్రి చేసిన దాడుల్లో పలు విజయాలు సాధించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది.

    ఈ వాదనలను బీబీసీ స్వతంత్రంగా నిర్ధారించలేకపోయింది. దీనిపై యుక్రెయిన్ వైపు నుంచీ ఇంకా ప్రతిస్పందన రాలేదు.

    దీనికిముందు.. రష్యా గత 24 గంటల్లో తన సైనిక చర్యల్లో ముందుకు సాగటంలో విఫలమైందని బ్రిటన్ పేర్కొంది. భూతలాన్ని కానీ, గగనతలాన్ని కానీ రష్యా ఇంకా తన ఆధీనంలోకి తెచ్చుకోలేదని చెప్తున్నారు.

  17. ఐఎంఎఫ్ షరతులను అంగీకరించిన పాకిస్తాన్.. పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

    పెట్రోల్ బంక్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్‌ల మీద సబ్సిడీలు తగ్గించాలన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) షరతులకు పాక్ కొత్త ఆర్థికమంత్రి మిఫ్తా ఇస్మాయిల్ శుక్రవారం నాడు అంగీకరించారు.

    ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనం ప్రకారం.. వాణిజ్య పన్ను మినహాయింపు పథకాన్ని రద్దు చేయాలన్న షరతుకు కూడా పాకిస్తాన్ అంగీకరించింది.

    పాకిస్తాన్‌కు మూడేళ్ల పాటు 600 కోట్ల డాలర్ల రుణం ఇవ్వటానికి ఐఎంఎఫ్ 2019లో అంగీకరించింది. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు నెమ్మదిగా సాగుతుండటంతో ఈ రుణాన్ని అడపా దడపా విడుదల చేస్తోంది.

    ‘‘వాషింగ్టన్‌లో వార్షిక సమావేశం సందర్భంగా ఐఎంఎఫ్‌తో చర్చలు బాగా నడిచాయి. ఇంధన సబ్సిడీలను నిలిపివేయాలని వారు చెప్పారు. అందుకు నేను అంగీకరించాను’’ అని పాక్ ఆర్థికమంత్రి మిఫ్తా ఇస్మాయిల్ తెలిపారు.

    ‘‘ఇప్పుడిస్తున్న సబ్సిడీలను మేం కొనసాగించలేం. అందుకే వాటిని ఆపివేస్తున్నాం’’ అన్నారు.

    మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీ కాపాడుకోవటానికి విద్యుత్, ఇంధనాల మీద భారీ రాయితీలు ఇచ్చారని, వ్యాపార సంస్థలకు రుణ మాఫీ అవకాశం కల్పించారని మంత్రి విమర్శించారు. దీనివలన ఐఎంఎఫ్ నిధుల విడుదల ఆగిపోయిందన్నారు.

  18. యూపీలో ఒకే కుటుంబంలో ఐదుగురు దారుణ హత్య

    ప్రయాగ్‌రాజ్‌లో హత్యలు

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణంగా హత్యకు గురయ్యారు.

    ఖేర్వాజ్‌పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    మృతులను రాజ్‌కుమార్ యాదవ్ (55), రాజ్‌కుమార్ భార్య కుసుమ్ (50), రాజ్‌కుమార్ కూతురు మనీషా (25), కోడలు సవిత (30), మనుమరాలు మిటాక్షి (2) గా గుర్తించారు. వీరిని పదునైన ఆయుధాలతో నరికి చంపినట్లు పోలీసులు చెప్తున్నారు.

    ఇంట్లో నిద్రిస్తున్న రాజ్‌కుమార్ మరో మనుమరాలైన ఐదేళ్ల బాలిక సజీవంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలు జరిగినపుడు రాజ్‌కుమార్ కొడుకు సునీల్ ఇంట్లో లేరని, ఆయన పెళ్లికి హాజరవటానికి వెళ్లాడని పోలీసులు పేర్కొన్నారు.

    గంగాపార్ థర్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు జాగిలాలు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.

    ఇంతకుముందు ఏప్రిల్ 15వ తేదీన.. ఇక్కడికి సమీపంలోని ఖగల్పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణంగా హత్యకు గరవగా, ఆ కుటుంబ పెద్ద ఉరికి వేలాడుతూ చనిపోయి కనిపించాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. విమానంలో ప్రయాణికుడిపై మైక్ టైసన్ పిడిగుద్దులు

    మైక్ టైసన్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    మాజీ హెవీవెయిట్ బాక్సర్ మైక్ టైసన్.. విమానంలో తోటి ప్రాయణికుడు ఒకరు ‘తన మీద వాటర్ బాటిల్ విసరటం’తో, అతడిపై పిడిగుద్దులు కురిపించాడని టైసన్ అధికార ప్రతినిధి చెప్పారు.

    విమానంలో చిత్రీకరించిన వీడియోలో.. టైసన్ తన సీటు మీదుగా వెనక్కు వంగి గుర్తుతెలియని వ్యక్తి మీద వరుస పంచ్‌లు ఇవ్వటం కనిపిస్తోంది.

    టైసన్‌కు.. ‘తనను వేధిస్తున్న దుందుడుకు ప్రయాణికుడి’తో గొడవ జరిగిందని ఆయన ప్రతినిధి పేర్కొన్నారు.

    ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తికి శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ప్రాణాంతకం కాని గాయాలకు చికిత్స అందించారు.

    ‘‘ఘటనకు సంబంధించి ఆ వ్యక్తి పూర్తి వివరాలు చెప్పలేదు. పోలీసు దర్యాప్తుకు సహకరించటానికి నిరాకరించారు’’ అని శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఇద్దరు వ్యక్తులనూ విడుదల చేశామని, దర్యాప్తు పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ఇద్దరు వ్యక్తుల్లో ఎవరి వివరాలనూ పోలీసు విభాగం వెల్లడించలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    జెట్‌బ్లూ విమానం బుధవారం రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడాకు బయలుదేరేముందు.. విమానం లోపల ఈ సంఘటన జరిగింది.

    టీఎంజడ్ పబ్లిష్ చేసిన వీడియోలో ఈ గొడవ పూర్తిగా కనిపించటం లేదు. వీడియో దృశ్యాల్లో వాటర్ బాటిల్ కనిపించటం లేదు.

    టీఎంజడ్ కథనం ప్రకారం.. విమాన ప్రయాణం ఆరంభంలో ఆ ప్రయాణికుడితో ఫొటో దిగటానికి టైసన్ అంగీకరించారు. టైసన్ ‘చిల్’ అని చెప్పినా కానీ ఆ వ్యక్తి టైసన్‌ను వేధిస్తూనే ఉన్నారు.

    విమానంలో ఘటనకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వచ్చిందని ఆ విభాగం తెలిపింది.

    టైసన్ 1992లో అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారితుడై మూడేళ్లు జైలులో గడిపారు. 1997లో ఒక బాక్సింగ్ పోటీలో తన ప్రత్యర్థి చెవి కొరికివేయటంతో టైసన్‌ను డిస్‌క్వాలిఫై చేశారు.

  20. హైదరాబాద్: ‘గుడికి వచ్చిన భక్తురాలిని రాడ్డుతో కొట్టి చంపిన పూజారి.. శవం వాసన రాకుండా అగరబత్తుల ధూపం వేశాడు’