You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యా - యుక్రెయిన్‌ యుద్ధం: యుక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల సైనిక సాయం ప్రకటించిన బైడెన్

అమెరికా వారం రోజుల కిందట యుక్రెయిన్‌కు 80 కోట్ల డాలర్ల సాయం ప్రకటించింది. దానికి అదనంగా ఇప్పుడు మరో 80 కోట్ల డాలర్ల సాయం ఇస్తామని చెప్పింది.

లైవ్ కవరేజీ

  1. ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’.. ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 41 ఏళ్లు.. అసలేం జరిగింది?

    ఆ రోజు సోమవారం. 1981ఏప్రిల్ 20. ఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు అది. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో కాల్పుల ఘటన జరిగింది ఆ రోజే. నాటి కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అసలేం జరిగింది?

  2. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ ఇకపై కుదరదా?

  3. ఏపీ హై కోర్టు: ‘సినిమా టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదు’

    ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. సినిమా టికెట్ ధరల నిర్ణయాధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది.

    సినిమా టికెట్ ధరల నిర్ణయాధికారం లైసెన్సింగ్ అథారిటీకి మాత్రమే ఉంటుందని వెల్లడించింది. సర్వీసు ఛార్జీలను టికెట్ ధరలలో చేర్చడం సరికాదని కూడా చెప్పింది.

    ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కొనసాగుతుందని తెలుపుతూ తదుపరి విచారణ జూన్ 15కి వాయిదా వేసింది.

    ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల చుట్టూ కొంతకాలంగా వివాదం జరుగుతోంది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.

    ఆ తర్వాత దానిని సవరిస్తూ మొన్నటి మార్చి 7న మరో జీవో విడుదలయ్యింది. దానిని పలువురు మల్టీఫ్లెక్స్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  4. బ్రేకింగ్ న్యూస్, జహంగీర్‌పురి నిర్మాణాల కూల్చివేత కేసు విచారణ రెండు వారాలకు వాయిదా

    దిల్లీలోని జహంగీర్‌పురీలో నిర్మాణాల కూల్చివేతను ఆపిన సుప్రీం కోర్టు, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అక్కడ యథాతథ స్థితిని పాటించాలంటూ అధికారులను ఆదేశించింది.

    కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

  5. ‘దిల్లీలో అన్ని అక్రమ కట్టడాలుంటే ఒక మతం వారియే ఎందుకు కూలుస్తున్నారు?’

    దిల్లీలోని జహంగీర్‌పురిలో కూల్చివేతలపై నేడు సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.

    దిల్లీలో 1,731 అక్రమ కట్టడాలు ఉంటే ఒక మతానికి చెందిన వారి నిర్మాణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది దుశ్వంత్ దవే కోర్టుకు తెలిపారు.

    మరొకవైపు నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కూల్చివేతకు ముందు నోటీసులు ఇవ్వాలంటూ నిబంధనలు ఏమీ లేవని కోర్టుకు విన్నవించారు.

    ఇటీవల దిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్‌పురీలో మత కలహాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పాలనలోని నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుల్‌డోజర్‌తో జహంగీర్‌పురీలోని కొన్ని నిర్మాణాలను కూల్చి వేయడం ప్రారంభించింది.

    దీని మీద నిన్న సుప్రీం కోర్టులో పిటీషన్ వేయగా కూల్చి వేతను ఆపుతూ తాము విచారణ పూర్తి చేసే వరకు యథాతథ స్థితిని పాటించాలంటూ ఆదేశించింది.

    అక్రమ నిర్మాణాలను తాము కూల్చి వేస్తున్నామంటూ నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చెబుతుండగా ఒక వర్గం వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.

  6. ‘కాన్వాయ్ కోసం కారు తీసుకున్నారనే వార్తలపై సీఎం జగన్ సీరియస్’

    ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా కాన్వాయ్ కోసం అంటూ తిరుపతి వెళ్లే వారి నుంచి కారు తీసుకున్నారనే వార్తలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

    కాన్వాయ్ కోసం వాహనాలను సమకూర్చాలంటూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారనే కథనాలు సీఎం దృష్టికి చేరాయని వెల్లడించింది.

    సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పింది.

  7. సారీ చెప్పిన హీరో అక్షయ్‌కుమార్.. కారణం ఇదే

  8. ‘ఎప్పుడూ రాత్రి బయట తిరగలేదు, కానీ ఇప్పుడు రాత్రంతా గస్తీ కాస్తున్నా’

    వీఆర్వో ఉద్యోగం వదిలి... పోలీస్ ఉద్యోగంలో చేరారు. ఎస్సైగా రాత్రంతా పెట్రోలింగ్ చేస్తూ విధి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను బీబీసీతో పంచుకున్నారు లాలాపేట ఎస్సై బెల్లంకొండ రేణుక

  9. భారత పర్యటనలో భాగంగా గుజరాత్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేడు గుజరాత్‌కు చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు.

    వాణిజ్యం, ఇండో-పసిఫిక్ రీజియన్, దౌత్య సంబంధాలు వంటి అంశాల మీద ఇద్దరు నేతలు చర్చించనున్నారు.

    నైపుణ్యం కలిగిన భారతీయులు బ్రిటన్‌లో ఉపాధి అవకాశాలు పొందేలా మరింత ఎక్కువ సంఖ్యలో వీసాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు బోరిస్ జాన్సన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

    గుజరాత్ పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమాన్ని బోరిస్ జాన్సన్ సందర్శించనున్నారు. అలాగే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని కూడా కలిసే అవకాశం ఉందని ఎన్‌డీటీవీ తెలిపింది.

  10. విదేశీ నాయకులను మోదీ తన సొంత రాష్ట్రానికి ఎందుకు ఎక్కువగా తీసుకెళ్తున్నారు?

  11. వచ్చే 6న తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 6న తెలంగాణలో పర్యటించనున్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ పాలనా వైఫల్యాల మీద రాహుల్ గాంధీ ప్రజలను చైతన్యపరచనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

    వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిచనున్నారు.

  12. నేడు బిర్లా కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభించనున్న వైఎస్ జగన్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లాలో బిర్లా కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభించనున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    సుమారు రూ.2,700 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ తెలిపారు.

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అనపర్తి నియోజకవర్గం‌లో టీడీపీ, జనసేన నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

  13. ‘కరోనా సంక్షోభం మాదిరే రష్యా, యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలో ఆకలి కేకలు పెరుగుతాయ్’

    యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది.

    సరఫరా తగ్గి ధరలు పెరగడం వల్ల చాలా మంది ప్రజలకు ఆహారం దొరక్కుండా పోతుందని, తద్వారా పోషకాహార లోపం ఏర్పడుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ ఆందోళనవ్యక్తం చేశారు.

    కరోనా సంక్షోభం మాదిరే ప్రపంచంలోని పేదలే దీనికి బలవుతారని, వారి దగ్గర డబ్బులు తక్కువగా ఉండటం వల్ల వారు తక్కువగా తింటారని ఆయన అంటారు.

  14. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

  15. రష్యా - యుక్రెయిన్‌ యుద్ధం: యుక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల సైనిక సాయం ప్రకటించిన బైడెన్