భారత ముస్లింలు హజ్ యాత్రకు రావచ్చునన్న సౌదీ అరేబియా.. ఇండియా కోటా 79,237 మంది

హజ్ యాత్రికులు ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం, కోవిడ్ వ్యాక్సిన్లు రెండూ తీసుకోవటం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు తెలిపారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ & పృథ్వీరాజ్

  1. సాయి గణేశ్ ఆత్మహత్య: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు హై కోర్టు నోటీసులు

    తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

    ఫొటో సోర్స్, Puvvada Ajay Kumar/Facebook

    తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది.

    సాయిగణేశ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌ను నేడు తెలంగాణ హైకోర్టు విచారించింది.

    తదుపరి విచారణను ఈ నెల 29కి హై కోర్టు వాయిదా వేసింది.

    మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోత్సాహంతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధించడంతో సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నారనేది బీజేపీ ఆరోపణ.

    సాయి గణేశ్ మరణం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వివాదంగా మారింది. సాయి గణేశ్ కుటుంబాన్ని బీజేపీ నేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా పరామర్శిస్తున్నారు.

    టీఆర్‌ఎస్ నేత, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

  2. కర్నాటక: హిజాబ్‌తోనే పరీక్ష రాస్తామన్న విద్యార్థినులు, కుదరదన్న అధికారులు

    పరీక్ష హాలుకు హిజాబ్ ధరించి వచ్చిన అమ్మాయిలు

    ఫొటో సోర్స్, ANI

    కర్నాటక రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై కోర్టులో సవాలు చేసిన ఇద్దరు అమ్మాయిలు మరొకసారి వార్తల్లోకి వచ్చారు.

    ప్రీ యూనివర్సిటీ పరీక్షలు రాసేందుకు హిజాబ్ ధరించి వచ్చిన ఆలియా, రేష్మాలను అధికారులు లోపలకు అనుమతించలేదు.

    కర్నాటక హైకోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్ ధరించిన వారిని పరీక్షా హాలులోకి అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు.

    దాంతో ఆలియా, రేష్మా పరీక్ష రాయకుండానే తిరిగి వెళ్లిపోయారు.

    దీని మీద స్పందించిన కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై... తనకు పూర్తి వివరాలు తెలియవని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆ విషయాన్ని విచారిస్తారని తెలిపారు.

  3. Swiggy ఇంకా Zomato మీకు ఫుడ్ తెచ్చే డెలివరీ బాయ్స్ కష్టాలు మీ ఊహకీ అందవు

    ఎండైనా, వానైనా, రాత్రైనా, పగలైనా, ఇల్లైనా, ఆఫీసైనా ఆఖరికి స్మశానమైనా సరే... ఆకలేస్తే వెంటనే ఫోన్‌లో ఫుడ్ ఆర్డరిచ్చేస్తాం. కానీ ఆ ఫుడ్‌ని వేడివేడిగా మీకు నిమిషాల్లో అందించే డెలివరీ బాయ్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఆకలి తీర్చేందుకు వాళ్లు ప్రాణాలు కూడా ఫణంగా పెడుతున్నారని మీకు తెలుసా?

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  4. హిందూ యువ వాహిని ‘విద్వేష ప్రసంగం’ కేసులో దిల్లీ పోలీసుల అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు అసంతృప్తి

    హిందూ ధర్మ సంసద్‌లో విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దిల్లీ పోలీసుల తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

    గత ఏడాది దిల్లీలో జరిగిన హిందూ యువ వాహిని సమావేశంలో ఎటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదంటూ దిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది.

    మే 4లోపు మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.

    సీనియర్ జర్నలిస్ట్ ఖుర్బన్ అలీ, పట్నా హై కోర్టు మాజీ న్యాయమూర్తి అంజన ప్రకాశ్‌లు వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచారిస్తోంది.

  5. హిజాబ్ ధరించిన అమ్మాయిలను పరీక్షలకు అనుమతించలేదనే ఆరోపణలను విచారిస్తామన్న బసవరాజు బొమ్మై

    కర్నాటకలో హిజాబ్ ధరించిన అమ్మాయిలను పరీక్షకు అనుమతించలేదంటూ వచ్చిన వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు.

    ఆ ఘటన గురించి తన వద్ద పూర్తి సమాచారం లేదని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆ విషయాన్ని విచారిస్తారని ఆయన తెలిపారు.

    కర్నాటకలోని ఉడుపిలో హిజాబ్ ధరించిన ఇద్దరు అమ్మాయిలను పరీక్షకు అనుమతించలేదనే వార్తలు వచ్చాయి.

    కొన్ని పాఠశాలలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై ఈ అమ్మాయిలు కోర్టులో పోరాడుతున్నారు.

    హిజాబ్ ధరించి పీయూసీ పరీక్షలు రాయడానికి వచ్చిన ఈ అమ్మాయిలను అనుమతించకపోవడంతో వారు పరీక్షలు రాయకుండానే వెనక్కి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ఆంధ్రప్రదేశ్: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత

    ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

    ఫొటో సోర్స్, KL University/YouTube

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సప్పెన్షన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వెంటనే ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి రెండేళ్లు పూర్తయింది. మళ్లీ ఆయన సస్పెండ్ పొడిగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన కారణాలు చూపించలేక పోవడంతో సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది.

    చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారిగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

    సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్ కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు.

    1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వెంకటేశ్వరరావు డీజీపీ ర్యాంక్‌లో ఉన్నారు.

  7. 250 కోట్ల ఏళ్ల కిందటి ఖాజాగూడ రాళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది

  8. నరేంద్ర మోదీ: ‘బ్రిటన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే పూర్తి చేస్తాం’

    భారత ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    దిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ల సమావేశం ముగిసింది. అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు.

    భారత్, బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేయడంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక పాత్ర పోషించారని మోదీ అన్నారు.

    బ్రిటన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద రెండు దేశాలకు చెందిన అధికారులు పని చేస్తున్నారని, ఇది త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు.

    రక్షణ, టెక్నాలజీ, తయారీ వంటి రంగాల్లో బ్రిటన్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని మోదీ వెల్లడించారు.

  9. అమెరికా: ‘భారత్ మీద ఆంక్షలపై తుది నిర్ణయం తీసుకోలేదు’

    అమెరికా అధికారి డెరిక్ చాలెట్

    ఫొటో సోర్స్, ANI

    రష్యా నుంచి S-400 మిసైల్స్‌ను కొనుగోలు చేసిన భారత్ మీద ఆంక్షలు విధించడంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారి డెరిక్ చాలెట్ తెలిపారు.

    భారత్, అమెరికా భవిష్యత్తు సంబంధాల మీద తాము దృష్టి పెట్టామని వెల్లడించారు.

  10. విజయవాడ గ్యాంగ్ రేప్: నిందితులను ఉరి తీయాలంటూ చంద్రబాబు డిమాండ్

    టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, TDP

    విజయవాడ గ్యాంగ్ రేపు ఘటనలో బాధితురాలిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నేడు పరామర్శించారు.

    అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

    బాధితురాలికి న్యాయం చేయడంతోపాటు ఉద్యోగం కూడా ఇవ్వాలని ఆయన కోరారు.

  11. వీధుల్లోకి వచ్చేస్తున్న మొసళ్లు

  12. కర్నాటక: హిజాబ్ ధరించిన అమ్మాయిలను పరీక్షకు అనుమతించలేదనే ఆరోపణలు

    కర్నాటకలోని ఉడుపిలో హిజాబ్ ధరించిన ఇద్దరు అమ్మాయిలను పరీక్షకు అనుమతించలేదనే వార్తలు వచ్చాయి.

    కొన్ని పాఠశాలలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై ఈ అమ్మాయిలు కోర్టులో పోరాడుతున్నారు.

    హిజాబ్ ధరించి పీయూసీ పరీక్షలు రాయడానికి వచ్చిన ఈ అమ్మాయిలను అనుమతించకపోవడంతో వారు పరీక్షలు రాయకుండానే వెనక్కి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. ‘పార్టీలు మార్చడం ప్రశాంత్ కిశోర్ వ్యాపారం’

    ప్రశాంత్ కిశోర్

    రాజకీయ పార్టీలను మార్చడమనేది ప్రశాంత్ కిశోర్ వ్యాపారమని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ విమర్శించారు.

    ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘ప్రశాంత్ కిశోర్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. ఇది ఆయన వ్యాపారం.’ అని దిలీప్ ఘోష్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. దిల్లీ: మొదలైన మోదీ, బోరిస్ జాన్సన్‌ల చర్చలు

    దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చర్చలు ప్రారంభించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. దిల్లీ: రోహిణి కోర్టులో మళ్లీ కాల్పులు

    దిల్లీలోని రోహిణి కోర్టులో మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

    కోర్టులోకి ప్రవేశించే ఒక ద్వారం వద్ద ఈ ఘటన జరిగినట్లు సీనియర్ జర్నలిస్ట్ సుచిత్ర మొహంతి తెలిపారు.

    ఈ ఘటనలో ఒక న్యాయవాది, మరొక కక్షిదారు గాయపడ్డారు.

    న్యాయవాది మీద సెక్యూరిటీ ఆఫీసర్ కాల్పులు జరపడం దురదృష్టకరమని నార్త్ దిల్లీ లాయర్స్ అసోసియేషన్ సెక్రటరీ వినీత్ జిందాల్ అన్నారు.

    పోయిన ఏడాది సెప్టెంబరు 24న కూడా రోహిణి కోర్టులో కాల్పులు జరిగాయి. నాడు ముగ్గురు మరణించారు.

  16. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కలిసిన ఎస్. జైశంకర్

    భారత పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కలిశారు.

    భారత్, బ్రిటన్ సంబంధాలపై ఇద్దరు చర్చించినట్లు ప్రభుత్వం తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. హైదరాబాద్: 250 కోట్ల ఏళ్ల వయసున్న ఈ రాళ్లు భవిష్యత్తులో మనకు కనిపించవా?

    హైదరాబాద్ ఖాజాగూడలో ఉన్న ఈ రాళ్లు 250 కోట్ల ఏళ్ల నాటివని నిపుణులు చెప్తున్నారు. మెహెర్ బాబా 9 రోజులు ధ్యానం చేసిన గుహ కూడా ఇక్కడే ఉంది. ఇలాంటి ప్రాకృతిక అద్భుతాల్ని పరిరక్షించుకోవాలని వాళ్లు పోరాడుతున్నారు.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  18. విజయవాడ గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు పోలీసుల సస్పెన్షన్

    విజయవాడలో మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని అమ్మాయిపై అత్యాచార ఘటనలో ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. కమిషనర్ కాంతి రాణా టాటా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.

    విధుల్లో అలసత్వం వహించారంటూ సీఐ హనీష్,సెక్టార్ ఎస్సై శ్రీనివాసరావులను సస్పెండ్ చేస్తూ విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా ఆదేశాలు జారీ చేశారు.

    ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నేడు బాధితురాలిని పరామర్శించనున్నారు.

  19. ఆంధ్రప్రదేశ్: ఆర్‌ఐ‌పై దాడిలో వాహనాలు సీజ్

    బుల్‌డోజర్‌కు అడ్డుపడిన ఆర్‌ఐ అరవింద్

    ఫొటో సోర్స్, UGCs

    ఫొటో క్యాప్షన్, బుల్‌డోజర్‌కు అడ్డుపడిన ఆర్‌ఐ అరవింద్

    ఆంధ్రప్రదేశ్లో మట్టి తవ్వకం దారులు రెవెన్యూ ఇన్ స్పెక్టర్పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.

    విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి జరిగిందని ఆర్‌ఐ అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో రంగంలో దిగిన గుడివాడ రూరల్ పోలీసులు మట్టి తవ్వకాలకు వినియోగిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

    ఆ ప్రాంతంలో కొన్ని రోజులుగా రాత్రి వేళ మట్టితవ్వకాలకు పాల్పడుతున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని ఆర్ఐ మీడియాకు తెలిపారు. గురువారం రాత్రి 12గంటల సమయంలో తహశీల్దార్ ఆదేశాలతో తాను ఘటనా స్థలానికి వెళ్లానని వెల్లడించారు.

    అప్పటికే వీఆర్ఓ, వీఆర్ఐ చెబుతున్నప్పటికీ మట్టి తవ్వకాలు ఆపకపోవడంతో తాను జోక్యం చేసుకున్నానని, అక్కడున్న వాహనాలను రెవెన్యూ కార్యాలయానికి తరలించాలని ఆదేశించినా మట్టితవ్వకం దారులు అంగీకరించలేదన్నారు.

    అదే సమయంలో ఆదేశాలు ఉల్లంఘించి మట్టితవ్వకాలకు యత్నించడంతో తాను జేసీబీకి అడ్డుపడ్డానని ఆర్‌ఐ వివరించారు. ఆ సమయంలో లక్ష్మణరావు, ఆయన బంధువు రాధాకృష్ణ తనపై దాడి చేసి మొఖం మీద కొట్టి, చొక్కా చింపేశారని తెలిపారు.

    ఆర్‌ఐ సుధాకర్‌తో గొడవపడుతున్న మట్టి తవ్వకం దారులు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, ఆర్‌ఐ సుధాకర్‌తో గొడవపడుతున్న మట్టి తవ్వకం దారులు
  20. తెలంగాణలో ఎవరి రాజకీయ పాదయాత్ర గమ్యం చేరనుంది